'''బాల గంధర్వ''' అసలు పేరు , ''నారాయణ్ శ్రీపాద్ రాజ్‌హంస్'' ( 1888 - 1967 ). మరాఠీ గాయకుడు మరియు నాటక కళాకారుడైన బాల గంధర్వ స్త్రీ పాత్రలు ధరించేవాడు. ఎందుకంటే ఆ కాలంలో స్త్రీలను నాటకాల్లో వేషాలు వేయనిచ్చేవారు కాదు.
== సంగీత ప్రస్థానం == ఒకసారి పుణె నగరంలోనారాయణ్ తన పది పండ్రెండేళ్ళ వయసులో పాడగా విని, లోకమాన్య బాలగంగాధర తిలక్ నారాయణ్‌కు ''బాల గంధర్వ'' అని బిరుదు నిచ్చాడు. బాల గంధర్వ ఎన్నో నాటకాలలో వేషాలు వేసి, మరాఠీ నాట్య గీతాలను పాడి, ప్రజలలో వాటికి ఎంతో ప్రాచుత్యాన్ని కలుగజేశాడు. అతడు ''భాస్కర్- బువా బఖ్లే'' శిష్యుడు. బాల గంధర్వ సమకాలికులు ''కేశవరావ్ భోస్లే'' మరియు దీనానాథ్ మంగేష్కర్ లు. 1905 లో ''కిర్లోస్కర్ సంగీత మండలి'' లో బాల గంధర్వ తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించాడు. బాల గంధర్వ, ''గణ్‌పత్ రావ్'', ''గోవిందరావు టెంబే'' లు ఆ కంపనీని విడిచిపెట్టి, 1913లో ''గంధర్వ సంగీత మండలి'' ని స్థాపించారు. కాని అది అప్పుల్లో కూరుకు పోయింది. అంతలోనే గౌహర్ జాన్ ఏప్రిల్, 1938 లో వాళ్ళ కంపనీలో చేరింది. నారాయణ్ రావ్ ఆమె 1951 లో వివాహమాడారు. గౌహర్ 1964లో మరణించింది. నారాయణ్ రావ్ 1967 లో మరణించాడు. పుణె లోని ''బాల గంధర్వ ఆడిటోరియం'' అతని గౌరవార్థంగా పిలువబడుతోంది.
== ప్రముఖ పాత్రలు == బాల గంధర్వ వేసిన ప్రముఖ పాత్రలు : 1. భామిని - ''మాన్‌అపమాన్'' లో. ( 1911 ) 2. రుక్మిణి - రుక్మిణీ స్వయంవరం లో. ( 1916 ) 3. సింధు - '' ఏకచ్ ప్యాలా'' లో. ( 1919 )
Almighty
-
Almighty
- Nagaraju Raveender • Palaparti Indrani
The glowing fish
At the bottom of the sea
The twirling baby
Within the womb
The blood- tinged
C...
0 వ్యాఖ్యలు:
Post a Comment