నా గురించి

Tuesday, October 27, 2009

విక్రమ్ సేఠ్


'విక్రమ్ సేఠ్' : విక్రమ్ సేఠ్ (జననం: జూన్ 20, 1952 ), భారతీయ ఆంగ్ల నవలా రచయిత, కవి మరియు పద్మశ్రీ పురస్కార గ్రహీత.

=బాల్యం, విద్యాభ్యాసం =

విక్రమ్ సేఠ్ హిందూ కుటుంబంలో పుట్టి, కోల్‌కతా లో పెరిగాడు. టన్‌బ్రిడ్జ్ స్కూల్ మరియు డూన్ స్కూల్‌లో అతని విద్యాభ్యాసం జరిగింది. ఆక్స్‌ఫర్డ్ లోని కార్పస్‌క్రిస్టి కాలేజిలో ఆర్థికశాస్త్రం, తత్వశాస్త్రం, రాజకీయ శాస్త్రం చదువుకొని, స్టాన్‌ఫర్డ్ యునివర్సిటీలో ఆర్థికశాస్త్రంలో పి.జి. చేశాడు. చైనా లోని నాన్‌జింగ్ యునివర్సిటీలో చైనీస్ కవిత్వాన్ని అధ్యయనం చేశాడు. స్టాన్‌ఫర్డ్ యునివర్సిటీ, కాలిఫోర్నియా నుండి ఎమ్.ఏ. డిగ్రీని పొందాడు. ఇతని తల్లి, లీలా సేఠ్, తొలి భారతీయ మహిళా చీఫ్‌ జస్టిస్.

==నవలలు==

1. ది గోల్డెన్ గేట్ ( 1986 ) ; శాన్‌ఫ్రాన్సిస్‌కో గురించి.
2. ఎ సుటెబుల్ బాయ్ ( 1993 ) ; 19 శతాబ్దపు భారతదేశం గురించి.
3. యాన్ ఈక్వల్ మ్యూజిక్.

==కవిత్వాలు==

1. మ్యాపింగ్స్ ( 1980 )
2. ఫ్రమ్ హెవెన్ లేక్ ( 1983 )
3. ద హమ్‌బల్ అడ్‌మినిస్ట్రేటర్స్ గార్డెన్ ( 1985 )
4. ఆల్ యు హు స్లీప్ టునైట్ ( 1990 )
5. బీస్ట్లీ టేల్స్ ( 1991 )
6. త్రీ చైనీస్ పోయెట్స్ ( 1992 )

== అవార్డులు==
* 1983 Thomas Cook Travel Book Award From Heaven Lake: Travels Through Sinkiang and Tibet
* 1985 Commonwealth Poetry Prize (Asia) The Humble Administrator's Garden
* 1993 Irish Times International Fiction Prize (shortlist) A Suitable Boy
* 1994 Commonwealth Writers Prize (Overall Winner, Best Book) A Suitable Boy
* 1994 WH Smith Literary Award A Suitable Boy
* 2001 EMMA (BT Ethnic and Multicultural Media Award) for Best Book/Novel An Equal Music
* 2005 Pravasi Bharatiya Samman
* 2007 పద్మశ్రీ బహుమతి.

==బయటి లింకులు==

* [[http://www.contemporarywriters.com/authors/?p=auth89]]

గాయపడిన మైదానం




ఉన్మాది చేతిలో ఉసిగొల్పబడిన ఆయుధం
ఉడుకు నెత్తురును రుచి చూచిన వైనం
ఉలిక్కిపడిన ప్రపంచం
ఉవ్వెత్తుగ ఎగసిన కోపానల ప్రభంజనం
యుద్దంలో శత్రువును చంపడం నేరం కాదు
అడవిలో జంతువులను చంపి తినడం
పులికి వినోదం కాదు

కరడు గడుతున్న భావాలు
గురి తప్పుతున్న బాణాలు
మారుతున్న లక్ష్యాలు
ఆడదామని వస్తే రక్తం ఓడాల్సి వచ్చిందేమిటి !
గుండెలో రాయి పడిన మైదానం -
గాయపడిన మైదానం.

( పాకిస్తాన్‌లో మన క్రికెట్ ఆటగాళ్ళపై జరిగిన దాడి గురించి చదివాక )

Monday, October 26, 2009

తెలంగాణ అవ్వ!



ఎగిలివారంగ లేసి
ఆకిట్ల అలుకు జల్లి
సుద్దతో బాగా ముగ్గులేసి
అరుగులను జాజుతో అద్ది అద్ది
ముద్దుగా తీనెలు వెట్టి వెట్టి
ల్యాగలను బర్లను మ్యాతకు ఇడిశి పెట్టి
బాయి కాడికి వోయి బిందెతో లీల్లు దెచ్చి
పిడకతో అగ్గిని అంటువెట్టి పొయ్యి మీద జరంత బువ్వ వండి
పొలం కాడికి వోయె పెనిమిటికి సద్ది కట్టి
పిల్లగాండ్లను బడికి పంపి
అడ్లను దంచి గైండ్ల ఎండుగులు ఎండబోసి
బుక్కుతుంటె కోళ్ళను అదిలించి
అట్ల వోయె రాజవ్వను మందలించి
గట్క దిని గొంత అంబలి దాగి
కలుపు కోతలకు వోయి పొద్దు గూకె దంక కట్టం జేశి
కాల్లీడ్సుకుంట ఇంటికి తిరిగి వచ్చే
ఓ అవ్వా! నువ్వెంత మంచిదానివే!

Thursday, October 22, 2009

ఎం.ఎస్. సుబ్బులక్ష్మి - గాత్రం - భైరవి రాగం, వర్ణం

 click here :

http://www.youtube.com/watch?v=NtayQialsJM&feature=related

మోగుబాయి కుర్దీకర్ - గాత్రం


click here:
మోగుబాయి కుర్దీకర్ - రాగ్ బాగెశ్రీ , తరానా                  





శ్రీ మాతృ వాక్కులు - కాంతి బీజాలు


ఓ చిన్నారులారా ! మీరే ఆశల పునాదులు. మీరే భవిష్యత్తుకు బాటలు.
'అసంభవం' అనే మాటకు అర్థం తెలియని మీరు నిరంతరం జవసత్వాలను నింపుకొని  అభివృద్ధి పథంలో పయనించండి.

   *         *          *

దైవం కొరకే జీవించండి.
దైవం  కొరకే పనిచేయండి.
దైవాన్నే ఆరాధించండి.

 *         *          * 

హృదయంలో నుంచి వినేవాడికే
ఈ సృష్టి సమస్తం  తన దైవత్వాన్ని వినిపిస్తుంది.

 *         *          *  

మన జీవితమంతా ఆ దైవానికే అర్పింపబడిన ప్రార్థన కావాలి

*         *          *  

ఓ ప్రభూ! నా హృదయాన్ని మలినం లేని స్ఫటికంలా ఉంచు.
అప్పుడు అందులో నువ్వే గోచరిస్తావు.

*         *          *  

మనలో ప్రతివారికీ ఒక పాత్ర, ఒక కార్యం,ఒక చోటు నిర్దేశింపబడి ఉంటాయి.

*         *          *  

నిరంతరం జ్వలించే హృదయంతో ముందుకు సాగుదాం.

 *         *          *  

సౌందర్యమా! నువ్వే దైవాన్ని చేరుకొనే నా మార్గానివి.

 *         *          * 

సత్యప్రీతి, జ్ఞానతృష్ణతో సాగే మన జీవితాలను
ఆ సత్యప్రీతి, జ్ఞానతృష్ణలే నడిపించాలి.

 *         *          *  

మన జీవితంలోని అన్ని పరిస్థితులు,అన్ని సంఘటనలు అనుభవైక్యవేద్యంగా మనకు కొత్త పాఠాలు నేర్పాలి.

*         *          *  

నీవు ఆ భగవంతునికి నిజమైన ఉపకరణానివి కావాలంటే, నీవు చేసే పనిలో పరిణతి ఏ మాత్రం తగ్గకూడదు.
 *         *          *  

నీ ఆశయాల జ్వాల ఎంత సూటిగా, తీవ్రంగా ఉండాలంటే అది ఎలాంటి అవాంతరాలనైనా తట్టుకొని నిలబడి ఉండగలగాలి.

 *         *          *  

చిత్తశుద్ధితో చేసే ప్రార్థనలు అంగీకరింపబడుతాయి.

 *         *          * 

లోకులు ఏమి ఆలోచిస్తారు? ఏమి చేస్తారు? ఏమి మాట్లాడుతారు? అన్నది ముఖ్యం కాదు. నీకూ భగవంతునుకీ మధ్య  ఉన్న సంబంధమే ముఖ్యం.

*         *          *  

ఓ ప్రభూ!
నేను నీ ముందు ఒక స్వచ్చమైన తెల్ల కాగితాన్ని. నీవు నీ సంకల్పాన్ని ఎలాంటి
అడ్డు లేకుండా, సాంకర్యం లేకుండా లిఖించు.


*         *          *  

నీవు దేనినైనా పరివర్తింప జేయగల అద్భుతమైన ఇంద్రజాలికుడవు.
వికృతము నుండి సౌందర్యాన్ని, బురద నుండి స్వచ్చమైన నీటిని,
 అజ్ఞానము నుండి జ్ఞానమును,
అహంకారము  నుండి దయనూ సృష్టించ గలవు.

*               *               *

నిజాయతీలోనే నిశ్చయమైన విజయము ఉంది.
నిజాయతీ!  ఓ నిజాయతీ!
నీ నైర్మల్యం ఎంత తీయనైనది.

*               *               *

నీవు దేనినైన  ఆ దైవము నుండి దాచాలని ప్రయత్నిస్తే,
 తప్పకుండా నీవు ముక్కు పగిలేలా నేలపై పడతావు.

*               *               *

గమ్యం లేని జీవితం ఎప్పుడూ దుర్భరమైన జీవితమే.

*               *               *

నీకు శక్తినీ, రక్షణనూ ఇచ్చే సత్యాన్నే ఆశ్రయించు.

*               *               *

కష్టాలకు కూడ కృతజ్ఞతగా ఉండు. అవి భగవంతుని వద్దకు చేర్ఛె దగ్గరి దారులు.

