నా గురించి

Showing posts with label నా తెలుగు వికిపీడియా వ్యాసాలు. Show all posts
Showing posts with label నా తెలుగు వికిపీడియా వ్యాసాలు. Show all posts

Tuesday, January 12, 2010

పండిట్ కుమార గంధర్వ


'''పండిట్ కుమార గంధర్వ''' (శివపుత్ర సిద్ధరామయ్య కోంకళి) ఏప్రిల్ 8, 1924 న కర్ణాటక రాష్టంలోని బెల్గాం జిల్లాలోని సులేభావి గ్రామంలో జన్మించాడు. హిందుస్తానీ సంగీతంలో ఏ ఘరానాకు లోబడకుండా, ఒక ప్రత్యేక, వినూత్న శైలిలో ఆలపించే గాయకుడు కుమార గంధర్వ . "కుమార గంధర్వ" అనే బిరుదు ఆయనకు చిన్నతనంలోనే బహూకరించబడింది. హిందూ పురాణాల్లో గంధర్వుడు సంగీతానికి ఆద్యుడైన దివ్యపురుషుడు.

==జీవిత విశేషాలు==
ఆయన చిన్నతనంలో కుమార గంధర్వకు సంగీతంలో ప్రొఫెసర్ బి.ఆర్. డియోధర్ నుండి శిక్షణ లభించింది. 1947 లో భానుమతి కాన్స్‌ను వివాహమాడి, మధ్యప్రదేశ్ లోని "దివాస్" కు మకాం మార్చాడు. అక్కడే ఆయనకు ఊపిరితిత్తుల కాన్సర్ సోకగా, శస్త్రచికిత్స చేసి ఒక ఊపిరితిత్తిని తొలగించారు. శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో మళ్ళీ "ఋణానుబంధాచ్య" వంటి మరాఠీ గీతాలు పాడినా, ఊపిరి అందక, మునుపటిలాగా పాడలేకపోయాడు. కుమార గంధర్వ నిర్గుణి భజనలు జానపద గీతాలు, రాగాలు ఒక విశిష్ట శైలిలో పాడేవాడు. కొందరు ఆయన పాడే విలంబిత్ గాయన పద్ధతిని విమర్శించినా, ద్రుపద్ గాయనాన్ని మెచ్చుకొనేవారు. 1961 లో భానుమతి మరణం తరువాత, కుమార గంధర్వ తన సహ విద్యార్థిని, ''వసుంధరా శ్రీఖండే"ను వివాహం చేసుకొన్నాడు. ఆమె కుమార గంధర్వ తో కలిసి భజనలు పాడేది. వారి కుమార్తె కలాపిని కోంకళి వారికి తాన్‌పురా వాయించేది. ఆయన శిష్యులలో ముఖ్యులు సత్యశీల్ దేశ్ పాండే మరియు శుభా ముద్గల్ లు. కుమార గంధర్వకు 1990 లో పద్మవిభూషణ్ అవార్డ్ లభించింది.


( ఈ రోజు అంటే జనవరి 12, పండిత్ కుమార్ గంధర్వ వర్ధంతిని పురస్కరించుకొని )

పండిత్ కుమార్ గంధర్వ పాడిన రాగాలు , గీతాలు

Wednesday, January 6, 2010

సవాయి గంధర్వ సంగీత మహోత్సవం


'''సవాయి గంధర్వ సంగీత మహోత్సవం''' : భారతీయ శాస్త్రీయ సంగీత ఉత్సవాల్లో, చాలా ప్రాముఖ్యతను సంతరించుకొన్నవి సవాయి గంధర్వ సంగీత మహోత్సవాలు. "ఆర్య సంగీత ప్రసారక మండలి " ప్రారంభించిన ఈ ఉత్సవాలను పండిట్ భీమ్ సేన్ జోషి, ప్రతి యేటా,
పుణె నగరంలో నిర్వహిస్తాడు. ఈ ఉత్సవం సవాయి గంధర్వ జీవితం, సంగీతపరంగా ఆయన సాధించిన విజయాల జ్ఞాపకార్థంగా నిర్వహించబడుతుంది.
డిశంబరు, 2002 లో ఈ ఉత్సవం స్వర్ణోత్సవాలను జరుపుకొంది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీత చరిత్రలో ఈ ఉత్సవం ఒక ప్రత్యేక గుర్తింపును కలిగివుంది. గత యాభై ఏళ్ళుగా, పుణె నగర సంగీతాభిమానులు, విఖ్యాత హిందుస్తానీ సంగీత కళాకారుల మరపురాని కచేరీలను ఈ ఉత్సవాలో విని ఆనందిస్తున్నారు.

==చరిత్ర==
సవాయి గంధర్వ సంగీత మహోత్సవం, హిందుస్తానీ సంగీత చరిత్రలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్నది. భారత స్వాతంత్ర్యానికి పూర్వం, హిందుస్తానీ సంగీతం రాజుల "ఆస్థాన సంగీత విద్వాంసుల సాంప్రదాయం" మూలంగా బ్రతికింది. స్వాతంత్ర్యానంతరం, హిందుస్తానీ సంగీతం భారత్, పాకిస్తాన్ లతో పాటే చీలిపోయి, అటు పాకిస్తాన్, ఇటు భారత దేశం ఎందరో ప్రజ్ఞావంతులయిన సంగీత కళాకారుల్ని కోల్పోయాయి. కొత్త రాజకీయ పరిస్థితుల కనుగుణంగా, ఎలా తమ సంగీతం నిలదొక్కుకుంటుందో అని విచారించి, ఎందరో సంగీత కళాకారులు తమ కళను బ్రతికించుకోవడానికి ఎన్నో సంగీత కచేరీల నిస్తుండేవారు.
ఈ సవాయి గంధర్వ సంగీత మహోత్సవం కళాకారుల నందరినీ సంఘటితంగా, ఒక వేదిక మీదకు తీసుకొని వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా హిందుస్తానీ, కర్ణాటక సంగీతాలను నిత్యనూతనంగా ప్రవేశపెడుతోంది.

ఈ సంగీతోత్సవాల్లో ఇంతవరకు పాల్గొన్నవర్ధమాన మరియు మేటి కళాకారులు : హీరాబాయి బరోడేకర్, డా. వసంతరావు దేశ్‌పాండె, బేగం అక్తర్, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, జాకిర్ హుసేన్ (సంగీతకారుడు), సరస్వతి రాణె, ఉస్తాద్ అహ్మద్‌జాన్ తిరఖ్‌వా, కుమార గంధర్వ, కిశోరి అమోంకర్, పండిట్ భీమ్ సేన్ జోషి లు. ఇంకా, అరుణా సాయిరాం, (కర్ణాటక సంగీతం), గణేశ్ కుమరేశ్ లు (వయొలిన్), పండిట్ జస్‌రాజ్, పండిట్ అజయ్ చక్తవర్తి, మాలిని రాజూర్కర్, పండిట్ రాజన్ సాజన్ మిశ్రా లు (గాత్రం), శ్రీనివాస్ జోషి, పండిట్ శివకుమార్ శర్మ (సంతూర్), రోను మజుందార్ (ఫ్లూట్), అనుజ్, స్మృతి మిశ్రా లు (కథక్).

==సాంప్రదాయం==
ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం డిశంబర్, మొదటి రెండు వారాల్లో, మూడు రోజుల పాటు నిర్వహించబడుతుంది. దేశవ్యాప్తంగా కళాకారులు ఇందులో పాల్గొంటారు. ప్రతి కళాకారుడీకీ, సవాయి గంధర్వ సంగీత మహోత్సవంలో పాల్గొనడం అంటే, ఒక గొప్ప సన్మానంతో కూడుకొన్న అవకాశం. ఈ వేదికపై ఎందరో వర్ధమాన కళాకారులు పరిచయం చేయబడ్డారు. చివరి రోజు ఆఖరున, పండిట్ భీంసేన్ జోషి గాత్రకచేరీ ఉండడం, ఈ ఉత్సవ సాంప్రదాయం. కచేరీ తరువాత అబ్దుల్ కరీంఖాన్ ప్రాశస్త్యానికి తీసుకు వచ్చిన, "భైరవి ఠుమ్రి" రాగం - ''జమునా కే తీర్'' - పండిట్ సవాయి గంధర్వ పాడిన రికార్డును వేయగా, వేలాది శ్రోతలు విని ఆనందిస్తారు.


