'''ఠాట్''' : 20 వ శతాబ్దంలోని గొప్ప హిందుస్తానీ సంగీతజ్ఞులలో వొకడైన విష్ణు నారాయణ్ భాత్ఖండె (1860 - 1936) , ప్రకారం హిందుస్తానీ రాగాలన్నీ పది ఠాట్‌ల పైనే ఆధారపడి ఉంటాయి. అవి: 1.మార్వా 2.బిలావల్ 3.కాఫి 4.ఖమాజ్ 5.కల్యాణ్ 6.భైరవి 7.భైరవ్ 8.పూర్వి 9.అసావేరి 10.తోడి. ఉదాహరణకు, రాగ్ పురియా ధనశ్రీ మరియు రాగ్ శ్రీ లు పూర్వి ఠాట్‌కు చెందుతాయి. అలాగే మాల్‌కౌంస్ రాగము భైరవి ఠాట్‌కు, దర్బారి కానడా రాగం అసావేరి ఠాట్‌కు చెందుతాయి. పైన ఉదహరించిన ప్రతి ఠాట్ పేరుతో ఒక రాగం కూడా ఉండొచ్చు. కాని ఠాట్ వేరు, రాగం వేరు. ఠాట్ హిందుస్తానీ సంగీతంలో ఒక రకమైన సంగీత కొలమానం.
1. '''మార్వా రాగం''' : ఇది మార్వా ఠాట్ కు చెందిన రాగం. స్వరాలు - స రి గ మ ద ని . ఇందులో తీవ్ర మధ్యమ్ (మ), కోమల రిషభ్ (రి)లు ఉంటాయి. మిగతా నాలుగు స్వరాలన్నీ శుద్ధ స్వరాలే.
* ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ మార్వా ఠాట్ పరిగణలోకే వస్తాయి.
2.'''బిలావల్ రాగం''' : ఇది బిలావల్ ఠాట్ కు చెందిన రాగం. ఇది ప్రాత: కాల రాగం. స్వరాలు - స రి గ మ ప ద ని. అన్నీ శుద్ధ స్వరాలే. * ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ బిలావల్ ఠాట్ పరిగణలోకే వస్తాయి.
3. '''కాఫి రాగం''' : ఇది కాఫి ఠాట్ కు చెందిన సాయంకాల రాగం. స్వరాలు - స రి గ మ ప ద ని. గాంధార్ (గ) మరియు నిషాద్(ని)లు కోమలములు. మిగతావి శుద్ధ స్వరాలు. * ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ కాఫి ఠాట్ పరిగణలోకే వస్తాయి.
4. '''ఖమాజ్ రాగం''' : ఇది ఖమాజ్ ఠాట్ కు చెందిన సాయంకాల రాగం. ఇందులో నిషాదము(ని) కోమలశుద్ధ స్వరాలు. * ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ ఖమాజ్ ఠాట్ పరిగణలోకే వస్తాయి.
5. '''కల్యాణ్ రాగం''' : ఇది కల్యాణ్ ఠాట్ కు చెందిన సాయంకాల రాగం. స్వరాలు - స రి గ మ ప ద ని. ఐదు స్వరాలు ఆరోహణ, ఏడు స్వరాలు అవరోహణ ; తీవ్ర మధ్యమ్; మిగతావన్నీ శుద్ధ స్వరాలు * ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ కల్యాణ్ ఠాట్ పరిగణలోకే వస్తాయి.
6. '''భైరవి రాగం''' : ఇది భైరవి ఠాట్ కు చెందిన ఉదయకాల రాగం. స్వరాలు - స రి గ మ ప ద ని. రిషభము(రి), గాంధారము(గ), దైవతము(ద), మరియు నిషాదము(ని) కోమల స్వరాలు; శుద్ధ మధ్యమ్. * ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ భైరవి ఠాట్ పరిగణలోకే వస్తాయి.
7. '''భైరవ్ రాగం''' : ఇది భైరవ్ ఠాట్ కు చెందిన రాగం. ఇది ప్రాత: కాల రాగం. స్వరాలు - స రి గ మ ప ద ని. రిషభము(రి) మరియు దైవతము(ద) కోమలములు. మిగతావన్నీ శుద్ధ స్వరాలు. * ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ భైరవ్ ఠాట్ పరిగణలోకే వస్తాయి.
8. '''పూర్వి రాగం''' : ఇది పూర్వి ఠాట్ కు చెందిన రాగం. ఇది సంధిప్రకాశ రాగం. అంటే సంధ్య వేళలో పాడే రాగం. స్వరాలు - స రి గ మ ప ద ని. రిషభము(రి) మరియు దైవతము(ద) కోమల స్వరాలు. మధ్యమము(మ) తీవ్రము మరియు శుద్ధము. గాంధారము(గ) మరియు నిషాదము(ని) శుద్ధ స్వరాలు. * ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ పూర్వి ఠాట్ పరిగణలోకే వస్తాయి.
9.''' అసావేరి రాగం''' : ఇది అసావేరి ఠాట్ కు చెందిన ఉదయకాల రాగం. స్వరాలు - స రి గ మ ప ద ని. ఐదు స్వరాలు ఆరోహణ, ఏడు స్వరాలు అవరోహణ. గాంధారము(గ), దైవతము(ద) మరియు నిషాదము(ని) కోమల స్వరాలు. మిగతావి శుద్ధ స్వరాలు. * ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ అసావేరి ఠాట్ పరిగణలోకే వస్తాయి.
10. '''తోడి రాగం''' : ఇది తోడి ఠాట్ కు చెందిన రాగం. ఇది ప్రాత: కాల రాగం. స్వరాలు - స రి గ మ ప ద ని. రిషభము(రి), గాంధారము(గ)మరియు దైవతము(ద) కోమలములు; తీవ్ర మధ్యమ్; శుద్ధ్ నిషాద్. * ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ తోడి ఠాట్ పరిగణలోకే వస్తాయి.
==మూలాలు== * [http://www.itcsra.org/] ఐ.టి.సి. సంగీత్ రీసెర్చ్ అకాడమీ
Almighty
-
Almighty
- Nagaraju Raveender • Palaparti Indrani
The glowing fish
At the bottom of the sea
The twirling baby
Within the womb
The blood- tinged
C...
0 వ్యాఖ్యలు:
Post a Comment