*               *               *

మనము ప్రశాంత మనస్కులమై ఉన్నప్పుడే,
సరియైన పనిని,సరియైన రీతిలో, సరియైన సమయంలో చేయగలుగుతాము.

*               *               *

అలజడిలో శాంతి ,ప్రయత్నంలో ప్రశాంతత, శరణంలో ఆనందం, ఒక మహా జ్వాల వంటి విశ్వాసం -
 ఇవన్నీ నీకు దేవుని ఉనికిని చెప్పకనే చెబుతుంటాయి.

*               *               *



ఎల్లప్పుడూ ఔన్నత్యం కొరకే ప్రయత్నిద్దాం.
మనమెప్పుడూ సాధించిన దానితొ తృప్తిపడవద్దు.

* * *

ఓ నా ప్రియమైన ప్రభూ!
నీ ప్రేమతత్వాన్ని నాకు బోధిస్తూ ఉండు.
* * *

అసత్యానికి దూరంగా ఉండు. నిర్మలమైన ఆత్మప్రకాశంతో జీవించు. అప్పుడు నీవు భగవంతునికి చాలా దగ్గరగా నివసిస్తావు.

* * *

మనము ఒక నిశ్చలమైన మనసుతో ముందుకు సాగాలి. జరగాల్సింది జరుగుతుంది.

* * *

ఎలాంటి ఆపదలోనైనా మనము నిబ్బరంగా ఉండగలుగుతే, పరిష్కారం దానంతట అదే కనబడుతుంది.

* * *

...... పట్టును సడలించకు . ప్రయత్నాలన్నీ వమ్మైనప్పుడే తిరిగి అన్నీ నీకు లభించవచ్చు.

* * *

సూర్యుడు మబ్బుల్ని ఎలా చెల్లాచెదరు చేస్తాడో, అలా చిరునవ్వు కష్టాల్లో అతిక్రమింప జేస్తుంది.

* * *

నువ్వేదైతే చెబుతావో అదే ఎల్లప్పుడూ చెయ్. కాని నీవు చేసేవన్నీ చెప్పడం ఒక్కోసారి విజ్ఞత అనిపించుకోదు.

* * *

ఒక మంచి కార్యాలోచన జరగకుండా గడచిన దినము, ఒక ఆత్మరహితమైన దినము.

* * *

నీవు జీవితాన్ని చిరినవ్వుతో ఆహ్వానిస్తే, జీవితం నిన్ను చిరునవ్వుతో ఆహ్వానిస్తుంది.

* * *

నిత్య సత్యాన్వేషి అసమగ్రతను, అతిశయోక్తిని, అస్తవ్యస్తతను, అవి ఎంత లేశమాత్రమున్నా సరే అంటుకోకూడదు.

* * *

నిరర్థకపు మాటలతోనే ప్రపంచం చెవిటిదయింది.

* * *

మనము మన ఆలోచలను జాగ్రత్తగా గమనిస్తుండాలి. ఒక చెడు తలంపు అతి ప్రమాదకరమైన దొంగ వంటిది.

* * *

శాంతమధురములైన దైవస్మరణలు శ్వేతకపోతాల వంటివి.

* * *

ఈ స్వచ్చత, నైర్మల్యము ఆ దేవుని ప్రభావాన్ని మాత్రమే అంగీకరిస్తాయి.

* * *

అంతరంగంలో దాగిన ప్రశాంతాతతను పట్టుకో. దానిని శరీర కణాల్లోకి చొప్పించు. ప్రశాంతాతత వలననే స్వస్థత చేకూరుతుంది.

* * *

మనం మన మనసులోని అసత్యాలను ఎలా శక్తియుతంగా నిరాకరిస్తామో, అలా శరీరం అస్వస్థతను నిరాకరించాలి.

* * *

అది ఎంత కష్టతరమైన కార్యమైన కానీ, నువ్వు ఉత్తమం అనుకున్న దాన్నే చెయ్.

* * *

అంధకారబంధురమైన, పీడకల వంటి ఈ మాయజగత్తులో, ఆ దైవం తన అస్తిత్వాన్ని అణువణువునా ఏదో రూపంలో ప్రకటిస్తూనే ఉంటుంది.

* * *

సరియైన కార్యాచరణ కొరకు మనం మన శక్తిని,మౌనంలో, కేంద్రీకరణలో సమీకరించుకోవాలి.

* * *

మనం దేని గురించి ఆలోచిస్తుంటామో, అదే మన చుట్టూ ఉంటుంది.

* * *

నీవు ఒకరి గురించి మంచిగా ఆలోచించలేకపోతే, అతని గురించి ఆలోచించడం పూర్తిగా మానివేయడమే ఉత్తమం.

* * *

ఆ భగవంతుడు నీ ఆలోచనలను పూర్తిగా ఆక్రమించుకొను గాక!

* * *

నీ చేతనను వికృతమైన ఆలోచనలతో, అనుభూతులతో మలినం చేసుకోకు. అవి నిన్ను నా రక్షణ నుండి దూరంగా తీసుకొని పోతాయి.

* * *

మానవుడిని క్రూరాత్ముడిగా ఆ దేవుడు సృజించలేదు. మానవుడే తనను తాను దైవం నుండి వేరుపరచుకొని క్రూరాత్ముడిగా మారతాడు.

* * *

కోరికలారా! వెనక్కి వెళ్ళిపొండి. పురోగమించకండి.
ఓ దుష్టబుద్ధీ! ద్వేషభావమా! తిరోగమించండి. పురోగమించకండి.

* * *

అందుకొన్న సంతోషం కన్న, నువ్వు పంచి యిచ్చే సంతోషమే నిన్ను మరింత సంతోషపరుస్తుంది.

* * *

ఇద్దరు వ్యక్తులు తగవులాడుకున్నారు అంటే, తప్పు ఎప్పుడూ ఇద్దరి వైపూ ఉందన్న మాట.

* * *

శత్రువుని చూసి నవ్వే చిరునవ్వు, అతనిని నిరస్త్రుణ్ణి చేస్తుంది.

* * *

సంశయం ప్రమాదకరమైంది; ఆట కాదు. ఆత్మను క్రమక్రమంగా నాశనం చేసే విషబిందువు.

* * *

లేనిది ఉన్నట్టూ, ఉన్నది లేనట్టూ కనిపించే ఈ భ్రాంతి ప్రపంచానికి ఆధారం, నీ దైవికమైన చిరునవ్వే.

* * *

ఇతరుల తప్పులకు కోపగించుకొనే ముందు , మనం మన తప్పులను ముందుగా గుర్తుకు తెచ్చుకోవాలి.

* * *

అసూయ అనేది ప్రాణాంతకమైన విషం. అది ఆత్మ వినాశకారిణి.

* * *

మనలో ఉండే లోపాల్నే మనం ఇతరుల్లో గమనిస్తాము. మన చుట్టూ బురద కనిపిస్తూంది,
అంటే అది మనలోనే ఎక్కడో ఉందన్న మాట.

* * *

అసంతృప్తితో గొణగడం మాను. అలా చేసినప్పుడు ఎన్నో రకాల కుయుక్తులు నీలో ప్రవేశించి నీ పతనానికి దారి తీస్తాయి.

* * *

పురోగామి సామరస్యానికి ముఖ్యమైన ఆటంకం - ఎదుటి వాడిది తప్పు, మనదే ఒప్పు అని ప్రదర్శించాలనే తహతహ.

* * *

ప్రతి హృదయంలోని దైవం ఉనికి , భవిష్యత్తుకు, పరిణామానికీ మూలం.

* * *

ఎంతటి అసత్యమైనా, చివరికి సత్యం సాధించే విజయాన్ని ఆపలేదు.

* * *

ప్రేమించడమంటే స్వంతం చేసుకోవడం కాదు. తనను తాను సమర్పించుకోవడం.

* * *

నడువు ! ముందుకు నడువు ! భయాన్ని, సంకోచాన్ని వదలి ముందుకు నడువు !

* * *

ప్రపంచాన్ని మార్చాలని అనుకొంటే, మొదట నిన్ను నీవు మార్చుకో .

* * *

ఒక పనిని అతని కంటే బాగుగా చేయగలిగితే తప్ప, నీకు ఆ వ్యక్తిని గూర్చి అంచనా వేసే, నిర్ణయించే అధికారం లేదు.

* * *

* * *

పిరికితనం అహంభావానికి ప్రతీక. నీవు పిరికితనంతో ఉన్నావంటే , దానర్థం నీవు నీ నిజాయితీ కంటే, నీవు నీపై ఇతరుల అభిప్రాయాలకు ప్రాముఖ్యత నిస్తున్నావని.
* * *

నిన్ను నిన్నుగా ప్రేమించి,నిన్ను మరొక విధంగా ఉండమని కోరని వాడే నీకు నిజమైన స్నేహితుడు.
* * *

స్నేహితులవాలంటే, కలిసి హాయిగా నవ్వుకోవడం కంటే మంచి మార్గం లేదు.
* * *

దేవునిపై నమ్మకం, మరియు ఆయన విజయం పై గల అచంచల విశ్వాసమే అసలైన విశ్వాసం.
* * *

మనం ఆ ప్రభువు యొక్క సాహస వీరులమని అనుకుంటే, ఆయన మహిమ ప్రపంచం అంతటా వ్యాపిస్తుంది.
* * *

సరియైన సమాచారం దొరకనప్పుడు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంత మనస్కులమై ఉండడం మేలు.
* * *

లేని కష్టాలను ఊహించుకోకు. అది సమస్యలను ఆహ్వానిస్తుందే తప్ప, అధిగమించడానికి సహాయపడదు.
* * *

ప్రతి వస్తువులోను, ప్రతి ప్రాణిలోను, పిల్లతెమ్మెరలోను, జ్వలించే సూర్యుడిలోను నిన్ను నేను దర్శిస్తున్నాను.
* * *

ఎట్టి పరిస్థుతులలోనూ, సత్యం కోసం తన శాయశక్తులా వ్యతిరేక శక్తులతో పోరాతాం సలిపే వాడే నిజమైన ధీరుడు.
* * *

ఓ ప్రభూ ! నన్ను నీ యొక్క వెలుగును యథాతధంగా, వికృతం చేయకుండా ప్రసరించే ఒక స్వచ్చమైన స్ఫటికం లా ఉంచు.
* * *

