'''సామల సదాశివ''', ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉర్దూ రచయిత, హిందుస్తానీ సంగీత పండితుడు.http://www.hindu.com/lf/2005/02/02/stories/2005020214040200.htm హిందుస్తానీ సంగీతాన్ని తొలిసారిగా తెలుగు పాఠక లోకానికి పరిచయం చేసిన తొలి తెలుగు రచయిత. సదాశివ ఆదిలాబాదు జిల్లా, దహేగావ్ మండలం తెలుగు పల్లెలో1928, మే 11 న జన్మించాడు. సదాశివకు తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు,ఉర్దూ, ఫారసీ మరియు మరాఠీభాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ఉర్దూ పత్రిక సియాసత్ లో సదాశివ వ్యాసాలు అనేక ఏళ్ళుగా ప్రచురించబడ్డాయి. సదాశివ ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యి ఆదిలాబాదు పట్టణంలో నివసిస్తున్నాడు.
సామల సదాశివ పేరు వినగానే మనకు మలయమారుతాలు, సంగీత శిఖరాలు, యాది వంటి వ్యాస సంకలనాలు గుర్తుకొస్తాయి. ఇంక అంజద్ రుబాయీలు, ఉర్దూ సాహిత్య చరిత్ర, మౌలానా రూమీ మస్నవీ, ఉర్దూ కవుల కవితా సామగ్రి, మిర్జా గాలిబ్ పుస్తకాలు కూడ గుర్తుకొస్తాయి. మిర్జా గాలిబ్ (జీవితము, రచనలు), ఉర్దూ సాహిత్య చరిత్ర (అనువాదము) వంటి రచనలలో మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు గోచరిస్తాయి. ఆమూలాగ్రం చదివిస్తాయి.
మలయ మారుతాల్లో అతడు మనకు హిందుస్తానీ సంగీత ప్రపంచాన్ని, అందులోని మేటి కళాకారుల్నీ, వారి గొప్పదనాన్ని ఆత్మాభిమానాన్ని కళ్ళకు కట్టినట్టు వివరిస్తాడు. ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకు పోయేట్టు చెప్పెడం అతనికున్న ప్రత్యేకత. అతని భాషా, శైలీ చాలా సహజ సుందరంగా ఉంటాయి.ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్, హీరాబాయి బరోడేకర్, బడే గులాం అలీఖాన్, అల్లాదియా ఖాన్, బేగం అఖ్తర్, గంగూబాయి హంగల్, కేసర్ బాయి కేర్కర్, ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్, ఇలా ఎందరో సంగీత విద్వాంసులను, వారు ఆలపించే విధానాలను సదాశివ మనకు వివరిస్తాడు. తరువాత ఇక మనము హిందుస్తానీ రాగాల్ని రేడియోలోనో, క్యాసెట్ల రూపంలోనో, ఇంటర్నెట్లోనో వినకుండా ఉండలేనంతగా మనలో హిందుస్తానీ సంగీతం పట్ల అభిరుచిని కలిగిస్తాడు.
Almighty
-
Almighty
- Nagaraju Raveender • Palaparti Indrani
The glowing fish
At the bottom of the sea
The twirling baby
Within the womb
The blood- tinged
C...
11 years ago
2 వ్యాఖ్యలు:
యాది సదాశివ తెలుగు పాఠకులకు తక్కువగా తెలిసిన వారిలో ఒకరు. వీలు చేసుకుని వారి పుస్తక పరిచయాలు చేస్తాను.
తప్పకుండా చేయండి cbrao గారూ !
Post a Comment