నా గురించి

Wednesday, October 21, 2009

కొన్ని గీతార్థ పద్యములు





( కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన........)

కర్మలు సుకర్మములనగ
కర్మ ఫలమ్ములను మరిచి కర్మించవలెన్.
కర్మలు యజ్ఞమని తలచి
కర్మ ఫలంబు పరమాత్మ కర్పింపవలెన్.

( జాతస్య హి ధ్రువో మృత్యు: ధ్రువం జన్మ మృతస్యచ:  .....)

గిట్టిన వానికి జననము
పుట్టిన వానికి మరణము పొలుచును ; పవనుం
డెట్టుల తావిని మోయునొ
యట్టుల వాసనలు గల్గు నాత్మకు యెపుడున్.

( నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావక:....)

వాయువు చేతను యెండదు
ఆయుధము వలన విరుగదు; అంగారమునన్
 మాయదు, చావదు దేనితొ ;
తోయము చేతను తడవదు తుదకున్ పార్థా!

( యత్ర యోగీశ్వర కృష్ణో, యత్ర పార్థో ధనుర్ధర :.... )

ఎక్కడ కృష్ణుడు గలడో!
ఎక్కడ గాండీవి పార్థుడెచటన్ గలడో!
అక్కడ విజయము తథ్యము
నక్కడ సంపదలు గల్గు నైశ్వర్యములున్.


0 వ్యాఖ్యలు:

Post a Comment

Powered By Blogger

నెలవారీ పోస్టులు

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    11 years ago