'''అబ్బూరి రామకృష్ణారావు''' (1896-1979) ప్రముఖ తెలుగు భావకవి, పండితుడు. రామకృష్ణారావు గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని అనంతవరం గ్రామంలో లక్ష్మీనరసింహశాస్త్రి, బాపమ్మ దంపతులకు 1896, మే 20 న జన్మించాడు. ఆయన చిన్నతనంలో తిరుపతి వెంకట కవులలో ఒకడైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తరచుగా అబ్బూరి తండ్రి గారి ఇంటికి వస్తుండేవాడు. బలిజేపల్లి లక్ష్మీకాంతం, గోవిందరాజులు సుబ్బారావులు అబ్బూరికి మిత్రులు.
అబ్బూరి మైసూరులోని సంస్కృత కళాశాలలో చేరినప్పుడు, అప్పటి విద్యాధికారి కట్టమంచి రామలింగారెడ్డి, 1915 లో అచ్చైన అబ్బూరి యొక్క మల్లికాంబను చదివి మెచ్చుకొన్నాడు. అదృష్టం కొద్దీ, అబ్బూరికి అక్కడే ఉన్న రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మతో స్నేహం కుదిరింది. అబ్బూరి 1916లో వీణా శేషన్న వద్ద కొంతకాలం పాటు వీణను కూడ నేర్చుకొన్నాడు. 1918లో అబ్బూరి, రవీంద్రనాథ్ టాగోర్ ను కలుసుకొని బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలను వినడం జరిగింది. కోడి రామమూర్తిని ప్రశంసిస్తూ, "ఆంధ్రవీర కంఠీరవ" అనే పద్యాన్ని వ్రాయడం జరిగింది.
పదగుంఫన అబ్బూరి ప్రత్యేక ప్రతిభ. గీతాలలో గొప్ప హుందా గోచరిస్తుంది. ఉత్తమ సంస్కృత కావ్యాలలోని పూర్ణతా, గౌరవమూ, గాంభీర్యమూ ఈయన పద్యాలలో ప్రతిబింబిస్తవి. నన్నయ నాటి అక్కరలకు మార్పులు తెచ్చి, కొత్త నడకలు నడిపించడమే కాకుండా, స్వకపోలకల్పితాలైన నూతన ఛందస్సులు కూడా కల్పించాడు. ఈయన పద్యాలలో ఒక్క పలుకు పట్టి చూచినా ఉత్తమ సంస్కారి అని తెలుస్తుంది.
;కృతులు
#ఊహాగానము-పూర్వప్రేమ
#మల్లికాంబ
#నదీసుందరి.
అబ్బూరి 30 ఏప్రిల్ 1979 రోజు మరణించాడు. చనిపోవడానికి నాలుగు రోజుల ముందు ఆయన ఇలా వ్రాసుకొన్నాడు. "చచ్చిపోయి జీవి ఎచ్చట కేగునో ఏమి యగునో ఎవరికెరుగరాదు, ఎరుకలేని వారలేమేమో చెప్పగా విని తపించువారు వేనవేలు."
Almighty
-
Almighty
- Nagaraju Raveender • Palaparti Indrani
The glowing fish
At the bottom of the sea
The twirling baby
Within the womb
The blood- tinged
C...
11 years ago
0 వ్యాఖ్యలు:
Post a Comment