నా గురించి

Tuesday, October 13, 2009

మెదక్ చర్చి


'''మెదక్ చర్చి''' : మెదక్ చర్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో, ఏడవ నెంబరు రహదారిపై హైదరాబాదుకు 90 కి.మీ. దూరంలో ఉంది.

==చరిత్ర==
మొదటి ప్రపంచయుద్ధ కాలం లో, మెదక్ జిల్లాలో కరువు సంభవించింది. అప్పుడు మిషనరీ, రెవెరెండ్ . చార్లెస్ వాకర్ పోస్నెట్ (Rev. Charles Walker Posnett), చర్చి నిర్మాణం తలపెట్టి, "''పనికి ఆహార పథకం''" ప్రవేశపెట్టాడు - " గ్రామస్థులు ఎవరైతే చర్చి నిర్మాణంలో పాల్గొంటారో, వారికి ఆహారం ఇవ్వబడుతుంది." "మెతుకులు" అనగా అన్నం, అందుకే ఆ ప్రాంతానికి "మెదక్" అని పేరు వచ్చింది. అలా ఈ చర్చి నిర్మాణం, 1914 నుండి 1924 వరకు కొనసాగింది. ఇది ఆసియాలోనే అతి పెద్దది. ప్రపంచంలో , వాటికన్ చర్చి తరువాత, అతి పెద్దదైన ఈ చర్చి వాస్తుశిల్పి ఎడ్వర్డ్ హార్డింగ్ (Edward Harding). పూర్తిగా తెల్లరాయితో కట్టబడిన ఈ నిర్మాణం కోసం, ఆరు రంగుల మిశ్రమం కలిగిన చతురస్రపు పలకలను ఇంగ్లాండు నుండి, మేస్త్రీలను బొంబాయి నుండి తెప్పించారు. ఇంకా పాలరాతిని ఇటలీ నుండి తెప్పించారు. వారానికొకసారి, నేలను, అద్దాలను కిరోసిన్ కలిపిన కొబ్బరినూనెతో తుడుస్తారు. కిటికీ రంగుటద్దాలపై వ్రాయబడిన వాక్యాలు, ఇంగ్లీషు, తెలుగు, హిందీ భాషలలో కనిపిస్తాయి. మొదట వాక్యాలు హిందీలో లేవు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ సోదరి, విజయలక్ష్మి పండిట్ ఈ చర్చిని సందర్శించినప్పుడు, జాతీయభాష అయిన హిందీలో వ్రాయించింది.

0 వ్యాఖ్యలు:

Post a Comment

Powered By Blogger

నెలవారీ పోస్టులు

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    10 years ago