నా గురించి

Tuesday, October 13, 2009

మా వూరు ఎలగందల్



'ఎలగందల్', కరీంనగర్ జిల్లా, కరీంనగర్ మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామం కరీంనగర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంది.

==గ్రామ నామం==

ఈ గ్రామం చుట్టు పక్కల పూర్వం తెల్ల కందులు ఎక్కువగా పండేవట. అలా తెలికందుల, ఎలగందులగా మారి పేరు స్థిరపడిందని చెబుతారు.

==చరిత్ర==
ఈ గ్రామం పూర్వం కాకతీయుల పాలనలోను, తరువాత ముస్లిం రాజుల పాలనలోను ఉన్నప్పటి చరిత్రాత్మక చిహ్నాలు ఇక్కడ చూడవచ్చును. ఈ గ్రామం ఎంతో చారిత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పూర్వం ఐదుగురు రాజవంశీయులు పరిపాలించారు. వారు కాకతీయులు, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొగలులు, ఆసఫ్ జాహీలు. ఇక్కడ ఓ పురాతనమైన కోట (ఖిల్లా) ఉంది. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు దీనిని పర్యాటక స్థలంగా గుర్తించారు. ఎత్తైన కోట గోడలు, అగడ్తలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులు, రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ ఖిల్లా అలరారుతోంది. ఈ గ్రామం లోనే ఇంకో చివర "దో మినార్ "అనే కట్టడం ఉంది.

==రవాణా సదుపాయాలు==
కరీంనగర్ నుండి కమాన్ పూర్, బావుపేట మీదుగా ప్రైవేటు బస్సులు తిరుగుతుంటాయి.దూరం రమారమి 22 కి.మీ.

==విద్య, వైద్య సదుపాయాలు==
ఈ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలు(ఒకటి నుండి పదవ తరగతి వరకు) ఉన్నాయి.ఆరోగ్య కేంద్రం లేదు కాని ఊళ్ళో కొందరు ఆర్.ఎమ్.పీ. డాక్టర్లు ఉన్నారు.

గమనిక: ఈ గ్రామాన్ని వీక్షించాలనుకొంటే ఈ వీడియోని క్లిక్ చేయండి.

0 వ్యాఖ్యలు:

Post a Comment

Powered By Blogger

నెలవారీ పోస్టులు

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    11 years ago