( రేపటి నుండి, అంటే జనవరి 7 నుండి జనవరి 10, 2010 వరకు పుణె నగరంలో సవాయి గంధర్వ సంగీత మహోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ సందర్భంగా ఈ వ్యాసం పున:ప్రచురణ )

సవాయి గంధర్వ సంగీత మహోత్స వం వెబ్ సైట్

Thursday, November 12, 2009

గౌతమ్ ఘోష్

'''గౌతమ్ ఘోష్''' ప్రఖ్యాత భారతీయ సినిమా దర్శకుడు; మంచి ''ఫోటో జర్నలిస్ట్'' కూడా. అతడు 1950 వ సంవత్సరంలో కోల్‌కతా లో జన్మించాడు.

==సినిమా ప్రస్థానం==
గౌతమ్ ఘోష్ కలకత్తా యునివర్సిటీ నుండి పట్టా పొంది, సినిమాలలో ప్రవేశించాడు. ఆయన మొదటి సినిమా- మా భూమి, తెలుగులో తీసింది. 1930 - 1948 ప్రాంతంలో, హైదరాబాదు నిజాం కు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల గురించి తీసిన సినిమా ఇది; ఎన్నో రోజులు తెలుగు నాట ఆడింది. అతని సినిమాలన్నీ సామాజిక స్థితిగతులనే ప్రతిబింబిస్తుంటాయి.

==ముఖ్యమైన సినిమాలు==
* [[మా భూమి]] ( 1979 )
* దఖల్ ( 1981 )
* పార్ ( 1984 )
* అంతర్జలి జాత్రా ( 1987 )
* పద్మ నాదిర్ మఝి ( 1992 )
* పతంగ్ ( 1993 )
* గుడియా ( 1997 )
* అబర్ అరణ్యె ( 2003 )
* యాత్రా ( 2006 )
* కాల్ బేలా ( 2009 )
* సంగెమీల్ సె ములాఖత్ ( షెహనాయ్ విద్వాంసుడు, [[ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్]] పై తీసిన డాక్యుమెంటరీ )

==బయటి లింకులు==

* [http://www.imdb.com/name/nm0315872/ గౌతమ్ ఘోష్ - ఇంటర్నెట్ మూవీ డేటాబేస్]
* [http://www.calcuttaweb.com/cinema/gautamghosh.shtml ప్రొఫైల్]

Wednesday, November 11, 2009

అబ్దుల్ కరీంఖాన్


'''అబ్దుల్ కరీంఖాన్''' లేదా '''ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్''' (నవంబరు 11, (1872 - 1937) , 20 వ శతాబ్దపు హిందుస్తానీ సంగీతంలోని కిరాణా ఘరానాకు చెందిన వారిలో ప్రముఖుడు.
==జీవితం==
అబ్దుల్ కరీంఖాన్ ఉత్తరభారతంలోని కిరాణా అనే ప్రాంతంలో జన్మించాడు. కిరాణా ఘరానాకు మూలపురుషులు, గులాం అలీ మరియు
గులాం మౌలా లు. కరీంఖాన్ తండ్రి, కాలే ఖాన్ గులాం అలీ మనవడు. కరీంఖాన్ తండ్రి వద్ద మరియు మామ అబ్దుల్లా ఖాన్ వద్ద
శిక్షణను పొందాడు. గాత్రం, సారంగి, వీణ, సితార్, తబలా - వీటన్నిటినీ నేర్చుకున్నాడు కరీంఖాన్.
==సంగీత ప్రస్థానం==
మొదట్లో సారంగి వాయించినా, క్రమంగా గాత్రానికి మళ్ళాడు ; సోదరుడు అబ్దుల్ హక్ తో కలిసి పాడేవాడు. బరోడా రాజు వారి గాత్ర సంగీతానికి ముగ్ధుడై, వారిని తన ఆస్థాన సంగీత విద్వాంసులుగా నియమించాడు. ఇక్కడే కరీంఖాన్ రాజవంశానికి చెందిన తారాబాయ్ మానెను పెళ్ళాడాలనుకున్నాడు. కాని బరోడా నుండి బహిష్కృతులై , ఆ దంపతులు ముంబై చేరుకున్నారు. 1922లో తారాబాయ్ మానె అబ్దుల్ కరీంఖాన్‌ను వదలి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన జీవితంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

మైసూరు దర్బారులో, గొప్ప కర్ణాటక సంగీత గాయకులను కలుసుకోవడం మూలాన, ఆ ప్రభావం ఆయన పాటల్లో కనిపించేది. 1900 లో ఆయన ప్రఖ్యాత గాయకుడు, సవాయి గంధర్వకు ఎనిమిది నెలలు సంగీతాన్ని నేర్పాడు. అక్కడే మరో ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసురాలు, కేసర్‌బాయ్ కేర్కర్ కు శిక్షణ నిచ్చాడు. 1913లో పుణె లో అబ్దుల్ కరీంఖాన్ ఆర్య సంగీత విద్యాలయాన్ని స్థాపించాడు. తరువాత మీరజ్ లో స్థిరపడి, మరణించేంత వరకూ (1937) అక్కడే ఉన్నాడు.

కిరాణా ఘరానా శైలి రాగం, మంద్రస్థాయిలో మొదలయ్యి, విలంబిత్ లయలో మృదుమధురంగా సాగుతుంది. అబ్దుల్ కరీంఖాన్‌ ఠుమ్రీలు కూడా ప్రత్యేక శైలిని కలిగి వుంటాయి. ఆయన ఒక త్యాగరాజ కృతిని కూడా ఆలపించాడు.

==అబ్దుల్ కరీంఖాన్‌ శిష్యుల్లో అగ్రగణ్యులు==
* సవాయి గంధర్వ
* సురేష్‌బాబు మానె
* హీరాబాయ్ బరోడేకర్ లు.

==వనరులు==
*1. [http://www.itcsra.org/tribute.asp?id=1ITC Sangaata Research Acaademy]


(అబ్దుల్ కరీం ఖాన్ జన్మదినం (నవంబర్ 11 ) సందర్భంగా - )

Tuesday, October 27, 2009

విక్రమ్ సేఠ్


'విక్రమ్ సేఠ్' : విక్రమ్ సేఠ్ (జననం: జూన్ 20, 1952 ), భారతీయ ఆంగ్ల నవలా రచయిత, కవి మరియు పద్మశ్రీ పురస్కార గ్రహీత.

=బాల్యం, విద్యాభ్యాసం =

విక్రమ్ సేఠ్ హిందూ కుటుంబంలో పుట్టి, కోల్‌కతా లో పెరిగాడు. టన్‌బ్రిడ్జ్ స్కూల్ మరియు డూన్ స్కూల్‌లో అతని విద్యాభ్యాసం జరిగింది. ఆక్స్‌ఫర్డ్ లోని కార్పస్‌క్రిస్టి కాలేజిలో ఆర్థికశాస్త్రం, తత్వశాస్త్రం, రాజకీయ శాస్త్రం చదువుకొని, స్టాన్‌ఫర్డ్ యునివర్సిటీలో ఆర్థికశాస్త్రంలో పి.జి. చేశాడు. చైనా లోని నాన్‌జింగ్ యునివర్సిటీలో చైనీస్ కవిత్వాన్ని అధ్యయనం చేశాడు. స్టాన్‌ఫర్డ్ యునివర్సిటీ, కాలిఫోర్నియా నుండి ఎమ్.ఏ. డిగ్రీని పొందాడు. ఇతని తల్లి, లీలా సేఠ్, తొలి భారతీయ మహిళా చీఫ్‌ జస్టిస్.

==నవలలు==

1. ది గోల్డెన్ గేట్ ( 1986 ) ; శాన్‌ఫ్రాన్సిస్‌కో గురించి.
2. ఎ సుటెబుల్ బాయ్ ( 1993 ) ; 19 శతాబ్దపు భారతదేశం గురించి.
3. యాన్ ఈక్వల్ మ్యూజిక్.

==కవిత్వాలు==

1. మ్యాపింగ్స్ ( 1980 )
2. ఫ్రమ్ హెవెన్ లేక్ ( 1983 )
3. ద హమ్‌బల్ అడ్‌మినిస్ట్రేటర్స్ గార్డెన్ ( 1985 )
4. ఆల్ యు హు స్లీప్ టునైట్ ( 1990 )
5. బీస్ట్లీ టేల్స్ ( 1991 )
6. త్రీ చైనీస్ పోయెట్స్ ( 1992 )

== అవార్డులు==
* 1983 Thomas Cook Travel Book Award From Heaven Lake: Travels Through Sinkiang and Tibet
* 1985 Commonwealth Poetry Prize (Asia) The Humble Administrator's Garden
* 1993 Irish Times International Fiction Prize (shortlist) A Suitable Boy
* 1994 Commonwealth Writers Prize (Overall Winner, Best Book) A Suitable Boy
* 1994 WH Smith Literary Award A Suitable Boy
* 2001 EMMA (BT Ethnic and Multicultural Media Award) for Best Book/Novel An Equal Music
* 2005 Pravasi Bharatiya Samman
* 2007 పద్మశ్రీ బహుమతి.

