
ఉన్మాది చేతిలో ఉసిగొల్పబడిన ఆయుధం
ఉడుకు నెత్తురును రుచి చూచిన వైనం
ఉలిక్కిపడిన ప్రపంచం
ఉవ్వెత్తుగ ఎగసిన కోపానల ప్రభంజనం
యుద్దంలో శత్రువును చంపడం నేరం కాదు
అడవిలో జంతువులను చంపి తినడం
పులికి వినోదం కాదు
కరడు గడుతున్న భావాలు
గురి తప్పుతున్న బాణాలు
మారుతున్న లక్ష్యాలు
ఆడదామని వస్తే రక్తం ఓడాల్సి వచ్చిందేమిటి !
గుండెలో రాయి పడిన మైదానం -
గాయపడిన మైదానం.
( పాకిస్తాన్‌లో మన క్రికెట్ ఆటగాళ్ళపై జరిగిన దాడి గురించి చదివాక )
0 వ్యాఖ్యలు:
Post a Comment