ఎందుకు నీవు దైవాన్ని తెలుసుకోలేవు ? ఆయన నీ హృదయంలో నే ఉన్నాడు.
* * *

ఓ ప్రభూ ! నన్ను నీవైపు సూటిగా నడిపించే చిత్తశుద్ధిని ప్రసాదించు.
* * *

తిరిగి చూడకు ! నీ గమ్యం వైపే దృష్టిని సారించు. అప్పుడు నీవు తప్పకుండా అభివృద్ధిని సాధిస్తావు.
* * *

వీరుడు దేనికీ భయపడడు. దేనినీ లెఖ్ఖ చేయడు. తన పట్టును అసలే విడువడు.
* * *

నిజాయితీకి గొప్ప శత్రువులు ప్రాముఖ్యతల హెచ్చుతగ్గులు ( భౌతికంగా కానీ, ప్రాణికంగా కానీ, మానసికంగా కానీ ) , పూర్వ నిశ్చితాభిప్రాయాలు - - వీటిని ఎలాగైనా అధిగమించాలి.
* * *

దృఢనిశ్చయంతో ధైర్యంగా ఉండు. అడ్డంకులన్నీ వాటంతట అవే తొలగిపోతాయి.
* * *

నిద్రించు బాలకా ! నిద్రించి ! ప్రియమైన అమ్మ నీ హృదిలో నిండగా !
లెమ్ము బాలకా ! లెమ్ము ! ప్రియమైన అమ్మ నీ మదిలో నిండగా !
* * *

కార్యాచరణలో కష్టాలు ఎదురైతే, నిజాయితితో ఆత్మావలోకనం గావించు. అప్పుడు నీవు వాటి కారణాలను కనుగొంటావు.
* * *

తన తప్పును తెలుసుకోవడం కంటే గొప్ప వీరోచితమైన పని లేదు.
* * *

ప్రతి నవోదయం ఒక కొత్త అభ్యుదయానికి నాంది.
* * *

చేసే పనిలో ఇష్టం కలగాలంటే, దానిని మరింత బాగుగా చేయడానికి ప్రయత్నిస్తుండాలి.
* * *

నీ జీవితంలో నీకు ఒక కష్టం ఎదురైతే, అది భగవంతుని వరంగా భావించాలి. అప్పుడు అది నీకు వరంగా మారుతుంది.
* * *

ప్రతిరోజు మనం అసంబద్ధతలను, అజ్ఞానాన్ని, దోషాల్ని జయించడానికి సిద్ధం కావాలి.
* * *

అభివృద్ధి పథంలో సాగనప్పుడు జీవితం మీద విసుగు పుడుటుంది.
* * *

ఈ రోజు సాధించలేనిది నీవు రేపు తప్పకుండా సాధిస్తావు. దృఢ నిశ్చయంతో ఉండు. నీకే విజయం కలుగుతుంది .
* * *

ధైర్యంతో, సహనంతో, అప్రమత్తతతో, చిత్తశుద్దితో, నిజాయితీతో మెలగు. అప్పుడు నీవు అన్ని కష్టాలను ఎదుర్కోగలవు.
* * *

ఒక విషయం కష్టంగా ఉందని వదిలి వేయకూడదు. మీదు మిక్కిలి అందులో విజయం సాధించాలంటే అంతకంటే ఎక్కువ దృఢ నిశ్చయంతో ఉండాలి.
* * *


నటించకు - జీవించు. బాసలు చేయకు - ఆచరించు. కలలు కనకు - సత్యాన్ని సాక్షాత్కరించు.
* * *

విజయం అత్యంత సహనశీలికే. * * *

నిరాడంబరతలోనే గొప్ప సౌందర్య ముంది.
* * *

గొప్ప ప్రభావాల మూలాలు నిశ్శబ్దంలోనే దాగి వుంటాయి.
* * *

ఒక దీపం మరొక దీపాన్ని ఎలా వెలిగిస్తుందో, అలా ధీరోదాత్తులు ఇతరులకు ధైర్యాన్ని ఇవ్వగలుగుతారు.
* * *

సమస్యలను సాధించే శక్తి నిట్టూర్పులో కంటె, చిరునవ్వులోనే ఎక్కువగా ఉంది.
* * *

గడ్డు దినాలలో తప్పక దారి చూపెట్టేది విశ్వాసం.
* * *

విశ్వాసంతో ముందుకు సాగుదాం. నమ్మకంగా నిరీక్షిద్దాం.
* * *

ముందుకు నడువు ! ఎప్పుడూ ముందుకు పో ! ఈ సొరంగం చివర వెలుతురు ఉంది. ఈ సమరం తుద విజయం ఉంది.



- సమాప్తం -

ఆంగ్లంలో సంకలనం : విజయ్
తెలుగు అనువాదం : నాగరాజు రవీందర్
ప్రథమ ముద్రణ : ఫిబ్రవరి 2004
ద్వితీయ ముద్రణ : సెప్టెంబర్ 2006
compiled from the writings of The Mother.

Wednesday, October 21, 2009

రోడ్డు మలుపు




మార్చిలో వ్రాసిన కవిత

కోడి కూస్తోంది
సెలయేరు ప్రవహిస్తోంది
చిన్ని పక్షులు కిచకిచ మంటున్నాయి
సరస్సు తళతళా మెరుస్తోంది
పచ్చని మైదానం ఎండలో పడుకొని ఉంది.

చిన్నా పెద్దా అందరూ కలిసి
పొలంలో పనిచేస్తున్నారు
పశువులు పచ్చిక మేస్తున్నాయి
వంచిన వాటి తలలు పైకి లేవడం లేదు

ఓడిపోయిన సైన్యం లా
మంచు వెనక్కి పారిపోయింది
అది ఇప్పుడు కొండచరియపై
దాక్కొని ఉంది.

నాగలి పట్టిన రైతు
కూనిరాగాలు తీస్తున్నాడు                                                 
పర్వతాల్లో హర్షం వెల్లివిరిసింది.                                                             
నీటిబుగ్గల్లో జీవం తొణికిసలాడింది
చిన్నిమబ్బులు  తేలిపోతున్నాయి
నీలాకాశం విస్తరించింది
వాన వచ్చి వెలిసింది.



( William Wordsworth   ఆంగ్ల పద్యం   Lines written in March  కు  స్వేచ్చానువాదం.   )




శిథిలాలు


శిథిలాలు
గత వైభవాల చిహ్నాలు.
 శిథిలాలు
వర్తమానపు కటిక చేదు నిజాలు.
శిథిలాలు
మన ప్రాచీన నాగరకతకు ఆనవాళ్ళు.
శిథిలాలు
అశాశ్వతాలకు ప్రతీకలు.
శిథిలాలు
ప్రకృతి స్వాభావికతకు గీటురాళ్ళు.




ప్రాస పద్యములు


1. ద్విప్రాస :

నవనీత చోరుడవు మా
నవ లోకమ్మున వెలసిన నాథుండవు; దా
నవ సంహారకుడవు, గా
నవరదుడవు నీవు, నన్ను గావుము కృష్ణా!

2. త్రిప్రాస :

ఓంకారము సలుపుచు కరి
ఘీంకారము సేయగ హరి గీమును విడచెన్.
ప్రాకారము దాటి పిదప
సాకారము బూని నిలిచి చక్రము నేసెన్

3. చతుష్ప్రాస :

గణగణ మ్రోగెను గంటలు
గణగణమని మ్రోగెను బడిగంటలు; మ్రోగెన్
గణగణ గుడిలో గంటలు
గణగణ గణగణ గణగణ గంటలు మ్రోగెన్.







కొన్ని గీతార్థ పద్యములు





( కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన........)

కర్మలు సుకర్మములనగ
కర్మ ఫలమ్ములను మరిచి కర్మించవలెన్.
కర్మలు యజ్ఞమని తలచి
కర్మ ఫలంబు పరమాత్మ కర్పింపవలెన్.

( జాతస్య హి ధ్రువో మృత్యు: ధ్రువం జన్మ మృతస్యచ:  .....)

గిట్టిన వానికి జననము
పుట్టిన వానికి మరణము పొలుచును ; పవనుం
డెట్టుల తావిని మోయునొ
యట్టుల వాసనలు గల్గు నాత్మకు యెపుడున్.

( నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావక:....)

వాయువు చేతను యెండదు
ఆయుధము వలన విరుగదు; అంగారమునన్
 మాయదు, చావదు దేనితొ ;
తోయము చేతను తడవదు తుదకున్ పార్థా!

( యత్ర యోగీశ్వర కృష్ణో, యత్ర పార్థో ధనుర్ధర :.... )

ఎక్కడ కృష్ణుడు గలడో!
ఎక్కడ గాండీవి పార్థుడెచటన్ గలడో!
అక్కడ విజయము తథ్యము
నక్కడ సంపదలు గల్గు నైశ్వర్యములున్.


Tuesday, October 20, 2009

పచ్చిక బయలు



అల్లిక




హమ్మింగ్ బర్డ్



ఈగ

http://commons.wikimedia.org/wiki/File:Fly_01.gif

జవనాశ్వం

http://commons.wikimedia.org/wiki/File:Animhorse.gif

వసుధైక కుటుంబం



Monday, October 19, 2009

మోసెస్ రాస్ అబ్‌స్ట్రాక్ట్ వర్ణచిత్రం - ఎత్తుకో బరువు





రంగుల తెరలు

Animated Kaleidoscope


చలద్వలయాలు

rotating rings





ఠాట్



'''ఠాట్''' : 20 వ శతాబ్దంలోని గొప్ప హిందుస్తానీ సంగీతజ్ఞులలో వొకడైన విష్ణు నారాయణ్ భాత్ఖండె (1860 - 1936) , ప్రకారం హిందుస్తానీ రాగాలన్నీ పది ఠాట్‌ల పైనే ఆధారపడి ఉంటాయి. అవి:
1.మార్వా  2.బిలావల్  3.కాఫి  4.ఖమాజ్  5.కల్యాణ్  6.భైరవి  7.భైరవ్  8.పూర్వి  9.అసావేరి  10.తోడి.
ఉదాహరణకు, రాగ్ పురియా ధనశ్రీ మరియు రాగ్ శ్రీ లు పూర్వి ఠాట్‌కు చెందుతాయి. అలాగే మాల్‌కౌంస్ రాగము భైరవి ఠాట్‌కు, దర్బారి కానడా రాగం అసావేరి ఠాట్‌కు చెందుతాయి. పైన ఉదహరించిన ప్రతి ఠాట్‌ పేరుతో ఒక రాగం కూడా ఉండొచ్చు. కాని ఠాట్‌ వేరు, రాగం వేరు.
ఠాట్‌ హిందుస్తానీ సంగీతంలో ఒక రకమైన సంగీత కొలమానం.