==బయటి లింకులు==

* [[http://www.contemporarywriters.com/authors/?p=auth89]]

Monday, October 19, 2009

ఠాట్



'''ఠాట్''' : 20 వ శతాబ్దంలోని గొప్ప హిందుస్తానీ సంగీతజ్ఞులలో వొకడైన విష్ణు నారాయణ్ భాత్ఖండె (1860 - 1936) , ప్రకారం హిందుస్తానీ రాగాలన్నీ పది ఠాట్‌ల పైనే ఆధారపడి ఉంటాయి. అవి:
1.మార్వా  2.బిలావల్  3.కాఫి  4.ఖమాజ్  5.కల్యాణ్  6.భైరవి  7.భైరవ్  8.పూర్వి  9.అసావేరి  10.తోడి.
ఉదాహరణకు, రాగ్ పురియా ధనశ్రీ మరియు రాగ్ శ్రీ లు పూర్వి ఠాట్‌కు చెందుతాయి. అలాగే మాల్‌కౌంస్ రాగము భైరవి ఠాట్‌కు, దర్బారి కానడా రాగం అసావేరి ఠాట్‌కు చెందుతాయి. పైన ఉదహరించిన ప్రతి ఠాట్‌ పేరుతో ఒక రాగం కూడా ఉండొచ్చు. కాని ఠాట్‌ వేరు, రాగం వేరు.
ఠాట్‌ హిందుస్తానీ సంగీతంలో ఒక రకమైన సంగీత కొలమానం.

1. '''మార్వా రాగం''' : ఇది మార్వా ఠాట్ కు చెందిన రాగం. స్వరాలు - స రి గ మ ద ని . ఇందులో తీవ్ర మధ్యమ్ (మ), కోమల రిషభ్ (రి)లు
ఉంటాయి. మిగతా నాలుగు స్వరాలన్నీ శుద్ధ స్వరాలే.

* ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ మార్వా ఠాట్‌ పరిగణలోకే వస్తాయి.

2.'''బిలావల్ రాగం''' : ఇది బిలావల్ ఠాట్ కు చెందిన రాగం. ఇది ప్రాత: కాల రాగం. స్వరాలు - స రి గ మ ప ద ని. అన్నీ శుద్ధ స్వరాలే.
* ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ బిలావల్ ఠాట్‌ పరిగణలోకే వస్తాయి.

3. '''కాఫి రాగం''' : ఇది కాఫి ఠాట్ కు చెందిన సాయంకాల రాగం. స్వరాలు - స రి గ మ ప ద ని. గాంధార్ (గ) మరియు నిషాద్‌(ని)లు
కోమలములు. మిగతావి శుద్ధ స్వరాలు.
* ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ కాఫి ఠాట్‌ పరిగణలోకే వస్తాయి.

4. '''ఖమాజ్ రాగం''' : ఇది ఖమాజ్ ఠాట్ కు చెందిన సాయంకాల రాగం. ఇందులో నిషాదము(ని) కోమలశుద్ధ స్వరాలు.
* ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ ఖమాజ్ ఠాట్‌ పరిగణలోకే వస్తాయి.

5. '''కల్యాణ్ రాగం''' : ఇది కల్యాణ్ ఠాట్ కు చెందిన సాయంకాల రాగం. స్వరాలు - స రి గ మ ప ద ని. ఐదు స్వరాలు ఆరోహణ, ఏడు
స్వరాలు అవరోహణ ; తీవ్ర మధ్యమ్; మిగతావన్నీ శుద్ధ స్వరాలు
* ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ కల్యాణ్ ఠాట్‌ పరిగణలోకే వస్తాయి.

6. '''భైరవి రాగం''' : ఇది భైరవి  ఠాట్ కు చెందిన ఉదయకాల రాగం.  స్వరాలు - స రి గ మ ప ద ని. రిషభము(రి), గాంధారము(గ),   దైవతము(ద), మరియు నిషాదము(ని) కోమల స్వరాలు; శుద్ధ మధ్యమ్.
* ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ భైరవి  ఠాట్‌ పరిగణలోకే వస్తాయి.

7. '''భైరవ్ రాగం''' : ఇది భైరవ్ ఠాట్ కు చెందిన రాగం. ఇది ప్రాత: కాల రాగం. స్వరాలు - స రి గ మ ప ద ని. రిషభము(రి) మరియు 
దైవతము(ద) కోమలములు. మిగతావన్నీ శుద్ధ స్వరాలు.
* ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ భైరవ్  ఠాట్‌ పరిగణలోకే వస్తాయి.  

8. '''పూర్వి రాగం''' : ఇది పూర్వి  ఠాట్ కు చెందిన రాగం. ఇది సంధిప్రకాశ రాగం. అంటే సంధ్య వేళలో పాడే రాగం. స్వరాలు - స రి గ మ ప
ద ని. రిషభము(రి) మరియు  దైవతము(ద) కోమల స్వరాలు. మధ్యమము(మ) తీవ్రము మరియు శుద్ధము. గాంధారము(గ) మరియు
నిషాదము(ని)  శుద్ధ స్వరాలు.       
* ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ  పూర్వి ఠాట్‌ పరిగణలోకే వస్తాయి.

9.''' అసావేరి రాగం''' : ఇది అసావేరి ఠాట్ కు చెందిన ఉదయకాల రాగం. స్వరాలు - స రి గ మ ప ద ని. ఐదు స్వరాలు ఆరోహణ, ఏడు 
స్వరాలు   అవరోహణ. గాంధారము(గ), దైవతము(ద) మరియు నిషాదము(ని) కోమల స్వరాలు. మిగతావి శుద్ధ స్వరాలు.
* ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ  అసావేరి  ఠాట్‌ పరిగణలోకే వస్తాయి.

10. '''తోడి రాగం''' :  ఇది తోడి ఠాట్ కు చెందిన రాగం. ఇది ప్రాత: కాల రాగం. స్వరాలు - స రి గ మ ప ద ని. రిషభము(రి), గాంధారము(గ)మరియు  దైవతము(ద) కోమలములు; తీవ్ర మధ్యమ్; శుద్ధ్ నిషాద్.
* ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ తోడి  ఠాట్‌ పరిగణలోకే వస్తాయి.
 
==మూలాలు==
* [http://www.itcsra.org/] ఐ.టి.సి. సంగీత్ రీసెర్చ్ అకాడమీ



Sunday, October 18, 2009

కిషోరీ అమోంకర్

'''కిషోరీ అమోంకర్''' (మరాఠీ: किशोरी आमोणकर) (జననం: ఏప్రిల్ 10, 1931 ) ప్రముఖ భారతీయ హిందుస్తానీ సంగీత విద్వాంసురాలు. ఈమె జయ్‌పూర్ - అత్రౌలి ఘరానా కు చెందిన ఖయాల్ లను చక్కగా పాడుతుంది.

== బాల్యం, జీవిత చరిత్ర ==
కిషోరీ అమోంకర్ తల్లి, సుప్రసిద్ధ హిందుస్తానీ సంగీత గాయకురాలు, మోగుబాయి కుర్దీకర్. కిషోరీ తల్లి వద్దనే సంగీతాన్ని అభ్యసించింది.

== సంగీత ప్రస్థానం ==
కిషోరీ అమోంకర్ జయ్‌పూర్-అత్రౌలి ఘరానా యొక్క క్లిష్టమైన సంగతులను త్వరలోనే ఆకళింపు చేసుకొని, తన స్వంత గాయన శైలిని రూపొందించుకొంది. ఈమె తన సహజమైన మధుర గాత్రంతో, పురాతన జయ్‌పూర్-అత్రౌలి ఘరానా సాంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా, అలవోకగా రాగాలను ఆలపించి, అటు సంగీత విద్వాంసులను, ఇటు శ్రోతలను ఆకట్టుకొంటుంది. ఆమె గాయనంలో ''బోల్తాన్, ఫిర్తాన్'' ల సౌందర్యం చెక్కుచెదరదు. ఆమె హిందీ మరియు మరాఠీ భక్తిగీతాలు, సంస్కృత, కన్నడ భజనల నెన్నింటినో పాడింది.

== శిష్యగణం ==
మానిక్ భిడె, పద్మా తల్వార్కర్, [[అరుణ్ ద్రావిడ్ , రఘునందన్ పన్శీకర్, వయొలినిస్ట్, మిలింద్ రాయ్కర్, విద్యా భగ్‌వత్, మనవరాలు తేజశ్రీ  అమోంకర్‌లు.

== వ్యక్తిగత జీవితం ==

కిషోరీ అమోంకర్ బడిపంతులు, రవి అమోంకర్‌ను పెళ్ళి చేసుకొంది. ఆయన 1992 లో మరణించాడు. కిషోరీ అమోంకర్ రాఘవేంద్ర స్వామి భక్తురాలు.

