కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే
క్షీయన్తే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం
ఇది భర్తృహరి నీతి శతకంలో విద్వత్పద్ధతిని చెప్పే శ్లోకాల్లో ఒకటి.
పురుషుని భుజకీర్తులు అలంకరించవు. అలాగే, చంద్రుడిలా తెల్లని కాంతితో ప్రకాశించే ముత్యాల హారాలు కూడా అలంకారం కాదు. స్నాన విలేపనాలు, పువ్వులూ, ఎంచక్కా పెంచుకున్న జుట్టూ - ఇవేవీ మనుషునికి నిజమైన అలంకారాన్ని ఇవ్వవు.
ఒక్క వాణి (వాక్కు, మాట) మాత్రమే మనిషిని అలంకరిస్తుంది. ఎటువంటి వాక్కు? యా సంస్కృతా ధార్యతే - తర్క వ్యాకరణాది శాస్త్రములచే చక్కచేయబడి ధరించిన వాక్కు - అంటే చదువు, పాండిత్యం. మిగతా అలంకారాలన్నీ క్షీణించవచ్చు, వాక్కు అనే భూషణం ఎప్పటికీ వన్నె తరగక కలకాలం అలంకరిస్తుంది.
ఓ చిన్నారులారా ! మీరే ఆశల పునాదులు. మీరే భవిష్యత్తుకు బాటలు. 'అసంభవం' అనే మాటకు అర్థం తెలియని మీరు నిరంతరం జవసత్వాలను నింపుకొని అభివృద్ధి పథంలో పయనించండి.
హృదయంలో నుంచి వినేవాడికే ఈ సృష్టి సమస్తం తన దైవత్వాన్ని వినిపిస్తుంది.
* * *
మన జీవితమంతా ఆ దైవానికే అర్పింపబడిన ప్రార్థన కావాలి
* * *
ఓ ప్రభూ! నా హృదయాన్ని మలినం లేని స్ఫటికంలా ఉంచు. అప్పుడు అందులో నువ్వే గోచరిస్తావు.
* * *
మనలో ప్రతివారికీ ఒక పాత్ర, ఒక కార్యం,ఒక చోటు నిర్దేశింపబడి ఉంటాయి.
* * *
నిరంతరం జ్వలించే హృదయంతో ముందుకు సాగుదాం.
* * *
సౌందర్యమా! నువ్వే దైవాన్ని చేరుకొనే నా మార్గానివి.
* * *
సత్యప్రీతి, జ్ఞానతృష్ణతో సాగే మన జీవితాలను ఆ సత్యప్రీతి, జ్ఞానతృష్ణలే నడిపించాలి.
* * *
మన జీవితంలోని అన్ని పరిస్థితులు,అన్ని సంఘటనలు అనుభవైక్యవేద్యంగా మనకు కొత్త పాఠాలు నేర్పాలి.
* * *
నీవు ఆ భగవంతునికి నిజమైన ఉపకరణానివి కావాలంటే, నీవు చేసే పనిలో పరిణతి ఏ మాత్రం తగ్గకూడదు. * * *
నీ ఆశయాల జ్వాల ఎంత సూటిగా, తీవ్రంగా ఉండాలంటే అది ఎలాంటి అవాంతరాలనైనా తట్టుకొని నిలబడి ఉండగలగాలి.
* * *
చిత్తశుద్ధితో చేసే ప్రార్థనలు అంగీకరింపబడుతాయి.
* * *
లోకులు ఏమి ఆలోచిస్తారు? ఏమి చేస్తారు? ఏమి మాట్లాడుతారు? అన్నది ముఖ్యం కాదు. నీకూ భగవంతునుకీ మధ్య ఉన్న సంబంధమే ముఖ్యం.
* * *
ఓ ప్రభూ! నేను నీ ముందు ఒక స్వచ్చమైన తెల్ల కాగితాన్ని. నీవు నీ సంకల్పాన్ని ఎలాంటి అడ్డు లేకుండా, సాంకర్యం లేకుండా లిఖించు.
* * *
నీవు దేనినైనా పరివర్తింప జేయగల అద్భుతమైన ఇంద్రజాలికుడవు. వికృతము నుండి సౌందర్యాన్ని, బురద నుండి స్వచ్చమైన నీటిని, అజ్ఞానము నుండి జ్ఞానమును, అహంకారము నుండి దయనూ సృష్టించ గలవు.
* * *
నిజాయతీలోనే నిశ్చయమైన విజయము ఉంది. నిజాయతీ! ఓ నిజాయతీ! నీ నైర్మల్యం ఎంత తీయనైనది.
