ఆదిశంకర దేవుడవతరించిన దివ్య
ఖండమ్ము; కవికర్షకుండు హలము
కలములం బట్టి బంగారు పంటలను పం
డించినట్టి పొలమ్ము; ఋషులు సురలు
సంచరించిన యట్టి స్థానమ్మిది శివమ్ము;
నటరాజు గిరికన్య నాట్యమాడు
కైలాస శిఖరమ్ము కాలవాలమ్ము; పా
వనగంగ ప్రవహించు ప్రాంగణమ్ము
శ్రీలు పొంగిన గడ్డ; సజీవ నదుల
బెడ్డ ; నాల్గు వేదమ్ముల పీట; పరమ
హంసలను గన్న పరమ సాధ్వి; సుచరిత్ర;
భరత ఖండంబు యిది మన భారతాంబ.
--మూసీ పత్రిక (నవంబర్ 2008) లో ప్రచురితం.
Almighty
-
Almighty
- Nagaraju Raveender • Palaparti Indrani
The glowing fish
At the bottom of the sea
The twirling baby
Within the womb
The blood- tinged
C...
11 years ago
0 వ్యాఖ్యలు:
Post a Comment