1. '''మార్వా రాగం''' : ఇది మార్వా ఠాట్ కు చెందిన రాగం. స్వరాలు - స రి గ మ ద ని . ఇందులో తీవ్ర మధ్యమ్ (మ), కోమల రిషభ్ (రి)లు
ఉంటాయి. మిగతా నాలుగు స్వరాలన్నీ శుద్ధ స్వరాలే.

* ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ మార్వా ఠాట్‌ పరిగణలోకే వస్తాయి.

2.'''బిలావల్ రాగం''' : ఇది బిలావల్ ఠాట్ కు చెందిన రాగం. ఇది ప్రాత: కాల రాగం. స్వరాలు - స రి గ మ ప ద ని. అన్నీ శుద్ధ స్వరాలే.
* ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ బిలావల్ ఠాట్‌ పరిగణలోకే వస్తాయి.

3. '''కాఫి రాగం''' : ఇది కాఫి ఠాట్ కు చెందిన సాయంకాల రాగం. స్వరాలు - స రి గ మ ప ద ని. గాంధార్ (గ) మరియు నిషాద్‌(ని)లు
కోమలములు. మిగతావి శుద్ధ స్వరాలు.
* ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ కాఫి ఠాట్‌ పరిగణలోకే వస్తాయి.

4. '''ఖమాజ్ రాగం''' : ఇది ఖమాజ్ ఠాట్ కు చెందిన సాయంకాల రాగం. ఇందులో నిషాదము(ని) కోమలశుద్ధ స్వరాలు.
* ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ ఖమాజ్ ఠాట్‌ పరిగణలోకే వస్తాయి.

5. '''కల్యాణ్ రాగం''' : ఇది కల్యాణ్ ఠాట్ కు చెందిన సాయంకాల రాగం. స్వరాలు - స రి గ మ ప ద ని. ఐదు స్వరాలు ఆరోహణ, ఏడు
స్వరాలు అవరోహణ ; తీవ్ర మధ్యమ్; మిగతావన్నీ శుద్ధ స్వరాలు
* ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ కల్యాణ్ ఠాట్‌ పరిగణలోకే వస్తాయి.

6. '''భైరవి రాగం''' : ఇది భైరవి  ఠాట్ కు చెందిన ఉదయకాల రాగం.  స్వరాలు - స రి గ మ ప ద ని. రిషభము(రి), గాంధారము(గ),   దైవతము(ద), మరియు నిషాదము(ని) కోమల స్వరాలు; శుద్ధ మధ్యమ్.
* ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ భైరవి  ఠాట్‌ పరిగణలోకే వస్తాయి.

7. '''భైరవ్ రాగం''' : ఇది భైరవ్ ఠాట్ కు చెందిన రాగం. ఇది ప్రాత: కాల రాగం. స్వరాలు - స రి గ మ ప ద ని. రిషభము(రి) మరియు 
దైవతము(ద) కోమలములు. మిగతావన్నీ శుద్ధ స్వరాలు.
* ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ భైరవ్  ఠాట్‌ పరిగణలోకే వస్తాయి.  

8. '''పూర్వి రాగం''' : ఇది పూర్వి  ఠాట్ కు చెందిన రాగం. ఇది సంధిప్రకాశ రాగం. అంటే సంధ్య వేళలో పాడే రాగం. స్వరాలు - స రి గ మ ప
ద ని. రిషభము(రి) మరియు  దైవతము(ద) కోమల స్వరాలు. మధ్యమము(మ) తీవ్రము మరియు శుద్ధము. గాంధారము(గ) మరియు
నిషాదము(ని)  శుద్ధ స్వరాలు.       
* ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ  పూర్వి ఠాట్‌ పరిగణలోకే వస్తాయి.

9.''' అసావేరి రాగం''' : ఇది అసావేరి ఠాట్ కు చెందిన ఉదయకాల రాగం. స్వరాలు - స రి గ మ ప ద ని. ఐదు స్వరాలు ఆరోహణ, ఏడు 
స్వరాలు   అవరోహణ. గాంధారము(గ), దైవతము(ద) మరియు నిషాదము(ని) కోమల స్వరాలు. మిగతావి శుద్ధ స్వరాలు.
* ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ  అసావేరి  ఠాట్‌ పరిగణలోకే వస్తాయి.

10. '''తోడి రాగం''' :  ఇది తోడి ఠాట్ కు చెందిన రాగం. ఇది ప్రాత: కాల రాగం. స్వరాలు - స రి గ మ ప ద ని. రిషభము(రి), గాంధారము(గ)మరియు  దైవతము(ద) కోమలములు; తీవ్ర మధ్యమ్; శుద్ధ్ నిషాద్.
* ఈ రాగ లక్షణాలున్న రాగాలన్నీ తోడి  ఠాట్‌ పరిగణలోకే వస్తాయి.
 
==మూలాలు==
* [http://www.itcsra.org/] ఐ.టి.సి. సంగీత్ రీసెర్చ్ అకాడమీ



Sunday, October 18, 2009

కిషోరీ అమోంకర్

'''కిషోరీ అమోంకర్''' (మరాఠీ: किशोरी आमोणकर) (జననం: ఏప్రిల్ 10, 1931 ) ప్రముఖ భారతీయ హిందుస్తానీ సంగీత విద్వాంసురాలు. ఈమె జయ్‌పూర్ - అత్రౌలి ఘరానా కు చెందిన ఖయాల్ లను చక్కగా పాడుతుంది.

== బాల్యం, జీవిత చరిత్ర ==
కిషోరీ అమోంకర్ తల్లి, సుప్రసిద్ధ హిందుస్తానీ సంగీత గాయకురాలు, మోగుబాయి కుర్దీకర్. కిషోరీ తల్లి వద్దనే సంగీతాన్ని అభ్యసించింది.

== సంగీత ప్రస్థానం ==
కిషోరీ అమోంకర్ జయ్‌పూర్-అత్రౌలి ఘరానా యొక్క క్లిష్టమైన సంగతులను త్వరలోనే ఆకళింపు చేసుకొని, తన స్వంత గాయన శైలిని రూపొందించుకొంది. ఈమె తన సహజమైన మధుర గాత్రంతో, పురాతన జయ్‌పూర్-అత్రౌలి ఘరానా సాంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా, అలవోకగా రాగాలను ఆలపించి, అటు సంగీత విద్వాంసులను, ఇటు శ్రోతలను ఆకట్టుకొంటుంది. ఆమె గాయనంలో ''బోల్తాన్, ఫిర్తాన్'' ల సౌందర్యం చెక్కుచెదరదు. ఆమె హిందీ మరియు మరాఠీ భక్తిగీతాలు, సంస్కృత, కన్నడ భజనల నెన్నింటినో పాడింది.

== శిష్యగణం ==
మానిక్ భిడె, పద్మా తల్వార్కర్, [[అరుణ్ ద్రావిడ్ , రఘునందన్ పన్శీకర్, వయొలినిస్ట్, మిలింద్ రాయ్కర్, విద్యా భగ్‌వత్, మనవరాలు తేజశ్రీ  అమోంకర్‌లు.

== వ్యక్తిగత జీవితం ==

కిషోరీ అమోంకర్ బడిపంతులు, రవి అమోంకర్‌ను పెళ్ళి చేసుకొంది. ఆయన 1992 లో మరణించాడు. కిషోరీ అమోంకర్ రాఘవేంద్ర స్వామి భక్తురాలు.

== విడుదలైన ఆల్బంలు ==
1. దివ్య (2008)
2. ప్రభాత్ (2000)
3. సాంప్రదాయ (2003)
4.మల్హార్ మాలిక
5. సంగీత్ సర్తాజ్
6. కిషోరీ అమోంకర్ - లైవ్ ఇన్ లండన్
7. దృష్టి
8. బాగెశ్రీ ‍‍‍‍‍‍‍, భూప్ - ఎల్.పి. రికార్డు (1972)

== అవార్డులు ==
*  పద్మవిభూషణ్ అవార్డు ( 2002 )
* గాన సరస్వతి
* సంగీత నాటక అకాడమి అవార్డు ( 1985 )
* పద్మభూషణ్ అవార్డు ( 1987 )
* సంగీత సామ్రాజ్ఞి అవార్డు ( 1997 )

== బయటి లింకులు ==
* [http://www.allaboutjazz.com/php/article.php?id=21461 ఆల్ అబౌట్ జాజ్ పత్రిక]లో కిషోరీ అమోంకర్ గురించి
* http://www.chembur.com/anecdotes/kishori.htm
* [http://profiles.incredible-people.com/kishori-amonkar/ ఇంక్రెడిబల్ పీపుల్ డాట్ కామ్] -కిషోరీ అమోంకర్


అంజద్ అలీ ఖాన్

'''అంజద్ అలీఖాన్''' : ఉస్తాద్ అంజద్ అలీఖాన్ ( జననం- మార్చి, 1946 ) ప్రముఖ భారతీయ సరోద్ విద్వాంసుడు.

== బాల్యం ==
గ్వాలియర్ రాజవంశపు ఆస్థాన సరోద్ విద్వాంసుడైన, తండ్రి హఫీజ్ అలీఖాన్ వద్ద అంజద్ అలీఖాన్ సరోద్ వాదనం నేర్చుకొన్నాడు .ఆయన తండ్రితాతలు ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చినప్పుడు, తమ వెంట తెచ్చిన రబాబ్ (Rabab) ను క్రమంగా సరోద్‌గా తీర్చిదిద్దారు. ఈనాటి సరోద్ సేనియా మైహర్ ఘరానాకు చెందిన ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్, అతని సోదరుడు ఉస్తాద్ ఆయెత్ అలీఖాన్ చేతిలో ఎన్నో మార్పులకు గురైంది.