== విడుదలైన ఆల్బంలు ==
1. దివ్య (2008)
2. ప్రభాత్ (2000)
3. సాంప్రదాయ (2003)
4.మల్హార్ మాలిక
5. సంగీత్ సర్తాజ్
6. కిషోరీ అమోంకర్ - లైవ్ ఇన్ లండన్
7. దృష్టి
8. బాగెశ్రీ ‍‍‍‍‍‍‍, భూప్ - ఎల్.పి. రికార్డు (1972)

== అవార్డులు ==
*  పద్మవిభూషణ్ అవార్డు ( 2002 )
* గాన సరస్వతి
* సంగీత నాటక అకాడమి అవార్డు ( 1985 )
* పద్మభూషణ్ అవార్డు ( 1987 )
* సంగీత సామ్రాజ్ఞి అవార్డు ( 1997 )

== బయటి లింకులు ==
* [http://www.allaboutjazz.com/php/article.php?id=21461 ఆల్ అబౌట్ జాజ్ పత్రిక]లో కిషోరీ అమోంకర్ గురించి
* http://www.chembur.com/anecdotes/kishori.htm
* [http://profiles.incredible-people.com/kishori-amonkar/ ఇంక్రెడిబల్ పీపుల్ డాట్ కామ్] -కిషోరీ అమోంకర్


అంజద్ అలీ ఖాన్

'''అంజద్ అలీఖాన్''' : ఉస్తాద్ అంజద్ అలీఖాన్ ( జననం- మార్చి, 1946 ) ప్రముఖ భారతీయ సరోద్ విద్వాంసుడు.

== బాల్యం ==
గ్వాలియర్ రాజవంశపు ఆస్థాన సరోద్ విద్వాంసుడైన, తండ్రి హఫీజ్ అలీఖాన్ వద్ద అంజద్ అలీఖాన్ సరోద్ వాదనం నేర్చుకొన్నాడు .ఆయన తండ్రితాతలు ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చినప్పుడు, తమ వెంట తెచ్చిన రబాబ్ (Rabab) ను క్రమంగా సరోద్‌గా తీర్చిదిద్దారు. ఈనాటి సరోద్ సేనియా మైహర్ ఘరానాకు చెందిన ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్, అతని సోదరుడు ఉస్తాద్ ఆయెత్ అలీఖాన్ చేతిలో ఎన్నో మార్పులకు గురైంది.

== సంగీత ప్రస్థానం ==

ఖాన్ సరోద్ వాదనాన్ని ఒక ప్రత్యేక శైలిలో అభివృద్ధి పరిచాడు. గాత్రసంగీతంలోని క్లిష్టమైన 'తాన్ల'ను , ఆరోహణ అవరోహణ క్రమంలో సరోద్‌పై అలవోకగా పలికిస్తాడు. మరొక ప్రఖ్యాత సరోద్ విద్వాంసుడు, ఉస్తాద్ అలీ అక్బర్‌ఖాన్ కు సరోద్‌లు తయారు చేసే కోల్‌కతా లోని 'హెమెన్ సేన్ ' అంజద్ అలీఖాన్‌కు సరోద్‌లు తయారుచేసి ఇస్తాడు. గత 40 ఏళ్ళుగా అంజద్ అలీఖాన్‌ దేశవిదేశాల్లో సరోద్ కచేరీల ప్రదర్శనల నిస్తున్నాడు.

== వివాహం ==
అంజద్ అలీఖాన్‌కు సుబ్బులక్ష్మితో వివాహం జరిగింది. కొడుకులు అయాన్, అమాన్‌లు తండ్రి వారసత్వంగా, సరోద్‌నే వాయిస్తున్నారు.
== అవార్డులు ==
# 2001 లో పద్మ విభూషణ్ పురస్కారం.
# 2004 లో Fukuoka Asian Culture Prize.
# 1997 లో హూస్టన్ (Houston), Tulsa మరియు Nashville లు గౌరవ పౌరసత్వాన్ని ప్రదానం చేశాయి.
# 1984 లో Massachusetts, ఏప్రిల్ 20 తేదీని ''అంజద్ అలీఖాన్‌ దినం'' గా ప్రకటించింది.

== బయటి లింకులు ==
* [http://www.hinduonnet.com/thehindu/fr/2006/04/28/stories/2006042801510300.htm] హిందూ దినపత్రికలో
* [http://www.hindu.com/mag/2006/01/08/stories/2006010800010100.htm]హిందూ దినపత్రికలో
* [http://www.sarod.com/]అంజద్ అలీఖాన్‌ వెబ్‌సైట్
* |URL             = [http://sarod.com/ అధికారిక వెబ్‌సైట్]

పి.సి.సర్కార్


'''పి.సి.సర్కార్''' (P. C. Sorcar) (జ: ఫిబ్రవరి 23, 1913 - మ: జనవరి 6, 1971) గా పిలువబడే '''ప్రొతుల్ చంద్ర సర్కార్''' గొప్ప భారతీయ ఐంద్రజాలికుడు. దేశవిదేశాల్లో లెక్కలేనన్ని ఇంద్రజాల ప్రదర్శనల నిచ్చాడు. అతనికి ముగ్గురు కుమారులు. మానిక్ సర్కార్, దర్శకుడు, ఎనిమేటర్, లేసర్ నిపుణుడు. పి.సి.సర్కార్ జూనియర్ మరియు ''పి.సి.సర్కార్ యంగ్''లు  ఇంద్రజాలికులు.

==బాల్యం, ఇంద్రజాలం==
సర్కార్ ''బెంగాల్'' (ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉంది) లోని ''తంగైల్ జిల్లా'', ''ఆశిక్‌పూర్‍లో'' జన్మించాడు. ''శివనాథ్'' హైస్కూల్‌లో చదివాడు. తన తొలి ఇంద్రజాల పాఠాలు, ఇంద్రజాలికుడు ''గణపతి చక్రవర్తి'' నుండి నేర్చుకొన్నాడు. 1930 దశకం నుండి కోల్‌కతా, జపాను మరియు ఇతర దేశాలలో ప్రదర్శనల కీర్తిని గడించాడు. తన 58 వ ఏట, జపాన్ లో ఇంద్రజాల ప్రదర్శన యిస్తుండగా, గుండెపోటుతో మరణించాడు.

==అవార్డులు, పురస్కారాలు==
*1. భారత ప్రభుత్వం కోల్‌కతాలోని ఒక పెద్ద వీథికి, ''జాదు సమ్రాట్ పి.సి.సర్కార్ సారణి'' అని నామకరణం చేసి, అతనిని సమ్మానించింది.
*2. పి.సి.సర్కార్ 1964లో,  భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకొన్నాడు.
*3. ''ద స్ఫింక్స్'' ( ఆస్కర్ ఆఫ్ మ్యాజిక్ ) - యు.ఎస్.ఎ., 1964, 1954.
*4. ''ద గోల్డెన్ లారెల్'' - జర్మనీ దేశం, 1956
*5. ''ద రాయల్ మెడలియన్'' - జర్మన్ మ్యాజిక్ సర్కిల్.

==ఇంకా==
* [http://en.wikipedia.org/wiki/Indian_magicians]భారత మెజీషియన్లు
==బయటి లింకులు==
* [http://www.pcsorcarmagician.com/]పి.సి.సర్కార్ అంతర్జాతీయ గ్రంధాలయము
* [http://banglapedia.search.com.bd/HT/S_0501.htm]పి.సి.సర్కార్ బంగ్లాపీడియా
* [http://www.indianmagicians.com/]భారత మెజీషియన్ల వెబ్‌సైట్




బిర్జూ మహరాజ్


'''బిర్జూ మహరాజ్‌'''గా పిలువబడే '''బిర్జూ మోహన్‌నాథ్ మిశ్రా''' (ఫిబ్రవరి 4, 1938), భారతీయ కథక్ నాట్య కళాకారుడు. ఇతడు లక్నో''కాల్కా-బిందాదిన్ ఘరానా''కు చెందినవాడు. బిర్జూ కథక్ కళాకారుల కుటుంబంలో పుట్టాడు. ఈయన తండ్రి అచ్చన్ మహరాజ్, మేనమామలు శంభూ మహరాజ్, లచ్చూ మహరాజ్ లు పేరొందిన కథక్ కళాకారులు. చిన్నతనం నుండి నాట్యంపైనే మక్కువ ఉన్నా, బిర్జూ హిందుస్తానీ గాత్రంలో కూడా ఆరితేరినవాడు. కథక్ నాట్యానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చాడు. ఇతడు దేశవిదేశాల్లో వేలాది నాట్య ప్రదర్శనలనిచ్చి, ఎందరో విద్యార్థులను నాట్య కళాకారులుగా తీర్చిదిద్దాడు.

