నా గురించి

Tuesday, October 13, 2009

డాక్టర్ నటరాజ రామకృష్ణ


'''డాక్టర్ నటరాజ రామకృష్ణ''' ఆంధ్రనాట్యము పేరిణీతాండవము నవజనార్ధనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. ఈయన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాడు. ఆంధ్రనాట్యము ఒక పురాతన ''లాస్య'' నర్తనం. పదవ శతాబ్దంలోని కాకతీయ సామ్రాజ్య కాలంలో, మగవారు నాట్యం చేసే ''పేరిణీ శివతాండవం'' ఉండేది. ప్రబంధ నాట్య సాంప్రదాయానికి సంబంధించిన ''నవజనార్ధనం'' గత 400 ఏళ్ళుగా తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం లోని ''కుంతీమాధవ మందిరం'' లో ప్రదర్శింపబడుతోంది.

==గురువులు, నాట్య ప్రస్థానం==
నటరాజ రామకృష్ణ 21 మార్చి, 1933 లో కళాకారుల వంశంలో జన్మించాడు. ఆయన తనలోని కళాతృష్ణాన్వేషణలో ఎందరో గురువులను కలుసుకొని, వారి నుండి ఎన్నో నాట్యరీతుల్ని నేర్చుకున్నాడు. వారిలో మీనాక్షి సుందరం పిళ్ళై, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, ''శ్రీమతి నాయుడుపేట రాజమ్మ'', మరియు ''పెండెల సత్యభామ'' లు ఉన్నారు. ఆయన ఇచ్చిన నాట్య ప్రదర్శనలు-'' శ్రీ వేంకటేశ్వర కల్యాణం'' 'కుమార సంభవము మేఘ సందేశం'. ఉజ్జయిని లో ప్రదర్శింపబడిన కుమార సంభవానికి ''స్వర్ణకలశం'' లభించింది. నటరాజ రామకృష్ణ వ్రాసిన నలభై పైచిలుకు పుస్తకాలలో ఆరింటికి భారత ప్రభుత్వ పురస్కారం లభించింది. వాటిలో ''దాక్షిణాత్యుల నాట్యకళాచరిత్ర'' , ''ఆంధ్రులు - నాట్యకళారీతులు'' ప్రసిద్ధ గ్రంథాలు.

ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ కి ఒకప్పుడు చైర్మన్‌గా ఉండిన డాక్టర్ నటరాజ రామకృష్ణ గత యాభై ఏళ్ళుగా నాట్యకళను ముందుకు నడిపిస్తున్నాడు. ఆంధ్రనాట్యానికి ప్రత్యేకమైన ''సాత్వికాభినయము'' చేయడంలో డాక్టర్ నటరాజ రామకృష్ణ ఉద్ధండుడు.

==అవార్డులు, పురస్కారాలు==

1. నటరాజ : తన 18 వ ఏట, ''రాజా గణపతి రావు పాండ్య'' చే ప్రదానం చేయబడింది.

2. భారత కళాప్రపూర్ణ : 1968 లో ''ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ'' వారిచే.

3. భారతకళా సవ్యసాచి : 1979 లో ''పశ్చిమ గోదావరి జిల్లా కళాకారుల సంఘం'' చే.

4. కళాప్రపూర్ణ : 1981 లో ''ఆంధ్ర విశ్వవిద్యాలయం'' నుండి.

5. కళాసరస్వతి : 1982 లో హైదరాబాదు లోని ''కళావేదిక'' ద్వారా.

6. దక్షిణ భారతపు ఉత్తమ నాట్యాచార్యుడు : 1984 లో ''కేంద్ర సంగీత నాటక అకాడమీ'' ద్వారా.


7. ఉత్తమ పరిశోధకుడు : 1986 లో ఎల్.వి.ఆర్. ట్రస్ట్, మద్రాసు నుండి - పేరిణీ శివతాండవంపై పరిశోధనకు.

8. ఆస్థాన నాట్యాచార్యుడు : 1980 శ్రీశైలం దేవస్థానం, ఆంధ్రప్రదేశ్.

9. ఆస్థాన నాట్యాచార్యుడు : 1980 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.

10. అరుదైన పురస్కారం : 1985 లో ''ఆంధ్రప్రదేశ్ కళాప్రేమికులు'' ఆయనకు స్వర్ణకిరీటాన్ని బహూకరించారు.

11. శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం : 1991 లో.

12. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ అవార్డ్ : 1995 లో

13. పద్మశ్రీ : భారత ప్రభుత్వం చే.

14. కళాసాగర్ అవార్డ్ : 1999 లో.

15. విశిష్ట పురస్కారం : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ 2000

==ఇంకా==
నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం మరియు పేరిణీ నృత్యాల పురోగతికై, లక్షా ఏభై వేల రూపాయలతో ''నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం'' సంస్థను నెలకొల్పాడు. దీని ద్వారా వర్ధమాన కళాకారులకు, వృద్ధ కళాకారులకు ధన సహాయం, పింఛను అందజేస్తారు. నటరాజ రామకృష్ణ లేకపోతే ఆంధ్రనాట్యం, పేరిణీశివతాండవము ఏనాడో మరుగున పడిపోయేవి. ఆ మధ్య ఆయన శిథిలమవుతున్న హైదరాబాదులోని ''తారామతి మందిరము'' మరియు ''ప్రేమావతి మందిరము'' లను బాగు చేయించాడు. ఒకప్పుడు తారామతి మరియు ప్రేమావతులు గోల్కొండ నవాబు, కుతుబ్ షాహి ఆస్థాన నర్తకీమణులు.

==వనరులు==
* [http://in.geocities.com/sirisha_andhranatyam/nrk.html] డాక్టర్ నటరాజ రామకృష్ణ గురించి.

0 వ్యాఖ్యలు:

Post a Comment

Powered By Blogger

నెలవారీ పోస్టులు

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    11 years ago