* * *
నీవు దేనినైన ఆ దైవము నుండి దాచాలని ప్రయత్నిస్తే, తప్పకుండా నీవు ముక్కు పగిలేలా నేలపై పడతావు.
* * *
గమ్యం లేని జీవితం ఎప్పుడూ దుర్భరమైన జీవితమే.
* * *
నీకు శక్తినీ, రక్షణనూ ఇచ్చే సత్యాన్నే ఆశ్రయించు.
* * *
కష్టాలకు కూడ కృతజ్ఞతగా ఉండు. అవి భగవంతుని వద్దకు చేర్ఛె దగ్గరి దారులు.
* * *
మనము ప్రశాంత మనస్కులమై ఉన్నప్పుడే, సరియైన పనిని,సరియైన రీతిలో, సరియైన సమయంలో చేయగలుగుతాము.
* * *
అలజడిలో శాంతి ,ప్రయత్నంలో ప్రశాంతత, శరణంలో ఆనందం, ఒక మహా జ్వాల వంటి విశ్వాసం - ఇవన్నీ నీకు దేవుని ఉనికిని చెప్పకనే చెబుతుంటాయి.
* * *
ఎల్లప్పుడూ ఔన్నత్యం కొరకే ప్రయత్నిద్దాం. మనమెప్పుడూ సాధించిన దానితొ తృప్తిపడవద్దు.
* * *
ఓ నా ప్రియమైన ప్రభూ! నీ ప్రేమతత్వాన్ని నాకు బోధిస్తూ ఉండు. * * *
అసత్యానికి దూరంగా ఉండు. నిర్మలమైన ఆత్మప్రకాశంతో జీవించు. అప్పుడు నీవు భగవంతునికి చాలా దగ్గరగా నివసిస్తావు.
* * *
మనము ఒక నిశ్చలమైన మనసుతో ముందుకు సాగాలి. జరగాల్సింది జరుగుతుంది.
* * *
ఎలాంటి ఆపదలోనైనా మనము నిబ్బరంగా ఉండగలుగుతే, పరిష్కారం దానంతట అదే కనబడుతుంది.
* * *
...... పట్టును సడలించకు . ప్రయత్నాలన్నీ వమ్మైనప్పుడే తిరిగి అన్నీ నీకు లభించవచ్చు.
* * *
సూర్యుడు మబ్బుల్ని ఎలా చెల్లాచెదరు చేస్తాడో, అలా చిరునవ్వు కష్టాల్లో అతిక్రమింప జేస్తుంది.
* * *
నువ్వేదైతే చెబుతావో అదే ఎల్లప్పుడూ చెయ్. కాని నీవు చేసేవన్నీ చెప్పడం ఒక్కోసారి విజ్ఞత అనిపించుకోదు.
* * *
ఒక మంచి కార్యాలోచన జరగకుండా గడచిన దినము, ఒక ఆత్మరహితమైన దినము.
* * *
నీవు జీవితాన్ని చిరినవ్వుతో ఆహ్వానిస్తే, జీవితం నిన్ను చిరునవ్వుతో ఆహ్వానిస్తుంది.
* * *
నిత్య సత్యాన్వేషి అసమగ్రతను, అతిశయోక్తిని, అస్తవ్యస్తతను, అవి ఎంత లేశమాత్రమున్నా సరే అంటుకోకూడదు.
* * *
నిరర్థకపు మాటలతోనే ప్రపంచం చెవిటిదయింది.
* * *
మనము మన ఆలోచలను జాగ్రత్తగా గమనిస్తుండాలి. ఒక చెడు తలంపు అతి ప్రమాదకరమైన దొంగ వంటిది.
* * *
శాంతమధురములైన దైవస్మరణలు శ్వేతకపోతాల వంటివి.
* * *
ఈ స్వచ్చత, నైర్మల్యము ఆ దేవుని ప్రభావాన్ని మాత్రమే అంగీకరిస్తాయి.
* * *
అంతరంగంలో దాగిన ప్రశాంతాతతను పట్టుకో. దానిని శరీర కణాల్లోకి చొప్పించు. ప్రశాంతాతత వలననే స్వస్థత చేకూరుతుంది.
* * *
మనం మన మనసులోని అసత్యాలను ఎలా శక్తియుతంగా నిరాకరిస్తామో, అలా శరీరం అస్వస్థతను నిరాకరించాలి.
* * *
అది ఎంత కష్టతరమైన కార్యమైన కానీ, నువ్వు ఉత్తమం అనుకున్న దాన్నే చెయ్.
