నా గురించి

Tuesday, October 13, 2009

ఉస్తాద్ ఫయ్యాజ్‌ ఖాన్

'''ఉస్తాద్ ఫయ్యాజ్‌ ఖాన్''' : ఉస్తాద్ ఫయ్యాజ్‌ ఖాన్ ఉత్తరప్రదేశ్, ఆగ్రా సమీపంలోని సికందర లో 1886 లో జన్మించాడు.
==జీవిత చరిత్ర==

ఫయ్యాజ్‌ ఖాన్ తండ్రి సఫ్దర్ హుసేన్ ఖాన్ రంగీలా ఘరానా కు చెందిన వాడు. ఆగ్రా ఘరానా కు చెందిన తన తాత, ఘగ్ఘె ఖుదాబక్ష్ నుండి, ఫయ్యాజ్‌ ఖాన్ సంగీత పాఠాలు నేర్చుకొన్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా సంగీత సమావేశాలకు హాజరౌతూ, సంగీత జ్ఞానాన్ని పెంపొందించుకొని, ఆ ప్రాంతంలో గొప్ప గాయకుడుగా పేరు తెచ్చుకొన్నాడు. ఫయ్యాజ్‌ ఖాన్ వల్లనే, ఆగ్రా ఘరానా గాయన శైలి పరిపూర్ణతను సంతరించుకొన్నది. అతడు ఠుమ్రి, దాద్రా, గజల్ లను అద్భుతంగా పాడి శ్రోతలను ఆకట్టుకొనేవాడు. చాలాకాలం బరోడా లో ఆస్థాన విద్వాంసుడిగా ఉన్నాడు.అక్కడే అతనికి '''జ్ఞానరత్న''' పురస్కారం ఇవ్వబడింది.
మైసూర్ మహారాజా అతడికి ''''ఆఫ్తాబె మౌసికి'''' (ఆఫ్తాబ్=సూర్యుడు, మౌసికి=సంగీతం) = ''''సంగీత మార్తాండుడు'''' అని బిరుదు నిచ్చి, సన్మానించాడు.
ఉస్తాద్ ఫయ్యాజ్‌ ఖాన్‌కు ''బ్రజ భాష'' పై మంచి పట్టు ఉండేది. అతని వ్యాసాలు ''ప్రేమ్ పియా'' అనే కలం పేరుతో అచ్చౌతుండేవి.

==శిష్యులు==

దిలిప్ చాన్ బేడి మరియ్ రతజన్‌కర్ లు.
==విడుదలైన రికార్డులు==

1. రామ్‌కలి (రాగం) నెం. N 3 6 0 5 0
2. పూర్వి ‍‍‍‍‍‍‍‍‍‍‍‍మరియు ఛాయా H 1 3 3 1
3. పురియా మరియు జయజయవంతి HH1
4. జౌన్‌పురి మరియు కాఫి H 7 9 3

0 వ్యాఖ్యలు:

Post a Comment

Powered By Blogger

నెలవారీ పోస్టులు

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    11 years ago