==బాల్యం==
తండ్రి అచ్చన్ మహరాజ్ రాయ్‌ఘర్ ఆస్థాన నర్తకుడు. తండ్రి వద్దనే కాక, మేనమామలు, లచ్చూ మహరాజ్, శంభూ మహరాజ్‌ల వద్ద తొలి నాట్య పాఠాలను నేర్చుకొన్నాడు. తన ఏడవ యేట, తొలి నాట్య ప్రదర్శన నిచ్చాడు.

==నాట్య ప్రస్థానం==
బిర్జూ మహరాజ్ తన పదమూడవ ఏటి నుండే, న్యూఢిల్లీ లోని సంగీత భారతిలో నాట్యాచార్యుడిగా పనిచేయడం ప్రారంభించాడు. తరువాత భారతీయ కళాకేంద్ర మరియు సంగీత నాటక అకాడమీ లో ప్రధాన నాట్యాచార్యుడిగా ఉండి, 1998 లో రిటైర్ అయ్యాడు.
బిర్జూ మహరాజ్ సత్యజిత్ రే సినిమా'' షత్రంజ్ కే ఖిలారి'' లో సంగీతం సమకూర్చి, పాడాడు. దేవ్‌దాస్ (2002) సినిమాలో, ''కాహె ఛేడ్ మొహె'' అనే పాటకు నాట్యం చేశాడు.
==అవార్డులు మరియు గౌరవ పురస్కారాలు==
*1.పద్మవిభూషణ్ - 1996
*2. సంగీత నాటక అకాడమీ అవార్డు
*3. కాళిదాస్ సమ్మాన్*
4. డాక్టరేట్ డిగ్రీ - బనారస్ హిందూ యునివర్సిటీ నుండి.
*5. లతా మంగేష్కర్ పురస్కార్ - 2002

==సినిమాలు==
*1. దేవ్‌దాస్ (2002)
*2. గదర్ 2001
*3. దిల్ తో పాగల్ హై
*4. షత్రంజ్ కే ఖిలారి

==వనరులు==
# [http://maestroesclassicaldancers.weebly.com/achchan-maharaj.html అచ్చన్ మహరాజ్]
# [http://www.deccanherald.com/deccanherald/mar072004/sh6.asp బిర్జూ మహరాజ్ - కథక్]
# [http://www.expressindia.com/ie/daily/19980610/16151124.html బిర్జూ మహరాజ్]

==బయటి లింకులు==
1. [http://www.birjumaharaj-kalashram.com/ పండిట్ బిర్జూ మహరాజ్]




నాలాయిర దివ్య ప్రబంధము



'''నాలాయిర దివ్య ప్రబంధము''' 8 వ శతాబ్దానికి ముందు , పండ్రెండు మంది ఆళ్వారులు రచించిన 4000 పాశురాల సమాహారం. తమిళంలో ''నాలాయిర'' మనగా నాలుగువేలు. 9 వ శతాబ్దంలో నాథముని వీటిని క్రోడీకరించాడు.
నారాయణుని, అతని అనంత రూపాలను కీర్తించే ఈ దివ్య ప్రబంధాన్ని ఆళ్వారులు పెక్కు దేవాలయాల్లో గానం చేశారు. అలా గానం చేయబడిన ప్రాంతాలను ''దివ్య దేశములు'' అని అంటారు. దక్షిణభారతంలో ముఖ్యంగా తమిళనాడు లో దివ్య ప్రబంధాన్నివేదాలతో సమంగా పరిగణిస్తారు. అందుకే దీనిని'' ద్రవిడ వేదం'' అని అన్నారు. శ్రీరంగం మొదలైన ఎన్నో దేవాలయాలలో ప్రతినిత్యం విధిగా ఈ దివ్య ప్రబంధాన్నిఉచ్చరించడం భగవత్సేవలో ఒక ముఖ్యమైన భాగం. 4000 పాశురాల్లో 1100 పైచిలుకు పాశురాలు ''తిరుక్కురుగూరు'' కు చెందిన నమ్మాళ్వారు రచించాడు. వీటినే తిరువాయ్‌మొళి అని కూడా పిలుస్తారు.
తిరువాయ్‌మొళి అనగా, ''పవిత్రమైన నోటి నుండి వెలువడే మాటలు'' అని అర్థం. ఇందులో నమ్మాళ్వారు తనను తాను, కృష్ణుని ప్రేమకై తపించే ఒక గోపికగా అభివర్ణించుకుంటాడు.

== సంకలన నేపథ్యం ==

ఎక్కడో పోయినవనుకున్న దివ్య ప్రబంధ పాశురాలను నాథముని సేకరించి, సంకలన పరిచాడు. నాథముని ఇప్పటి ''కాట్టు మన్నార్ కోయిల్'' అయిన ''వీరనారాయణ పురం''లో జన్మించాడు. అళ్వారులలో చివరి వాడైన తిరుమంగై ఆళ్వారు కు నాథమునికి మధ్య ఎంతో కాలవ్యత్యాసం ఉంది. ఈ మధ్య కాలంలో ఆ 4000 పాశురాలేమైనవో ఎవరికీ తెలియదు.
ఒకసారి నాథముని కుంభకోణం లో నమ్మాళ్వారు యొక్క ''ఆరావముడె'' ను ప్రజలు గానం చేస్తుండగా విన్నాడు. అందులోని ఒక పాశురంలో'' ఆయిరత్తుల్ ఇప్పత్తుల్'' ( తమిళం : వేయిలో ఈ పది ) అని ఉంది. అయితే మిగతా 990 పాశురాలు ఏమైనట్టు ? నాథముని ప్రజలను విచారించి నమ్మాళ్వార్ స్వస్థలమైన ''తిరుక్కురుగూరు'' కు వెళ్ళాడు. అక్కడి ప్రజలు ,నమ్మాళ్వారు శిష్యుడైన మధురకవి ఆళ్వారు రచించిన 11 పాశురాల గురించి చెప్పారు. అలాగే వారు నాథమునిని, నమ్మాళ్వారు స్వస్థలానికి వెళ్ళి ఈ 11 పాశురాలను 12000 సార్లు ఉచ్చరించమని సలహా ఇస్తారు. నాథముని అలాగే చేస్తాడు. అప్పుడు నమ్మాళ్వారు సంతోషించి, తన 1000 పాశురాలనే కాక, మిగతా ఆళ్వారులు రచించిన పాశురాలతో సహా, మొత్తం 4000 పాశురాలను ప్రసాదిస్తాడు.
==చూడు==
* [http://en.wikipedia.org/wiki/Araiyar_sevai]ఆరైయార్ సేవై
==వనరులు==
1. [http://www.srivaishnavam.com/prabandham.htm]దివ్య ప్రబంధం - ఉపోద్ఘాతం.
2. [http://www.ramanuja.org/sv/bhakti/archives/jun99/0167.html]థూనిళా ముర్రం 40 వ భాగం.
3. [http://www.ramanuja.org/sv/bhakti/archives/jul97/0083.html]నాథమునికి నివాళి
4. [http://www.srivaishnavan.com/]నాలాయిర దివ్య ప్రబంధము - అనువాదం
5. [http://www.hindu.com/br/2004/03/23/stories/2004032300050102.htm]ఆళ్వారుల పాశురాలు


కేలడి చెన్నమ్మ


'''కేలడి చెన్నమ్మ'''  :  కేలడి చెన్నమ్మ కర్ణాటక రాష్ట్రం, షిమోగ జిల్లాలోని కేలడి ప్రాంతాన్ని పరిపాలించిన వీరవనిత. ఈమె కుందాపూర్ రాజు సిద్ధప్ప శెట్టి కుమార్తె; సోమశేఖరుని 1667 లో వివాహమాడింది. 1671 నుండి 1696 వరకు, పాతికేళ్ళు పరిపాలనలో ఉండి, బీజాపూర్ సైన్యాన్నీ, ఔరంగజేబు నూ ఎదిరించి,  భర్త చేయలేని పనిని ఆమె చేసి రాజ్యాన్ని రక్షించుకొంది. శివాజీ కుమారుడు, రాజారామ్ కు ఆశ్రయమిచ్చి, ఔరంగజేబు కోపానికి గురి అయింది.
1824 లో బ్రిటిష్ సైన్యం కిత్తూరు (ఇప్పుడు కర్ణాటకలో ఉంది) ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె కరవాలం ధరించి వీరోచితంగా పొరాడింది. చివరకు బ్రిటిష్ వారికి బందీగా చిక్కి, 1829 లో మరణించింది. కాని ఆ పోరు అంతటితో ఆగలేదు. రాయన్న అనే చెన్నమ్మ సైనికుడు తిరిగి యుద్ధాన్ని ప్రారంభించాడు. కాని ఎన్నో యుద్ధాల తరువాత, అతను కూడా బ్రిటిష్ వారికి చిక్కి, 1830 లో ఉరితీయబడ్డాడు.