* * *
అంధకారబంధురమైన, పీడకల వంటి ఈ మాయజగత్తులో, ఆ దైవం తన అస్తిత్వాన్ని అణువణువునా ఏదో రూపంలో ప్రకటిస్తూనే ఉంటుంది.
* * *
సరియైన కార్యాచరణ కొరకు మనం మన శక్తిని,మౌనంలో, కేంద్రీకరణలో సమీకరించుకోవాలి.
* * *
మనం దేని గురించి ఆలోచిస్తుంటామో, అదే మన చుట్టూ ఉంటుంది.
* * *
నీవు ఒకరి గురించి మంచిగా ఆలోచించలేకపోతే, అతని గురించి ఆలోచించడం పూర్తిగా మానివేయడమే ఉత్తమం.
* * *
ఆ భగవంతుడు నీ ఆలోచనలను పూర్తిగా ఆక్రమించుకొను గాక!
* * *
నీ చేతనను వికృతమైన ఆలోచనలతో, అనుభూతులతో మలినం చేసుకోకు. అవి నిన్ను నా రక్షణ నుండి దూరంగా తీసుకొని పోతాయి.
* * *
మానవుడిని క్రూరాత్ముడిగా ఆ దేవుడు సృజించలేదు. మానవుడే తనను తాను దైవం నుండి వేరుపరచుకొని క్రూరాత్ముడిగా మారతాడు.
* * *
కోరికలారా! వెనక్కి వెళ్ళిపొండి. పురోగమించకండి. ఓ దుష్టబుద్ధీ! ద్వేషభావమా! తిరోగమించండి. పురోగమించకండి.
* * *
అందుకొన్న సంతోషం కన్న, నువ్వు పంచి యిచ్చే సంతోషమే నిన్ను మరింత సంతోషపరుస్తుంది.
* * *
ఇద్దరు వ్యక్తులు తగవులాడుకున్నారు అంటే, తప్పు ఎప్పుడూ ఇద్దరి వైపూ ఉందన్న మాట.
* * *
శత్రువుని చూసి నవ్వే చిరునవ్వు, అతనిని నిరస్త్రుణ్ణి చేస్తుంది.
* * *
సంశయం ప్రమాదకరమైంది; ఆట కాదు. ఆత్మను క్రమక్రమంగా నాశనం చేసే విషబిందువు.
* * *
లేనిది ఉన్నట్టూ, ఉన్నది లేనట్టూ కనిపించే ఈ భ్రాంతి ప్రపంచానికి ఆధారం, నీ దైవికమైన చిరునవ్వే.
* * *
ఇతరుల తప్పులకు కోపగించుకొనే ముందు , మనం మన తప్పులను ముందుగా గుర్తుకు తెచ్చుకోవాలి.
* * *
అసూయ అనేది ప్రాణాంతకమైన విషం. అది ఆత్మ వినాశకారిణి.
* * *
మనలో ఉండే లోపాల్నే మనం ఇతరుల్లో గమనిస్తాము. మన చుట్టూ బురద కనిపిస్తూంది, అంటే అది మనలోనే ఎక్కడో ఉందన్న మాట.
* * *
అసంతృప్తితో గొణగడం మాను. అలా చేసినప్పుడు ఎన్నో రకాల కుయుక్తులు నీలో ప్రవేశించి నీ పతనానికి దారి తీస్తాయి.
* * *
పురోగామి సామరస్యానికి ముఖ్యమైన ఆటంకం - ఎదుటి వాడిది తప్పు, మనదే ఒప్పు అని ప్రదర్శించాలనే తహతహ.
* * *
ప్రతి హృదయంలోని దైవం ఉనికి , భవిష్యత్తుకు, పరిణామానికీ మూలం.
* * *
ఎంతటి అసత్యమైనా, చివరికి సత్యం సాధించే విజయాన్ని ఆపలేదు.
* * *
ప్రేమించడమంటే స్వంతం చేసుకోవడం కాదు. తనను తాను సమర్పించుకోవడం.
* * *
నడువు ! ముందుకు నడువు ! భయాన్ని, సంకోచాన్ని వదలి ముందుకు నడువు !
* * *
ప్రపంచాన్ని మార్చాలని అనుకొంటే, మొదట నిన్ను నీవు మార్చుకో .
* * *
ఒక పనిని అతని కంటే బాగుగా చేయగలిగితే తప్ప, నీకు ఆ వ్యక్తిని గూర్చి అంచనా వేసే, నిర్ణయించే అధికారం లేదు.
