నా గురించి

Tuesday, October 13, 2009

యమునాచార్యుడు


'''యమునాచార్యుడు''' (తమిళంలో యమునత్తురైవర్) లేక ''అళవందార్'' 11వ శతాబ్దం మధ్యభాగంలో శ్రీరంగంలో నివసించిన వైష్ణవ బోధకుడు. విశిష్ఠాద్వైతాన్ని ప్రవచించిన రామానుజుడు యమునాచార్యుడి శిష్యుడే. యమునాచార్యుని రచనలు ఆయన శిష్యుడు ప్రవచించిన విశిష్ఠాద్వైతానికి మూలబీజాలు వేశాయని భావిస్తారు.An Outline of the Religious Literature of India By John Nicol Farquhar పేజీ.241 [http://books.google.com/books?id=JiH-Icf98NIC&pg=PA241&dq=yamunacharya]

==బాల్యం, జీవితం==
10 వ శతాబ్దంలోని నాథముని యమునాచార్యుడి తాత. యమునాచార్యుడు 916 ప్రాంతంలో వీరనారాయణపురం (ఆధునిక కాలంలో దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని మన్నార్‌గుడి) లో ధాత నామ సంవత్సరం కర్కాటక మాసం, పూర్ణిమ, శుక్రవారం, ఉత్తరాషాఢ నక్షత్రంశ్రీ యమునాచార్య వైభవము, ఈ.ఏ.ఆర్.రామన్, సప్తగిరి ఆగష్టు 2006 పత్రికలో ప్రచురించిన వ్యాసం. లో జన్మించాడు.Bulletin By Institute of Traditional Cultures పేజీ.62 [http://books.google.com/books?id=y1M5AAAAIAAJ&q=yamunacharya&dq=yamunacharya&pgis=1]. ఈయన తండ్రి ఈశ్వరముని. యమునాచార్యుడు వేదాలను, తర్కమీమాంసాలను ''రామమిశ్రుడి'' (మనక్కాళ్ నంబి ) వద్ద చదువుకొన్నాడు. తన చిన్నతనంలోనే యమునాచార్యుడు పాండ్యరాజు రాజగురువైన, ''అక్కియాల్వాన్'' ను తర్కంలో ఓడించగా, రాజు రాణి సంతోషించి, అతనికి అర్ధరాజ్యాన్ని సమర్పించుకొని రాజును చేశారు. దేవాలయంలో రంగనాథుని దర్శనం అయిన తరువాత, యమునాచార్యుడు సన్యాసిగా మారి శరణాగతిని పొందాడు. అక్కడే ఆయన ''చతుశ్లోకి'', ''స్తోత్రరత్న'' లను ఆశువుగా రచించాడు.
మనక్కాళ్ నంబి నాథముని విద్యాలయ బాధ్యతల్ని, యామునికి అప్పజెప్పాడు. దివ్యప్రబంధాన్ని కూడా అతనికి ఇచ్చాడు. కొన్నాళ్ళకు తను చేయాల్సిన పనులు పూర్తికావడం లేదని, కలత జెంది యమునాచార్యుడు రామానుజుడికి కబురు పెట్టాడు. దురదృష్టవశాత్తూ, ఆయన రాక ముందే యమునాచార్యుడు పరమపదించాడు. అపుడు ఆయన మూడు చేతివేళ్ళు మడచి ఉండడం చూసి, రామానుజుడు తను చేయాల్సిన మూడు పనులేవో అర్థం చేసుకొన్నాడు.http://www.srivaishnava.org/sva/alavan.htm
1. పరాశరుడి పేరు అర్హుడైన వానికిచ్చి, అతని పేరు చిరస్థాయిగా నిలపడం.
2. నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళి కి భాష్యం వ్రాయడం.
3. ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మ సూత్రాలకు టీకా వ్రాయడం.

==రచనలు==
యమునాచార్యుని రచనలలో సిద్ధాంత పరంగా, దర్శన పరంగా అతి ముఖ్యమైనది ''సిద్ధిత్రయం''. ఇందులో ఆత్మసిద్ధి, సంవిద సిద్ధి, ఈశ్వర సిద్ధి. ఈ మూడు విశిష్టాద్వైతంలోని, ఆత్మకు, ప్రపంచానికి, పరమాత్మకు ఉన్న సంబంధాన్ని విశదీకరించేవి. యమునాచార్యునికి ముందు పంచరాత్ర ఆగమాలు క్షుద్రమైనవని, వేదాలకు వ్యతిరేకమని ఇతర శాఖల వారు భావించేవారు.The Indian economic and social history review By Delhi School of Economics పేజీ.481 [http://books.google.com/books?id=b-qwAAAAIAAJ&q=yamunacharya&dq=yamunacharya&pgis=1] ''ఆగమ ప్రామాణ్యం''లో శ్రీవైష్ణవులకు ముఖ్యమైన గ్రంథాలైన పంచరాత్ర సాహిత్యం యొక్క పురాతనతను, పవిత్రతను బలంగా నొక్కి చెప్పే ప్రయత్నం చేశాడు. ''గీతార్ధ సంగ్రహ''లో మోక్షసాధనలో భక్తి మార్గం యొక్క ప్రాముఖ్యతను ఉల్లేఖించాడు.Religious movements and institutions in Medieval India By J. S. Grewal, Project of History of Indian Science, Philosophy, and Culture పేజీ.113 [http://books.google.com/books?id=MSkvAAAAYAAJ&q=yamunacharya&dq=yamunacharya&pgis=1]

* చతుశ్లోకి - లక్ష్మీదేవి స్తోత్రం.
* స్తోత్రరత్నం - నారాయణుని స్తోత్రం.
* సిద్ధిత్రయం - ఆత్మసిద్ధి, సంవిత సిద్ధి, ఈశ్వర సిద్ధి. ఈ మూడు విశిష్టాద్వైతంలోని, ఆత్మకు, ప్రపంచానికి, పరమాత్మకు ఉన్న సంబంధాన్ని విశదీకరించేవి.
* ఆగమ ప్రామాణ్యం.
* మహాపురుష నిర్ణయం - నారాయణుడు లక్ష్మీదేవీల జంటయే పరమసత్యం అని వక్కాణించేది.
* మాయావాద ఖండనం.

0 వ్యాఖ్యలు:

Post a Comment

Powered By Blogger

నెలవారీ పోస్టులు

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    10 years ago