==మూలాలు==
[http://profiles.incredible-people.com/keladi-chennamma/]కేలడి చెన్నమ్మ
==బయటి లింకులు==
[http://www.freeindia.org/biographies/keladi/]కేలడి చెన్నమ్మ


గోండు భాష


'''గోండు భాష''' :    ఆదిలాబాదు మరియు బస్తర్ జిల్లాల్లో గోండు గిరిజనులు మాట్లాడే భాషే గోండు భాష. ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన గోండీ, తెలుగు కన్నా కన్నడకు దగ్గరగా ఉంటుంది. గోండుల్లో ఇప్పటికీ చాలా మందికి గోండీ తప్ప మరే భాషా రాదు, అర్థం కాదు. గోండులతో సహవాసం చేసే కొలాములు తమ భాష కొలామీయే కాక గోండీ కూడా మాట్లాడగలరు.


==కొన్ని పదాలు==

ఎడ్కి - జ్వరము  ,  పిర్ - వాన  , మర్మి - పెండ్లి ,  కేడ పేన్ -  అడవి దేవుడు ,  పాడి - ఇంటి పేరు ,
నాడి - రేపు ,  నర్ క -  రాత్రి , సక్ రే - ప్రొద్దున ,  హాటుం - అంగడి  , సారి - రొట్టె ,  ఉద - కూర్చో ,
రోన్ - ఇల్లు , సమ్దిర్ - అందరు ,  చొకట్ - క్షేమం ,  కాండి - కొడుకు , పేడి - కూతురు ,కరున్ - దగ్గర ,
లంగ్ - దూరం ,  పోడ్ దరి - సాయంకాలం ,  జోప్ - నిద్ర , తరస్ - పాము , పెర్స - పెద్ద ,  యేర్ - నీరు ,
గాటు - అన్నం ,  కై కాల్ - కాలు చేతులు , మంత - ఉంది , సిల్లె - లేదు,  పొరల్ - పేరు , బత పొరల్? - ఏమి
పేరు? ,  గాటు తిత్తి కీ ?- అన్నం తిన్నవా?





Saturday, October 17, 2009

దత్తాత్రేయ విష్ణు పలుస్కర్


'''పండిట్ దత్తాత్రేయ విష్ణు పలుస్కర్'''  ( మే 28, 1921 - అక్టోబర్ 25, 1955 ) హిందుస్తానీ సంగీత విద్వాంసుడు. ఆయన బాలమేధావి. భక్తి భజనల గాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈయన పాడిన భజనలలో "పాయోజీ మైనే రామ్ రతన్ ధన్" మరియు మహాత్మాగాంధీకి ప్రీతిపాత్రమైన "రఘుపతి రాఘవ రాజారామ్" ప్రసిద్ధమైనవి.Pop culture India! By Asha Kasbekar పేజీ.35 [http://books.google.com/books?id=Sv7Uk0UcdM8C&pg=PA35&dq=DV+Paluskar]

==బాల్యం, జీవితం==
డి.వి. పలుస్కర్ మహారాష్ట లోని నాసిక్ లో జన్మించాడు. అతని తండ్రి ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు విష్ణు దిగంబర్ పలుస్కర్ . డి.వి. పలుస్కర్ పదేళ్ళ వయస్సులోనే తండ్రిని పోగొట్టుకొనగా, ఆయన తండ్రి యొక్క శిష్యులైన పండిట్ వినాయక్ రావు పట్వర్ధన్  మరియు పండిట్ నారాయణ్‌రావ్ వ్యాస్ లు అతనికి సంగీత శిక్షణ నిచ్చారు. ''పండిట్ చింతామన్ రావు పలుస్కర్'' మరియు ''పండిట్ మిరాశీ బువా'' లు కూడా డి.వి. పలుస్కర్‌కు సంగీతాన్ని నేర్పినారు.

== సంగీత ప్రస్థానం ==
పలుస్కర్ తన పద్నాలుగవ యేట, పంజాబు లోని హర్‌వల్లభ్ సంగీత సమ్మేళన్ లో తన తొలి సంగీత కచేరీ నిచ్చాడు. అతడు ముఖ్యంగా గ్వాలియర్ ఘరానా మరియు గంధర్వ మహావిద్యాలయం కు చెందిన వాడైనా, ఇతర ఘరానాలలోని మంచి సంగతులను స్వీకరించేవాడు. ఆ తరంలో చాలామంది ఇతర సంగీతకారుల లాగే తన ''ఘరానా గాయకీ''ని ఆపోసన పట్టిన తర్వాత ఇతర ఘరానాల నుండి స్వీకరించేందుకు స్వతంత్రించవచ్చని భావించాడు.Khyāl By Bonnie C. Wade పేజీ.45 [http://books.google.com/books?id=MiE9AAAAIAAJ&pg=PA45&dq=Paluskar]అతని గాత్రం మధురం; రాగాన్ని చాలా స్పష్టంగా పాడేవాడు. బందిష్, తాన్లను అద్భుతంగా ఆలపించేవాడు. అతని మొదటి ఆల్బం 1944 లో విడుదలయింది. 1955 లో, భారతీయ కళాకారుడి హోదాలో చైనా ను సందర్శించాడు.
తన తండ్రిలాగే పలుస్కర్ భక్తిపరుడు. శాస్త్రీయ సంగీతాన్నే కాక, అతడు భజనలు కూడా పాడేవాడు. బైజూ బావ్రా సినిమాలో ఉస్తాద్ అమీర్‌ఖాన్ తో కలిసి పాడాడు. బెంగాలీ సినిమా'' శాప్ మోచన్'' లో కూడా పాడాడు.

== వ్యక్తిగత జీవితం ==
అక్టోబర్ 26, 1955 నాడు డి.వి. పలుస్కర్ ''మెదడు వాపు వ్యాధి'' తో మరణించాడు.

==ఆల్బంలు==
* [http://courses.nus.edu.sg/course/ellpatke/Miscellany/d%20v%20paluskar.htm డి.వి. పలుస్కర్ 78 rpm రికార్డులు].


==బయటి లింకులు==
* [http://dvpaluskar.googlepages.com/ డి.వి. పలుస్కర్ పుట]
* [http://www.chembur.com/anecdotes/dvpaluskar.htm జి.యన్. జోషి ''డౌన్ మెలొడీ లేన్'' ( 1984 ) నుండి].



గురుదత్


'''గురుదత్''' పడుకొనె ( జననం: జూలై 9 , 1925 ) , దక్షిణ భారతదేశంలోని మైసూర్ లో జన్మించిన గొప్ప భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు.

==బాల్యం, జీవిత చరిత్ర==
తండ్రి ప్రధానోపాధ్యాయుడు, తల్లి ''వాసంతి'' ఉపాధ్యాయురాలు; ఆమె బెంగాలీ నవలలను కన్నడంలోకి అనువదిస్తూ ఉండేది. గురుదత్‌కు మంచి బెంగాలీ మాట్లాడడం వచ్చు. ఆయన 1940 లో ముంబాయికి చేరుకొని, బాలివుడ్ లో ప్రవేశించాడు. ఆయన కోల్‌కతాలో కొన్నాళ్ళు విద్యాభ్యాసం చేసి, కొంతకాలం ప్రముఖ నాట్య కళాకారుడు, ఉదయ్‌ శంకర్‌ వద్ద నాట్యాన్ని అభ్యసించాడు. తరువాత ''ప్రభాత్ స్టూడియో''లో ''కొరియోగ్రాఫర్'' గా చేరాడు. ''హమ్ ఏక్ హై'' (1946),''ఆర్ పార్'' (1954) సినిమాలకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఆ తరువాత వచ్చిన ఆయన సినిమాలు:  ''మిస్టర్ అండ్ మిసెస్'' 55, ''ప్యాసా'', ''కాగఝ్ కే ఫూల్''.  కాగఝ్ కే ఫూల్ బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమవడంతో, విరక్తి చెంది, సినిమాలు తీయడం మానివేశాడు.
కథారచయిత, ''అబ్రార్ అల్వి'' ''సాహిబ్ బీబీ ఔర్ గులాం''కు గురుదత్ దర్శకత్వం వహించి, రాష్టపతి రజత పతకాన్ని, ''బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్'' అవార్డ్‌ను గెలుచుకున్నాడు.
1953 లో ప్లేబాక్ సింగర్ ''గీతారాయ్''ను వివాహమాడాడు. కాని వారి దాంపత్యం అంత సజావుగా సాగలేదు. గురుదత్ సినిమా విషయంలో కఠినంగా ఉండేవాడు. అతిగా త్రాగేవాడు. నటి వహీదా రెహ్మాన్ తో గల సంబంధం అతని కాపురంలో చిచ్చును రేపింది. గురుదత్ మరణించినప్పుడు, భార్యతో కాక, ఒంటరిగానే ఉన్నాడు.
అక్టోబర్ 10, 1964]రోజు గురుదత్ తన మంచంలో చనిపోయి కనిపించాడు. మద్యం ఎక్కువైందో లేక నిద్రమాత్రలు అతిగా మింగాడో ఎవరికీ తెలియదు. గురుదత్ అప్పుడు రెండు సినిమాలలో పనిచేస్తున్నాడు; ''లవ్ అండ్ గాడ్'' మరియు ''బహారే ఫిర్ భి ఆయేంగీ''. తరువాత వాటిని సంజీవ్ కుమార్, ధర్మేంద్ర లతో పూర్తి చేయడం జరిగింది.