* * *
* * *
పిరికితనం అహంభావానికి ప్రతీక. నీవు పిరికితనంతో ఉన్నావంటే , దానర్థం నీవు నీ నిజాయితీ కంటే, నీవు నీపై ఇతరుల అభిప్రాయాలకు ప్రాముఖ్యత నిస్తున్నావని. * * *
నిన్ను నిన్నుగా ప్రేమించి,నిన్ను మరొక విధంగా ఉండమని కోరని వాడే నీకు నిజమైన స్నేహితుడు. * * *
స్నేహితులవాలంటే, కలిసి హాయిగా నవ్వుకోవడం కంటే మంచి మార్గం లేదు. * * *
దేవునిపై నమ్మకం, మరియు ఆయన విజయం పై గల అచంచల విశ్వాసమే అసలైన విశ్వాసం. * * *
మనం ఆ ప్రభువు యొక్క సాహస వీరులమని అనుకుంటే, ఆయన మహిమ ప్రపంచం అంతటా వ్యాపిస్తుంది. * * *
సరియైన సమాచారం దొరకనప్పుడు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంత మనస్కులమై ఉండడం మేలు. * * *
లేని కష్టాలను ఊహించుకోకు. అది సమస్యలను ఆహ్వానిస్తుందే తప్ప, అధిగమించడానికి సహాయపడదు. * * *
ప్రతి వస్తువులోను, ప్రతి ప్రాణిలోను, పిల్లతెమ్మెరలోను, జ్వలించే సూర్యుడిలోను నిన్ను నేను దర్శిస్తున్నాను. * * *
ఎట్టి పరిస్థుతులలోనూ, సత్యం కోసం తన శాయశక్తులా వ్యతిరేక శక్తులతో పోరాతాం సలిపే వాడే నిజమైన ధీరుడు. * * *
ఓ ప్రభూ ! నన్ను నీ యొక్క వెలుగును యథాతధంగా, వికృతం చేయకుండా ప్రసరించే ఒక స్వచ్చమైన స్ఫటికం లా ఉంచు. * * *
ఎందుకు నీవు దైవాన్ని తెలుసుకోలేవు ? ఆయన నీ హృదయంలో నే ఉన్నాడు. * * *
ఓ ప్రభూ ! నన్ను నీవైపు సూటిగా నడిపించే చిత్తశుద్ధిని ప్రసాదించు. * * *
తిరిగి చూడకు ! నీ గమ్యం వైపే దృష్టిని సారించు. అప్పుడు నీవు తప్పకుండా అభివృద్ధిని సాధిస్తావు. * * *
నిజాయితీకి గొప్ప శత్రువులు ప్రాముఖ్యతల హెచ్చుతగ్గులు ( భౌతికంగా కానీ, ప్రాణికంగా కానీ, మానసికంగా కానీ ) , పూర్వ నిశ్చితాభిప్రాయాలు - - వీటిని ఎలాగైనా అధిగమించాలి. * * *
దృఢనిశ్చయంతో ధైర్యంగా ఉండు. అడ్డంకులన్నీ వాటంతట అవే తొలగిపోతాయి. * * *
గొప్ప ప్రభావాల మూలాలు నిశ్శబ్దంలోనే దాగి వుంటాయి. * * *
ఒక దీపం మరొక దీపాన్ని ఎలా వెలిగిస్తుందో, అలా ధీరోదాత్తులు ఇతరులకు ధైర్యాన్ని ఇవ్వగలుగుతారు. * * *
సమస్యలను సాధించే శక్తి నిట్టూర్పులో కంటె, చిరునవ్వులోనే ఎక్కువగా ఉంది. * * *
గడ్డు దినాలలో తప్పక దారి చూపెట్టేది విశ్వాసం. * * *
విశ్వాసంతో ముందుకు సాగుదాం. నమ్మకంగా నిరీక్షిద్దాం. * * *
ముందుకు నడువు ! ఎప్పుడూ ముందుకు పో ! ఈ సొరంగం చివర వెలుతురు ఉంది. ఈ సమరం తుద విజయం ఉంది.
- సమాప్తం -
ఆంగ్లంలో సంకలనం : విజయ్ తెలుగు అనువాదం : నాగరాజు రవీందర్ ప్రథమ ముద్రణ : ఫిబ్రవరి 2004 ద్వితీయ ముద్రణ : సెప్టెంబర్ 2006 compiled from the writings of The Mother.
Almighty
-
Almighty
- Nagaraju Raveender • Palaparti Indrani
The glowing fish
At the bottom of the sea
The twirling baby
Within the womb
The blood- tinged
C...