== సంగీత ప్రస్థానం ==

ఖాన్ సరోద్ వాదనాన్ని ఒక ప్రత్యేక శైలిలో అభివృద్ధి పరిచాడు. గాత్రసంగీతంలోని క్లిష్టమైన 'తాన్ల'ను , ఆరోహణ అవరోహణ క్రమంలో సరోద్‌పై అలవోకగా పలికిస్తాడు. మరొక ప్రఖ్యాత సరోద్ విద్వాంసుడు, ఉస్తాద్ అలీ అక్బర్‌ఖాన్ కు సరోద్‌లు తయారు చేసే కోల్‌కతా లోని 'హెమెన్ సేన్ ' అంజద్ అలీఖాన్‌కు సరోద్‌లు తయారుచేసి ఇస్తాడు. గత 40 ఏళ్ళుగా అంజద్ అలీఖాన్‌ దేశవిదేశాల్లో సరోద్ కచేరీల ప్రదర్శనల నిస్తున్నాడు.

== వివాహం ==
అంజద్ అలీఖాన్‌కు సుబ్బులక్ష్మితో వివాహం జరిగింది. కొడుకులు అయాన్, అమాన్‌లు తండ్రి వారసత్వంగా, సరోద్‌నే వాయిస్తున్నారు.
== అవార్డులు ==
# 2001 లో పద్మ విభూషణ్ పురస్కారం.
# 2004 లో Fukuoka Asian Culture Prize.
# 1997 లో హూస్టన్ (Houston), Tulsa మరియు Nashville లు గౌరవ పౌరసత్వాన్ని ప్రదానం చేశాయి.
# 1984 లో Massachusetts, ఏప్రిల్ 20 తేదీని ''అంజద్ అలీఖాన్‌ దినం'' గా ప్రకటించింది.

== బయటి లింకులు ==
* [http://www.hinduonnet.com/thehindu/fr/2006/04/28/stories/2006042801510300.htm] హిందూ దినపత్రికలో
* [http://www.hindu.com/mag/2006/01/08/stories/2006010800010100.htm]హిందూ దినపత్రికలో
* [http://www.sarod.com/]అంజద్ అలీఖాన్‌ వెబ్‌సైట్
* |URL             = [http://sarod.com/ అధికారిక వెబ్‌సైట్]

పి.సి.సర్కార్


'''పి.సి.సర్కార్''' (P. C. Sorcar) (జ: ఫిబ్రవరి 23, 1913 - మ: జనవరి 6, 1971) గా పిలువబడే '''ప్రొతుల్ చంద్ర సర్కార్''' గొప్ప భారతీయ ఐంద్రజాలికుడు. దేశవిదేశాల్లో లెక్కలేనన్ని ఇంద్రజాల ప్రదర్శనల నిచ్చాడు. అతనికి ముగ్గురు కుమారులు. మానిక్ సర్కార్, దర్శకుడు, ఎనిమేటర్, లేసర్ నిపుణుడు. పి.సి.సర్కార్ జూనియర్ మరియు ''పి.సి.సర్కార్ యంగ్''లు  ఇంద్రజాలికులు.

==బాల్యం, ఇంద్రజాలం==
సర్కార్ ''బెంగాల్'' (ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉంది) లోని ''తంగైల్ జిల్లా'', ''ఆశిక్‌పూర్‍లో'' జన్మించాడు. ''శివనాథ్'' హైస్కూల్‌లో చదివాడు. తన తొలి ఇంద్రజాల పాఠాలు, ఇంద్రజాలికుడు ''గణపతి చక్రవర్తి'' నుండి నేర్చుకొన్నాడు. 1930 దశకం నుండి కోల్‌కతా, జపాను మరియు ఇతర దేశాలలో ప్రదర్శనల కీర్తిని గడించాడు. తన 58 వ ఏట, జపాన్ లో ఇంద్రజాల ప్రదర్శన యిస్తుండగా, గుండెపోటుతో మరణించాడు.

==అవార్డులు, పురస్కారాలు==
*1. భారత ప్రభుత్వం కోల్‌కతాలోని ఒక పెద్ద వీథికి, ''జాదు సమ్రాట్ పి.సి.సర్కార్ సారణి'' అని నామకరణం చేసి, అతనిని సమ్మానించింది.
*2. పి.సి.సర్కార్ 1964లో,  భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకొన్నాడు.
*3. ''ద స్ఫింక్స్'' ( ఆస్కర్ ఆఫ్ మ్యాజిక్ ) - యు.ఎస్.ఎ., 1964, 1954.
*4. ''ద గోల్డెన్ లారెల్'' - జర్మనీ దేశం, 1956
*5. ''ద రాయల్ మెడలియన్'' - జర్మన్ మ్యాజిక్ సర్కిల్.

==ఇంకా==
* [http://en.wikipedia.org/wiki/Indian_magicians]భారత మెజీషియన్లు
==బయటి లింకులు==
* [http://www.pcsorcarmagician.com/]పి.సి.సర్కార్ అంతర్జాతీయ గ్రంధాలయము
* [http://banglapedia.search.com.bd/HT/S_0501.htm]పి.సి.సర్కార్ బంగ్లాపీడియా
* [http://www.indianmagicians.com/]భారత మెజీషియన్ల వెబ్‌సైట్




బిర్జూ మహరాజ్


'''బిర్జూ మహరాజ్‌'''గా పిలువబడే '''బిర్జూ మోహన్‌నాథ్ మిశ్రా''' (ఫిబ్రవరి 4, 1938), భారతీయ కథక్ నాట్య కళాకారుడు. ఇతడు లక్నో''కాల్కా-బిందాదిన్ ఘరానా''కు చెందినవాడు. బిర్జూ కథక్ కళాకారుల కుటుంబంలో పుట్టాడు. ఈయన తండ్రి అచ్చన్ మహరాజ్, మేనమామలు శంభూ మహరాజ్, లచ్చూ మహరాజ్ లు పేరొందిన కథక్ కళాకారులు. చిన్నతనం నుండి నాట్యంపైనే మక్కువ ఉన్నా, బిర్జూ హిందుస్తానీ గాత్రంలో కూడా ఆరితేరినవాడు. కథక్ నాట్యానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చాడు. ఇతడు దేశవిదేశాల్లో వేలాది నాట్య ప్రదర్శనలనిచ్చి, ఎందరో విద్యార్థులను నాట్య కళాకారులుగా తీర్చిదిద్దాడు.

==బాల్యం==
తండ్రి అచ్చన్ మహరాజ్ రాయ్‌ఘర్ ఆస్థాన నర్తకుడు. తండ్రి వద్దనే కాక, మేనమామలు, లచ్చూ మహరాజ్, శంభూ మహరాజ్‌ల వద్ద తొలి నాట్య పాఠాలను నేర్చుకొన్నాడు. తన ఏడవ యేట, తొలి నాట్య ప్రదర్శన నిచ్చాడు.

==నాట్య ప్రస్థానం==
బిర్జూ మహరాజ్ తన పదమూడవ ఏటి నుండే, న్యూఢిల్లీ లోని సంగీత భారతిలో నాట్యాచార్యుడిగా పనిచేయడం ప్రారంభించాడు. తరువాత భారతీయ కళాకేంద్ర మరియు సంగీత నాటక అకాడమీ లో ప్రధాన నాట్యాచార్యుడిగా ఉండి, 1998 లో రిటైర్ అయ్యాడు.
బిర్జూ మహరాజ్ సత్యజిత్ రే సినిమా'' షత్రంజ్ కే ఖిలారి'' లో సంగీతం సమకూర్చి, పాడాడు. దేవ్‌దాస్ (2002) సినిమాలో, ''కాహె ఛేడ్ మొహె'' అనే పాటకు నాట్యం చేశాడు.
==అవార్డులు మరియు గౌరవ పురస్కారాలు==
*1.పద్మవిభూషణ్ - 1996
*2. సంగీత నాటక అకాడమీ అవార్డు
*3. కాళిదాస్ సమ్మాన్*
4. డాక్టరేట్ డిగ్రీ - బనారస్ హిందూ యునివర్సిటీ నుండి.
*5. లతా మంగేష్కర్ పురస్కార్ - 2002

==సినిమాలు==
*1. దేవ్‌దాస్ (2002)
*2. గదర్ 2001
*3. దిల్ తో పాగల్ హై
*4. షత్రంజ్ కే ఖిలారి

==వనరులు==
# [http://maestroesclassicaldancers.weebly.com/achchan-maharaj.html అచ్చన్ మహరాజ్]
# [http://www.deccanherald.com/deccanherald/mar072004/sh6.asp బిర్జూ మహరాజ్ - కథక్]
# [http://www.expressindia.com/ie/daily/19980610/16151124.html బిర్జూ మహరాజ్]

==బయటి లింకులు==
1. [http://www.birjumaharaj-kalashram.com/ పండిట్ బిర్జూ మహరాజ్]




నాలాయిర దివ్య ప్రబంధము



'''నాలాయిర దివ్య ప్రబంధము''' 8 వ శతాబ్దానికి ముందు , పండ్రెండు మంది ఆళ్వారులు రచించిన 4000 పాశురాల సమాహారం. తమిళంలో ''నాలాయిర'' మనగా నాలుగువేలు. 9 వ శతాబ్దంలో నాథముని వీటిని క్రోడీకరించాడు.
నారాయణుని, అతని అనంత రూపాలను కీర్తించే ఈ దివ్య ప్రబంధాన్ని ఆళ్వారులు పెక్కు దేవాలయాల్లో గానం చేశారు. అలా గానం చేయబడిన ప్రాంతాలను ''దివ్య దేశములు'' అని అంటారు. దక్షిణభారతంలో ముఖ్యంగా తమిళనాడు లో దివ్య ప్రబంధాన్నివేదాలతో సమంగా పరిగణిస్తారు. అందుకే దీనిని'' ద్రవిడ వేదం'' అని అన్నారు. శ్రీరంగం మొదలైన ఎన్నో దేవాలయాలలో ప్రతినిత్యం విధిగా ఈ దివ్య ప్రబంధాన్నిఉచ్చరించడం భగవత్సేవలో ఒక ముఖ్యమైన భాగం. 4000 పాశురాల్లో 1100 పైచిలుకు పాశురాలు ''తిరుక్కురుగూరు'' కు చెందిన నమ్మాళ్వారు రచించాడు. వీటినే తిరువాయ్‌మొళి అని కూడా పిలుస్తారు.
తిరువాయ్‌మొళి అనగా, ''పవిత్రమైన నోటి నుండి వెలువడే మాటలు'' అని అర్థం. ఇందులో నమ్మాళ్వారు తనను తాను, కృష్ణుని ప్రేమకై తపించే ఒక గోపికగా అభివర్ణించుకుంటాడు.