==నటుడిగా==

* పిక్నిక్ (1964) (అసంపూర్ణం)
* సాంఝ్ ఔర్ సవేరా (1964)
* సుహాగన్ (1964)
* బహూ రానీ(1963)
* భరోసా(1963)
* సౌతేలా భాయ్ (1962)
* చౌధవీఁ కా చాంద్ (1960)
* కాగజ్ కే ఫూల్ (1959)
* 12 ఒ' క్లాక్ (1958)
* ప్యాసా ( 1957)
* మిస్టర్ అండ్ మిసెస్ 55 (1955)
* ఆర్ పార్ (1954)
* సుహాగన్ (1954)
* బాజ్ ( 1953)
* హమ్ ఏక్ హై( 1946)
* లఖారాణి ( 1945)
* చాంద్ (1944)

==దర్శకుడిగా==
* కాగజ్ కే ఫూల్ (1959)
* ప్యాసా]( 1957)
* సైలాబ్ (1956)
* మిస్టర్ అండ్ మిసెస్ 55 (1955)
* ఆర్ పార్ (1954)
* బాజ్ ( 1953)
* జాల్ (1952)
* బాజీ (1951)

==నిర్మాతగా==
* ఆర్ పార్ (1954)
* సి.ఐ.డి. (1956)
* కాగజ్ కే ఫూల్ (1959)
* చౌధవీఁ కా చాంద్ (1960)
* బహారేఁ ఫిర్ భి ఆయేంగీ (1966)
==ఇంకా==
1. [http://en.wikipedia.org/wiki/ నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా పుణె] గురుదత్, భారత ప్రభుత్వ జాతీయ సినిమా భాండాగారము.

==వనరులు==
* 1. [http://www.time.com/time/2005/100movies/the_complete_list.html] పూర్తి సినిమాల జాబితా
* 2. [http://www.dearcinema.com/devanand-interview-1] దేవానంద్‌తో ఇంటర్‌వ్యూ-1
* 3. [http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=3c5f9505-ab14-4a97-afd4-240feb7c723d&&Headline=%27One+should+live+the+moment...look+ahead%27] హిందుస్తాన్ టైమ్స్ వ్యాసం
* 4. http://in.rediff.com/movies/2004/oct/11guru.htm] అక్టోబర్ 10 నాడు ఏమైందో ఎవరికీ తెలియదు.
* 5. [http://in.rediff.com/movies/2004/oct/11guru.htm] [[వహీదా రెహ్మాన్]] తో ఇంటర్‌వ్యూ
==బయటి లింకులు==
* [http://dearcinema.com/devanand-interview-1/] గురుదత్ గురించి దేవానంద్
* [http://sify.com/movies/fullstory.php?id=14716533] గురుదత్‌తో నా పదేళ్ళ అనుభవాలు- అబ్రార్ అల్వి
* [http://www.imdb.com/name/nm0244870/] గురుదత్ ఇంటర్నెట్ డాటా బేస్
* [http://www.rediff.com/entertai/2002/mar/04dinesh.htm] దేవానంద్‌తో ఇంటర్‌వ్యూ-2
* [http://www.bollango.com/cgi-bin/akf_search.tcl?key=song&actor=guru+dutt] గురుదత్‌ సినిమాలలోని  పాటలు

గిలక లేదా హెర్నియా



గజ్జల్లో కాని, ఉదరంలో కాని కండరాలు బలహీనపడినప్పుడు, కడుపు లోని కొవ్వు, ప్రేగులు వాటిగుండా బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు బయటికి కనబడే "ఉబ్బు"ను '''గిలక''' లేదా '''హెర్నియా''' (Hernia) అంటాము.

;హెర్నియా పలు రకాలు :
*1. గజ్జల్లో వచ్చే హెర్నియా (Inguinal Hernia)
*2. తొడ లోపలి భాగంలో వచ్చే హెర్నియా (Femoral Hernia)
*3. ఉదర పైభాగంలో వచ్చే హెర్నియా (Epigastric Hernia, Umbilical Hernia, Para-Umbilical Hernia)
*4. శస్త్రచికిత్స ఐన తరువాత, కొంత కాలానికి, శస్త్రచికిత్సజరిగిన చోట ఏర్పడే హెర్నియా (Postoperative Incisional Hernia)

;వ్యాధి లక్షణాలు:
1. దగ్గినప్పుడు, బరువులను ఎత్తినప్పుడు "ఉబ్బు" కనబడుతుంది. చేతితో ఒత్తితే "ఉబ్బు"తిరిగి లోపలికి వెళ్ళిపోవచ్చు.
2. ఒక్కోసారి కడుపులోని ప్రేగులు అక్కడే చిక్కుకొని, తిరిగి కడుపు లోనికి వెళ్ళకపోవచ్చు. అప్పుడు రోగికి తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు మొదలవవచ్చు. దీనిని Strangulated Hernia అంటారు. ఇది ఎమర్జెన్సీ. త్వరగా ఆపరేషన్ చేయకపోతే రోగికి ప్రాణాపాయం కలగవచ్చు.

;ఎవరికి వస్తుంది ఈ వ్యాధి ?
1. ఎక్కువగా బరువులు ఎత్తేవారిలో-వృత్తి రీత్యా , కూలీలు, హమాలీలు, రైతులు వగైరా.
2. మద్యపానం చేసేవారిలో, కొందరికి కండరాలు పలచబడుతాయి.
3. వృద్ధుల్లో.
4. ఊబకాయం గలవారికి.
5. పుట్టుకతోనే కొందరికి కండరాలు బలహీనంగా ఉండొచ్చు. వారిలో.
6. ఆపరేషన్ చేయించుకొన్న వారిలో, ముఖ్యంగా Cessarian, Tubectomy, Appendicectomy మొదలైనవి.(అంటె ప్రతి ఒక్కరికీ రావాలని ఏమీలేదు.)


;వ్యాధి నిర్ధారణ పరీక్షలు : ఏమీ లేవు. వైద్యుడు కళ్ళతో చూసి, చేతితో పరీక్షించి, రోగ నిర్ధారణ చేస్తాడు.

;ట్రీట్ మెంట్(Treatment) : ఏ మందులూ పని చేయవు. శస్త్రచికిత్స ఒక్కటే మార్గం.
ఇది రెండు రకాలు:
1. బలహీనపడిన కండరాలను తిరిగి గట్టి proline దారంతో కుట్టడం.
2. Proline Mesh (proline దారంతో అల్లబడిన తెర) ను వేసి కుట్టడం.

తీసుకోవలసిన జాగ్రత్తలు: శస్త్రచికిత్స తరువాత మొదటి మూడు నెలల వరకు, బరువులు ఎత్తకూడదు.