== సంకలన నేపథ్యం ==

ఎక్కడో పోయినవనుకున్న దివ్య ప్రబంధ పాశురాలను నాథముని సేకరించి, సంకలన పరిచాడు. నాథముని ఇప్పటి ''కాట్టు మన్నార్ కోయిల్'' అయిన ''వీరనారాయణ పురం''లో జన్మించాడు. అళ్వారులలో చివరి వాడైన తిరుమంగై ఆళ్వారు కు నాథమునికి మధ్య ఎంతో కాలవ్యత్యాసం ఉంది. ఈ మధ్య కాలంలో ఆ 4000 పాశురాలేమైనవో ఎవరికీ తెలియదు.
ఒకసారి నాథముని కుంభకోణం లో నమ్మాళ్వారు యొక్క ''ఆరావముడె'' ను ప్రజలు గానం చేస్తుండగా విన్నాడు. అందులోని ఒక పాశురంలో'' ఆయిరత్తుల్ ఇప్పత్తుల్'' ( తమిళం : వేయిలో ఈ పది ) అని ఉంది. అయితే మిగతా 990 పాశురాలు ఏమైనట్టు ? నాథముని ప్రజలను విచారించి నమ్మాళ్వార్ స్వస్థలమైన ''తిరుక్కురుగూరు'' కు వెళ్ళాడు. అక్కడి ప్రజలు ,నమ్మాళ్వారు శిష్యుడైన మధురకవి ఆళ్వారు రచించిన 11 పాశురాల గురించి చెప్పారు. అలాగే వారు నాథమునిని, నమ్మాళ్వారు స్వస్థలానికి వెళ్ళి ఈ 11 పాశురాలను 12000 సార్లు ఉచ్చరించమని సలహా ఇస్తారు. నాథముని అలాగే చేస్తాడు. అప్పుడు నమ్మాళ్వారు సంతోషించి, తన 1000 పాశురాలనే కాక, మిగతా ఆళ్వారులు రచించిన పాశురాలతో సహా, మొత్తం 4000 పాశురాలను ప్రసాదిస్తాడు.
==చూడు==
* [http://en.wikipedia.org/wiki/Araiyar_sevai]ఆరైయార్ సేవై
==వనరులు==
1. [http://www.srivaishnavam.com/prabandham.htm]దివ్య ప్రబంధం - ఉపోద్ఘాతం.
2. [http://www.ramanuja.org/sv/bhakti/archives/jun99/0167.html]థూనిళా ముర్రం 40 వ భాగం.
3. [http://www.ramanuja.org/sv/bhakti/archives/jul97/0083.html]నాథమునికి నివాళి
4. [http://www.srivaishnavan.com/]నాలాయిర దివ్య ప్రబంధము - అనువాదం
5. [http://www.hindu.com/br/2004/03/23/stories/2004032300050102.htm]ఆళ్వారుల పాశురాలు


కేలడి చెన్నమ్మ


'''కేలడి చెన్నమ్మ'''  :  కేలడి చెన్నమ్మ కర్ణాటక రాష్ట్రం, షిమోగ జిల్లాలోని కేలడి ప్రాంతాన్ని పరిపాలించిన వీరవనిత. ఈమె కుందాపూర్ రాజు సిద్ధప్ప శెట్టి కుమార్తె; సోమశేఖరుని 1667 లో వివాహమాడింది. 1671 నుండి 1696 వరకు, పాతికేళ్ళు పరిపాలనలో ఉండి, బీజాపూర్ సైన్యాన్నీ, ఔరంగజేబు నూ ఎదిరించి,  భర్త చేయలేని పనిని ఆమె చేసి రాజ్యాన్ని రక్షించుకొంది. శివాజీ కుమారుడు, రాజారామ్ కు ఆశ్రయమిచ్చి, ఔరంగజేబు కోపానికి గురి అయింది.
1824 లో బ్రిటిష్ సైన్యం కిత్తూరు (ఇప్పుడు కర్ణాటకలో ఉంది) ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె కరవాలం ధరించి వీరోచితంగా పొరాడింది. చివరకు బ్రిటిష్ వారికి బందీగా చిక్కి, 1829 లో మరణించింది. కాని ఆ పోరు అంతటితో ఆగలేదు. రాయన్న అనే చెన్నమ్మ సైనికుడు తిరిగి యుద్ధాన్ని ప్రారంభించాడు. కాని ఎన్నో యుద్ధాల తరువాత, అతను కూడా బ్రిటిష్ వారికి చిక్కి, 1830 లో ఉరితీయబడ్డాడు.

==మూలాలు==
[http://profiles.incredible-people.com/keladi-chennamma/]కేలడి చెన్నమ్మ
==బయటి లింకులు==
[http://www.freeindia.org/biographies/keladi/]కేలడి చెన్నమ్మ


గోండు భాష


'''గోండు భాష''' :    ఆదిలాబాదు మరియు బస్తర్ జిల్లాల్లో గోండు గిరిజనులు మాట్లాడే భాషే గోండు భాష. ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన గోండీ, తెలుగు కన్నా కన్నడకు దగ్గరగా ఉంటుంది. గోండుల్లో ఇప్పటికీ చాలా మందికి గోండీ తప్ప మరే భాషా రాదు, అర్థం కాదు. గోండులతో సహవాసం చేసే కొలాములు తమ భాష కొలామీయే కాక గోండీ కూడా మాట్లాడగలరు.


==కొన్ని పదాలు==

ఎడ్కి - జ్వరము  ,  పిర్ - వాన  , మర్మి - పెండ్లి ,  కేడ పేన్ -  అడవి దేవుడు ,  పాడి - ఇంటి పేరు ,
నాడి - రేపు ,  నర్ క -  రాత్రి , సక్ రే - ప్రొద్దున ,  హాటుం - అంగడి  , సారి - రొట్టె ,  ఉద - కూర్చో ,
రోన్ - ఇల్లు , సమ్దిర్ - అందరు ,  చొకట్ - క్షేమం ,  కాండి - కొడుకు , పేడి - కూతురు ,కరున్ - దగ్గర ,
లంగ్ - దూరం ,  పోడ్ దరి - సాయంకాలం ,  జోప్ - నిద్ర , తరస్ - పాము , పెర్స - పెద్ద ,  యేర్ - నీరు ,
గాటు - అన్నం ,  కై కాల్ - కాలు చేతులు , మంత - ఉంది , సిల్లె - లేదు,  పొరల్ - పేరు , బత పొరల్? - ఏమి
పేరు? ,  గాటు తిత్తి కీ ?- అన్నం తిన్నవా?





బ్లాగు పద్యం


బ్లాగు లన్ని జూడ బాగుగా కనుపించు
చదువుతుంటె వాటి విధము దెలుయు
బ్లాగు లందు కొన్ని బ్లాగులు వేరయా
బ్లాగు లేని వాడి బాట విడుము

నేర్చుకో




పూలను చూసి నేర్చుకో నవ్వడం
తుమ్మెదలను చూసి నేర్చుకో పాడడం
చెట్ల నుండి వంగిన కొమ్మలను
చూసి నేర్చుకో వినమ్రంగా ఉండడం
మలయ మారుతాన్ని చూసి నేర్చుకో
మృదుమధుర భావాల్ని ప్రసరించడం
రవి కిరణాలను చూసి నేర్చుకో
మేలుకొనడం, మేలుకొలపడం
తరులతలను చూసి నేర్చుకో
కలిసిమెలిసి ఉండడం
చేపను చూసి నేర్చుకో
స్వదేశం కోసం గిలగిలలాడడం
శిశిరంలోని చెట్లను చూసి నేర్చుకో
భాధలో కూడా ధైర్యాన్ని వహించడం. 

Saturday, October 17, 2009

దత్తాత్రేయ విష్ణు పలుస్కర్


'''పండిట్ దత్తాత్రేయ విష్ణు పలుస్కర్'''  ( మే 28, 1921 - అక్టోబర్ 25, 1955 ) హిందుస్తానీ సంగీత విద్వాంసుడు. ఆయన బాలమేధావి. భక్తి భజనల గాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈయన పాడిన భజనలలో "పాయోజీ మైనే రామ్ రతన్ ధన్" మరియు మహాత్మాగాంధీకి ప్రీతిపాత్రమైన "రఘుపతి రాఘవ రాజారామ్" ప్రసిద్ధమైనవి.Pop culture India! By Asha Kasbekar పేజీ.35 [http://books.google.com/books?id=Sv7Uk0UcdM8C&pg=PA35&dq=DV+Paluskar]

==బాల్యం, జీవితం==
డి.వి. పలుస్కర్ మహారాష్ట లోని నాసిక్ లో జన్మించాడు. అతని తండ్రి ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు విష్ణు దిగంబర్ పలుస్కర్ . డి.వి. పలుస్కర్ పదేళ్ళ వయస్సులోనే తండ్రిని పోగొట్టుకొనగా, ఆయన తండ్రి యొక్క శిష్యులైన పండిట్ వినాయక్ రావు పట్వర్ధన్  మరియు పండిట్ నారాయణ్‌రావ్ వ్యాస్ లు అతనికి సంగీత శిక్షణ నిచ్చారు. ''పండిట్ చింతామన్ రావు పలుస్కర్'' మరియు ''పండిట్ మిరాశీ బువా'' లు కూడా డి.వి. పలుస్కర్‌కు సంగీతాన్ని నేర్పినారు.