ముద్దుకృష్ణ



'''ముద్దుకృష్ణ''' పేరు చెప్పగానే మొదట మనకు స్ఫురించేది ఆయన సమకూర్చిన కవితాసంకలనం, వైతాళికులు. ముద్దుకృష్ణ స్వామినేని ముద్దునరసింహంనాయుడు కి ముని మనుమడు మరియు హేతువాది. అశోకం నాటకం వ్రాశాడు. రావణ వధ తరువాత అగ్ని ప్రవేశం చేయమన్న రాముడికి సీత ఎదురు తిరిగి "నీవు పురుష రూపంలో ఉన్న స్త్రీవి. నన్ను కాపాడుకోలేక పోయావు...."అని నిలదీసినట్లు రాస్తాడు. చిన్నతనంలోనే తెలుగు సాహిత్యంలో ముద్దుకృష్ణకున్న అభిరుచిని పసికట్టిన తండ్రిగారు మనుచరిత్ర, వసుచరిత్ర బోధించాడు. స్కూల్ ఫైనల్ చదివే నాటికి ఆంగ్ల సాహిత్యంలో కూడ ఆసక్తి పెరిగి, "మర్చంట్ ఆఫ్ వెనిస్" నాటకంలో అభినయించే స్థితికి వచ్చాడు. కాలేజి చదువు కాకినాడలో రఘుపతి వెంకటరత్నం నాయుడు వద్ద కొంతకాలం జరిగింది. భావకవితా యుగానికి చెందిన దేవులపల్లి కృష్ణశాస్త్రి, చింతా దీక్షితులు, తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి మొదలగు వారితో సాన్నిహిత్యం;
కళాశాలల్లోని ఇంగ్లీషు నాటక ప్రదర్శనలూ, స్థానిక నాటక సమాజాల తెలుగు నాటక ప్రదర్శనలూ, సుప్రసిద్ధ కవీ, నటుడూ, హరీన్ చటోపాధ్యాయతో కలిసి 1927 ప్రాంతాలలో కళాప్రదర్శనలూ ముద్దుకృష్ణలో నాటక రచనకు ప్రేరేపించాయి. "అశోకం" నాటకం ద్వారా ముద్దుకృష్ణ అపూర్వసంచలనం కలిగించాడు. ముద్దుకృష్ణ బ్రహ్మచారి; ఈ బ్రహ్మచారి వ్రాసిన "దాంపత్య దీపిక" ఎందరి ప్రశంసనలనో పొందింది. 1934 లో ప్రారంభించిన "జ్వాల" పత్రిక యువకులలో కొత్త ఆలోచనలను రేపింది.

ఈయన ప్రచురించిన "వైతాళికులు"లో చోటు చేసుకొన్న కవులు :అబ్బూరి రామకృష్ణారావు, కవికొండల వెంకటరావు, దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి', కొడాలి ఆంజనేయులు, గురజాడ అప్పారావు, చింతా దీక్షితులు, నండూరి సుబ్బారావు, నాయని  సుబ్బారావు, నోరి నరసింహశాస్త్రి, పింగళి-కాటూరి, పెనుమర్తి వెంకటరత్నం, చావల బంగారమ్మ, బసవరాజు అప్పారావు, అడవి బాపిరాజు, రామచంద్ర అప్పారావు, దువ్వూరి రామిరెడ్డి, రాయప్రోలు సుబ్బారావు, కొడవగంటి వెంకటసుబ్బయ్య, వేంకట పార్వతీశ్వరులు, విశ్వనాథ సత్యనారాయణ, తల్లాప్రగడవిశ్వసుందరమ్మ, మల్లవరపు విశ్వేశ్వరరావు, వేదుల సత్యనారాయణ శాస్త్రి, తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి, శ్రీరంగం శ్రీనివాసరావు, సౌదామిని - బసవరాజు రాజ్యలక్ష్మమ్మ.



అబ్బూరి రామకృష్ణారావు'

'''అబ్బూరి రామకృష్ణారావు''' (1896-1979) ప్రముఖ తెలుగు భావకవి, పండితుడు. రామకృష్ణారావు గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని అనంతవరం గ్రామంలో లక్ష్మీనరసింహశాస్త్రి, బాపమ్మ దంపతులకు 1896, మే 20 న జన్మించాడు.  ఆయన చిన్నతనంలో తిరుపతి వెంకట కవులలో ఒకడైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తరచుగా అబ్బూరి తండ్రి గారి ఇంటికి వస్తుండేవాడు. బలిజేపల్లి లక్ష్మీకాంతం, గోవిందరాజులు సుబ్బారావులు అబ్బూరికి మిత్రులు.

అబ్బూరి మైసూరులోని సంస్కృత కళాశాలలో చేరినప్పుడు, అప్పటి విద్యాధికారి కట్టమంచి రామలింగారెడ్డి, 1915 లో అచ్చైన అబ్బూరి యొక్క మల్లికాంబను చదివి మెచ్చుకొన్నాడు. అదృష్టం కొద్దీ, అబ్బూరికి అక్కడే ఉన్న రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మతో స్నేహం కుదిరింది. అబ్బూరి 1916లో వీణా శేషన్న వద్ద కొంతకాలం పాటు వీణను కూడ నేర్చుకొన్నాడు. 1918లో అబ్బూరి, రవీంద్రనాథ్ టాగోర్ ను కలుసుకొని బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలను వినడం జరిగింది. కోడి రామమూర్తిని ప్రశంసిస్తూ, "ఆంధ్రవీర కంఠీరవ" అనే పద్యాన్ని వ్రాయడం జరిగింది.

పదగుంఫన అబ్బూరి ప్రత్యేక ప్రతిభ. గీతాలలో గొప్ప హుందా గోచరిస్తుంది. ఉత్తమ సంస్కృత కావ్యాలలోని పూర్ణతా, గౌరవమూ, గాంభీర్యమూ ఈయన పద్యాలలో ప్రతిబింబిస్తవి. నన్నయ నాటి అక్కరలకు మార్పులు తెచ్చి, కొత్త నడకలు నడిపించడమే కాకుండా, స్వకపోలకల్పితాలైన నూతన ఛందస్సులు కూడా కల్పించాడు. ఈయన పద్యాలలో ఒక్క పలుకు పట్టి చూచినా ఉత్తమ సంస్కారి అని తెలుస్తుంది.
;కృతులు
#ఊహాగానము-పూర్వప్రేమ 
#మల్లికాంబ 
#నదీసుందరి.

అబ్బూరి 30 ఏప్రిల్ 1979 రోజు మరణించాడు. చనిపోవడానికి నాలుగు రోజుల ముందు ఆయన ఇలా వ్రాసుకొన్నాడు. "చచ్చిపోయి జీవి ఎచ్చట కేగునో ఏమి యగునో ఎవరికెరుగరాదు, ఎరుకలేని వారలేమేమో చెప్పగా విని తపించువారు వేనవేలు."


ముసలమ్మ మరణం


తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించిన కావ్యం, డా.కట్టమంచి రామలింగారెడ్డి రచించిన "ముసలమ్మ మరణం". కందుకూరి వీరేశలింగం పంతులు లాగానే, కట్టమంచి రామలింగారెడ్డి ఆంగ్ల సాహిత్యం వలన ప్రభావితుడైనాడు. చార్లెస్ పి. బ్రౌన్ రచించిన The History of Anantapuram (అనంతపుర చరితం) నుండి కథాంశాన్ని తీసుకొని, ఈ కావ్యాన్ని వ్రాశాడు.
ఇది "ముసలమ్మ" అనబడే ఒక గ్రామవనిత యొక్క త్యాగమయ, దయనీయ గాథ. ఆమె తమ ఊరి చెరువు కట్ట చిన్నగా తెగిపోతూ ఉండడం చూసి, తనకు తానే అడ్డుపడి, తన ప్రాణాలను అర్పించి, ఊరి ప్రజలను కాపాడుతుంది. 

*1899లో ఆంధ్ర భాషాభిరంజిని వారి పోటీలో బహుమతి గెల్చుకొంది. 1900లో అచ్చయ్యింది.




ఠుమ్రీ


'''ఠుమ్రీ''' భారతీయ శాస్త్రీయ సంగీతానికి చెందిన ఒక శాస్త్రీయ శైలి.

ఠుమ్రీలు ముఖ్యంగా రాధాకృష్ణుల ప్రణయ సంబంధమైన ప్రేమగీతాలు. ఠుమ్రీ మొదట పుట్టింది లక్నోమరియు వారణాసిలో, 18 వ శతాబ్దంలో. మొట్టమొదట దీనికి ప్రాచుర్యం కలుగజేసినవాడు లక్నోనవాబు  వాజిద్ అలీషా. ముఖ్యంగా మూడు  ఠుమ్రీ ఘరానాలు ఉన్నాయి. అవి, బెనారస్, లక్నో మరియు పటియాలా  ఘరానాలు.

==పసిద్ధ ఠుమ్రీ  గాయకులు==
రసూలన్ బాయి, సిద్దేశ్వరీ దేవి, గిరిజా దేవి, గోహర్ జాన్, బేగం అక్తర్, శోభా గుర్టూ, మరియు బడే గులాం అలీ ఖాన్.


==మూలాలు==
{{Reflist}}

==బయటి లింకులు==
*[http://www.indoclassical.com/ IndoClassical.com - భారతీయ శాస్త్రీయ సంగీతము]
*[http://www.chandrakantha.com/articles/indian_music/ఠుమ్రీ.html]

==గ్రంధాలు==
*''Thumri in Historical and Stylistic Perspectives'' by ''పీటర్ మానుయెల్''



Powered By Blogger

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    12 years ago