== సంగీత ప్రస్థానం ==
పలుస్కర్ తన పద్నాలుగవ యేట, పంజాబు లోని హర్‌వల్లభ్ సంగీత సమ్మేళన్ లో తన తొలి సంగీత కచేరీ నిచ్చాడు. అతడు ముఖ్యంగా గ్వాలియర్ ఘరానా మరియు గంధర్వ మహావిద్యాలయం కు చెందిన వాడైనా, ఇతర ఘరానాలలోని మంచి సంగతులను స్వీకరించేవాడు. ఆ తరంలో చాలామంది ఇతర సంగీతకారుల లాగే తన ''ఘరానా గాయకీ''ని ఆపోసన పట్టిన తర్వాత ఇతర ఘరానాల నుండి స్వీకరించేందుకు స్వతంత్రించవచ్చని భావించాడు.Khyāl By Bonnie C. Wade పేజీ.45 [http://books.google.com/books?id=MiE9AAAAIAAJ&pg=PA45&dq=Paluskar]అతని గాత్రం మధురం; రాగాన్ని చాలా స్పష్టంగా పాడేవాడు. బందిష్, తాన్లను అద్భుతంగా ఆలపించేవాడు. అతని మొదటి ఆల్బం 1944 లో విడుదలయింది. 1955 లో, భారతీయ కళాకారుడి హోదాలో చైనా ను సందర్శించాడు.
తన తండ్రిలాగే పలుస్కర్ భక్తిపరుడు. శాస్త్రీయ సంగీతాన్నే కాక, అతడు భజనలు కూడా పాడేవాడు. బైజూ బావ్రా సినిమాలో ఉస్తాద్ అమీర్‌ఖాన్ తో కలిసి పాడాడు. బెంగాలీ సినిమా'' శాప్ మోచన్'' లో కూడా పాడాడు.

== వ్యక్తిగత జీవితం ==
అక్టోబర్ 26, 1955 నాడు డి.వి. పలుస్కర్ ''మెదడు వాపు వ్యాధి'' తో మరణించాడు.

==ఆల్బంలు==
* [http://courses.nus.edu.sg/course/ellpatke/Miscellany/d%20v%20paluskar.htm డి.వి. పలుస్కర్ 78 rpm రికార్డులు].


==బయటి లింకులు==
* [http://dvpaluskar.googlepages.com/ డి.వి. పలుస్కర్ పుట]
* [http://www.chembur.com/anecdotes/dvpaluskar.htm జి.యన్. జోషి ''డౌన్ మెలొడీ లేన్'' ( 1984 ) నుండి].



గురుదత్


'''గురుదత్''' పడుకొనె ( జననం: జూలై 9 , 1925 ) , దక్షిణ భారతదేశంలోని మైసూర్ లో జన్మించిన గొప్ప భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు.

==బాల్యం, జీవిత చరిత్ర==
తండ్రి ప్రధానోపాధ్యాయుడు, తల్లి ''వాసంతి'' ఉపాధ్యాయురాలు; ఆమె బెంగాలీ నవలలను కన్నడంలోకి అనువదిస్తూ ఉండేది. గురుదత్‌కు మంచి బెంగాలీ మాట్లాడడం వచ్చు. ఆయన 1940 లో ముంబాయికి చేరుకొని, బాలివుడ్ లో ప్రవేశించాడు. ఆయన కోల్‌కతాలో కొన్నాళ్ళు విద్యాభ్యాసం చేసి, కొంతకాలం ప్రముఖ నాట్య కళాకారుడు, ఉదయ్‌ శంకర్‌ వద్ద నాట్యాన్ని అభ్యసించాడు. తరువాత ''ప్రభాత్ స్టూడియో''లో ''కొరియోగ్రాఫర్'' గా చేరాడు. ''హమ్ ఏక్ హై'' (1946),''ఆర్ పార్'' (1954) సినిమాలకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఆ తరువాత వచ్చిన ఆయన సినిమాలు:  ''మిస్టర్ అండ్ మిసెస్'' 55, ''ప్యాసా'', ''కాగఝ్ కే ఫూల్''.  కాగఝ్ కే ఫూల్ బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమవడంతో, విరక్తి చెంది, సినిమాలు తీయడం మానివేశాడు.
కథారచయిత, ''అబ్రార్ అల్వి'' ''సాహిబ్ బీబీ ఔర్ గులాం''కు గురుదత్ దర్శకత్వం వహించి, రాష్టపతి రజత పతకాన్ని, ''బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్'' అవార్డ్‌ను గెలుచుకున్నాడు.
1953 లో ప్లేబాక్ సింగర్ ''గీతారాయ్''ను వివాహమాడాడు. కాని వారి దాంపత్యం అంత సజావుగా సాగలేదు. గురుదత్ సినిమా విషయంలో కఠినంగా ఉండేవాడు. అతిగా త్రాగేవాడు. నటి వహీదా రెహ్మాన్ తో గల సంబంధం అతని కాపురంలో చిచ్చును రేపింది. గురుదత్ మరణించినప్పుడు, భార్యతో కాక, ఒంటరిగానే ఉన్నాడు.
అక్టోబర్ 10, 1964]రోజు గురుదత్ తన మంచంలో చనిపోయి కనిపించాడు. మద్యం ఎక్కువైందో లేక నిద్రమాత్రలు అతిగా మింగాడో ఎవరికీ తెలియదు. గురుదత్ అప్పుడు రెండు సినిమాలలో పనిచేస్తున్నాడు; ''లవ్ అండ్ గాడ్'' మరియు ''బహారే ఫిర్ భి ఆయేంగీ''. తరువాత వాటిని సంజీవ్ కుమార్, ధర్మేంద్ర లతో పూర్తి చేయడం జరిగింది.

==నటుడిగా==

* పిక్నిక్ (1964) (అసంపూర్ణం)
* సాంఝ్ ఔర్ సవేరా (1964)
* సుహాగన్ (1964)
* బహూ రానీ(1963)
* భరోసా(1963)
* సౌతేలా భాయ్ (1962)
* చౌధవీఁ కా చాంద్ (1960)
* కాగజ్ కే ఫూల్ (1959)
* 12 ఒ' క్లాక్ (1958)
* ప్యాసా ( 1957)
* మిస్టర్ అండ్ మిసెస్ 55 (1955)
* ఆర్ పార్ (1954)
* సుహాగన్ (1954)
* బాజ్ ( 1953)
* హమ్ ఏక్ హై( 1946)
* లఖారాణి ( 1945)
* చాంద్ (1944)

==దర్శకుడిగా==
* కాగజ్ కే ఫూల్ (1959)
* ప్యాసా]( 1957)
* సైలాబ్ (1956)
* మిస్టర్ అండ్ మిసెస్ 55 (1955)
* ఆర్ పార్ (1954)
* బాజ్ ( 1953)
* జాల్ (1952)
* బాజీ (1951)

==నిర్మాతగా==
* ఆర్ పార్ (1954)
* సి.ఐ.డి. (1956)
* కాగజ్ కే ఫూల్ (1959)
* చౌధవీఁ కా చాంద్ (1960)
* బహారేఁ ఫిర్ భి ఆయేంగీ (1966)
==ఇంకా==
1. [http://en.wikipedia.org/wiki/ నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా పుణె] గురుదత్, భారత ప్రభుత్వ జాతీయ సినిమా భాండాగారము.

==వనరులు==
* 1. [http://www.time.com/time/2005/100movies/the_complete_list.html] పూర్తి సినిమాల జాబితా
* 2. [http://www.dearcinema.com/devanand-interview-1] దేవానంద్‌తో ఇంటర్‌వ్యూ-1
* 3. [http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=3c5f9505-ab14-4a97-afd4-240feb7c723d&&Headline=%27One+should+live+the+moment...look+ahead%27] హిందుస్తాన్ టైమ్స్ వ్యాసం
* 4. http://in.rediff.com/movies/2004/oct/11guru.htm] అక్టోబర్ 10 నాడు ఏమైందో ఎవరికీ తెలియదు.
* 5. [http://in.rediff.com/movies/2004/oct/11guru.htm] [[వహీదా రెహ్మాన్]] తో ఇంటర్‌వ్యూ
==బయటి లింకులు==
* [http://dearcinema.com/devanand-interview-1/] గురుదత్ గురించి దేవానంద్
* [http://sify.com/movies/fullstory.php?id=14716533] గురుదత్‌తో నా పదేళ్ళ అనుభవాలు- అబ్రార్ అల్వి
* [http://www.imdb.com/name/nm0244870/] గురుదత్ ఇంటర్నెట్ డాటా బేస్
* [http://www.rediff.com/entertai/2002/mar/04dinesh.htm] దేవానంద్‌తో ఇంటర్‌వ్యూ-2
* [http://www.bollango.com/cgi-bin/akf_search.tcl?key=song&actor=guru+dutt] గురుదత్‌ సినిమాలలోని  పాటలు

గిలక లేదా హెర్నియా



గజ్జల్లో కాని, ఉదరంలో కాని కండరాలు బలహీనపడినప్పుడు, కడుపు లోని కొవ్వు, ప్రేగులు వాటిగుండా బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు బయటికి కనబడే "ఉబ్బు"ను '''గిలక''' లేదా '''హెర్నియా''' (Hernia) అంటాము.

;హెర్నియా పలు రకాలు :
*1. గజ్జల్లో వచ్చే హెర్నియా (Inguinal Hernia)
*2. తొడ లోపలి భాగంలో వచ్చే హెర్నియా (Femoral Hernia)
*3. ఉదర పైభాగంలో వచ్చే హెర్నియా (Epigastric Hernia, Umbilical Hernia, Para-Umbilical Hernia)
*4. శస్త్రచికిత్స ఐన తరువాత, కొంత కాలానికి, శస్త్రచికిత్సజరిగిన చోట ఏర్పడే హెర్నియా (Postoperative Incisional Hernia)

;వ్యాధి లక్షణాలు:
1. దగ్గినప్పుడు, బరువులను ఎత్తినప్పుడు "ఉబ్బు" కనబడుతుంది. చేతితో ఒత్తితే "ఉబ్బు"తిరిగి లోపలికి వెళ్ళిపోవచ్చు.
2. ఒక్కోసారి కడుపులోని ప్రేగులు అక్కడే చిక్కుకొని, తిరిగి కడుపు లోనికి వెళ్ళకపోవచ్చు. అప్పుడు రోగికి తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు మొదలవవచ్చు. దీనిని Strangulated Hernia అంటారు. ఇది ఎమర్జెన్సీ. త్వరగా ఆపరేషన్ చేయకపోతే రోగికి ప్రాణాపాయం కలగవచ్చు.

;ఎవరికి వస్తుంది ఈ వ్యాధి ?
1. ఎక్కువగా బరువులు ఎత్తేవారిలో-వృత్తి రీత్యా , కూలీలు, హమాలీలు, రైతులు వగైరా.
2. మద్యపానం చేసేవారిలో, కొందరికి కండరాలు పలచబడుతాయి.
3. వృద్ధుల్లో.
4. ఊబకాయం గలవారికి.
5. పుట్టుకతోనే కొందరికి కండరాలు బలహీనంగా ఉండొచ్చు. వారిలో.
6. ఆపరేషన్ చేయించుకొన్న వారిలో, ముఖ్యంగా Cessarian, Tubectomy, Appendicectomy మొదలైనవి.(అంటె ప్రతి ఒక్కరికీ రావాలని ఏమీలేదు.)


;వ్యాధి నిర్ధారణ పరీక్షలు : ఏమీ లేవు. వైద్యుడు కళ్ళతో చూసి, చేతితో పరీక్షించి, రోగ నిర్ధారణ చేస్తాడు.

;ట్రీట్ మెంట్(Treatment) : ఏ మందులూ పని చేయవు. శస్త్రచికిత్స ఒక్కటే మార్గం.
ఇది రెండు రకాలు:
1. బలహీనపడిన కండరాలను తిరిగి గట్టి proline దారంతో కుట్టడం.
2. Proline Mesh (proline దారంతో అల్లబడిన తెర) ను వేసి కుట్టడం.

తీసుకోవలసిన జాగ్రత్తలు: శస్త్రచికిత్స తరువాత మొదటి మూడు నెలల వరకు, బరువులు ఎత్తకూడదు.




ముద్దుకృష్ణ



'''ముద్దుకృష్ణ''' పేరు చెప్పగానే మొదట మనకు స్ఫురించేది ఆయన సమకూర్చిన కవితాసంకలనం, వైతాళికులు. ముద్దుకృష్ణ స్వామినేని ముద్దునరసింహంనాయుడు కి ముని మనుమడు మరియు హేతువాది. అశోకం నాటకం వ్రాశాడు. రావణ వధ తరువాత అగ్ని ప్రవేశం చేయమన్న రాముడికి సీత ఎదురు తిరిగి "నీవు పురుష రూపంలో ఉన్న స్త్రీవి. నన్ను కాపాడుకోలేక పోయావు...."అని నిలదీసినట్లు రాస్తాడు. చిన్నతనంలోనే తెలుగు సాహిత్యంలో ముద్దుకృష్ణకున్న అభిరుచిని పసికట్టిన తండ్రిగారు మనుచరిత్ర, వసుచరిత్ర బోధించాడు. స్కూల్ ఫైనల్ చదివే నాటికి ఆంగ్ల సాహిత్యంలో కూడ ఆసక్తి పెరిగి, "మర్చంట్ ఆఫ్ వెనిస్" నాటకంలో అభినయించే స్థితికి వచ్చాడు. కాలేజి చదువు కాకినాడలో రఘుపతి వెంకటరత్నం నాయుడు వద్ద కొంతకాలం జరిగింది. భావకవితా యుగానికి చెందిన దేవులపల్లి కృష్ణశాస్త్రి, చింతా దీక్షితులు, తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి మొదలగు వారితో సాన్నిహిత్యం;
కళాశాలల్లోని ఇంగ్లీషు నాటక ప్రదర్శనలూ, స్థానిక నాటక సమాజాల తెలుగు నాటక ప్రదర్శనలూ, సుప్రసిద్ధ కవీ, నటుడూ, హరీన్ చటోపాధ్యాయతో కలిసి 1927 ప్రాంతాలలో కళాప్రదర్శనలూ ముద్దుకృష్ణలో నాటక రచనకు ప్రేరేపించాయి. "అశోకం" నాటకం ద్వారా ముద్దుకృష్ణ అపూర్వసంచలనం కలిగించాడు. ముద్దుకృష్ణ బ్రహ్మచారి; ఈ బ్రహ్మచారి వ్రాసిన "దాంపత్య దీపిక" ఎందరి ప్రశంసనలనో పొందింది. 1934 లో ప్రారంభించిన "జ్వాల" పత్రిక యువకులలో కొత్త ఆలోచనలను రేపింది.

ఈయన ప్రచురించిన "వైతాళికులు"లో చోటు చేసుకొన్న కవులు :అబ్బూరి రామకృష్ణారావు, కవికొండల వెంకటరావు, దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి', కొడాలి ఆంజనేయులు, గురజాడ అప్పారావు, చింతా దీక్షితులు, నండూరి సుబ్బారావు, నాయని  సుబ్బారావు, నోరి నరసింహశాస్త్రి, పింగళి-కాటూరి, పెనుమర్తి వెంకటరత్నం, చావల బంగారమ్మ, బసవరాజు అప్పారావు, అడవి బాపిరాజు, రామచంద్ర అప్పారావు, దువ్వూరి రామిరెడ్డి, రాయప్రోలు సుబ్బారావు, కొడవగంటి వెంకటసుబ్బయ్య, వేంకట పార్వతీశ్వరులు, విశ్వనాథ సత్యనారాయణ, తల్లాప్రగడవిశ్వసుందరమ్మ, మల్లవరపు విశ్వేశ్వరరావు, వేదుల సత్యనారాయణ శాస్త్రి, తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి, శ్రీరంగం శ్రీనివాసరావు, సౌదామిని - బసవరాజు రాజ్యలక్ష్మమ్మ.



అబ్బూరి రామకృష్ణారావు'

'''అబ్బూరి రామకృష్ణారావు''' (1896-1979) ప్రముఖ తెలుగు భావకవి, పండితుడు. రామకృష్ణారావు గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని అనంతవరం గ్రామంలో లక్ష్మీనరసింహశాస్త్రి, బాపమ్మ దంపతులకు 1896, మే 20 న జన్మించాడు.  ఆయన చిన్నతనంలో తిరుపతి వెంకట కవులలో ఒకడైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తరచుగా అబ్బూరి తండ్రి గారి ఇంటికి వస్తుండేవాడు. బలిజేపల్లి లక్ష్మీకాంతం, గోవిందరాజులు సుబ్బారావులు అబ్బూరికి మిత్రులు.

అబ్బూరి మైసూరులోని సంస్కృత కళాశాలలో చేరినప్పుడు, అప్పటి విద్యాధికారి కట్టమంచి రామలింగారెడ్డి, 1915 లో అచ్చైన అబ్బూరి యొక్క మల్లికాంబను చదివి మెచ్చుకొన్నాడు. అదృష్టం కొద్దీ, అబ్బూరికి అక్కడే ఉన్న రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మతో స్నేహం కుదిరింది. అబ్బూరి 1916లో వీణా శేషన్న వద్ద కొంతకాలం పాటు వీణను కూడ నేర్చుకొన్నాడు. 1918లో అబ్బూరి, రవీంద్రనాథ్ టాగోర్ ను కలుసుకొని బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలను వినడం జరిగింది. కోడి రామమూర్తిని ప్రశంసిస్తూ, "ఆంధ్రవీర కంఠీరవ" అనే పద్యాన్ని వ్రాయడం జరిగింది.

పదగుంఫన అబ్బూరి ప్రత్యేక ప్రతిభ. గీతాలలో గొప్ప హుందా గోచరిస్తుంది. ఉత్తమ సంస్కృత కావ్యాలలోని పూర్ణతా, గౌరవమూ, గాంభీర్యమూ ఈయన పద్యాలలో ప్రతిబింబిస్తవి. నన్నయ నాటి అక్కరలకు మార్పులు తెచ్చి, కొత్త నడకలు నడిపించడమే కాకుండా, స్వకపోలకల్పితాలైన నూతన ఛందస్సులు కూడా కల్పించాడు. ఈయన పద్యాలలో ఒక్క పలుకు పట్టి చూచినా ఉత్తమ సంస్కారి అని తెలుస్తుంది.
;కృతులు
#ఊహాగానము-పూర్వప్రేమ 
#మల్లికాంబ 
#నదీసుందరి.

అబ్బూరి 30 ఏప్రిల్ 1979 రోజు మరణించాడు. చనిపోవడానికి నాలుగు రోజుల ముందు ఆయన ఇలా వ్రాసుకొన్నాడు. "చచ్చిపోయి జీవి ఎచ్చట కేగునో ఏమి యగునో ఎవరికెరుగరాదు, ఎరుకలేని వారలేమేమో చెప్పగా విని తపించువారు వేనవేలు."


ముసలమ్మ మరణం


తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించిన కావ్యం, డా.కట్టమంచి రామలింగారెడ్డి రచించిన "ముసలమ్మ మరణం". కందుకూరి వీరేశలింగం పంతులు లాగానే, కట్టమంచి రామలింగారెడ్డి ఆంగ్ల సాహిత్యం వలన ప్రభావితుడైనాడు. చార్లెస్ పి. బ్రౌన్ రచించిన The History of Anantapuram (అనంతపుర చరితం) నుండి కథాంశాన్ని తీసుకొని, ఈ కావ్యాన్ని వ్రాశాడు.
ఇది "ముసలమ్మ" అనబడే ఒక గ్రామవనిత యొక్క త్యాగమయ, దయనీయ గాథ. ఆమె తమ ఊరి చెరువు కట్ట చిన్నగా తెగిపోతూ ఉండడం చూసి, తనకు తానే అడ్డుపడి, తన ప్రాణాలను అర్పించి, ఊరి ప్రజలను కాపాడుతుంది. 

*1899లో ఆంధ్ర భాషాభిరంజిని వారి పోటీలో బహుమతి గెల్చుకొంది. 1900లో అచ్చయ్యింది.




ఠుమ్రీ


'''ఠుమ్రీ''' భారతీయ శాస్త్రీయ సంగీతానికి చెందిన ఒక శాస్త్రీయ శైలి.

ఠుమ్రీలు ముఖ్యంగా రాధాకృష్ణుల ప్రణయ సంబంధమైన ప్రేమగీతాలు. ఠుమ్రీ మొదట పుట్టింది లక్నోమరియు వారణాసిలో, 18 వ శతాబ్దంలో. మొట్టమొదట దీనికి ప్రాచుర్యం కలుగజేసినవాడు లక్నోనవాబు  వాజిద్ అలీషా. ముఖ్యంగా మూడు  ఠుమ్రీ ఘరానాలు ఉన్నాయి. అవి, బెనారస్, లక్నో మరియు పటియాలా  ఘరానాలు.

==పసిద్ధ ఠుమ్రీ  గాయకులు==
రసూలన్ బాయి, సిద్దేశ్వరీ దేవి, గిరిజా దేవి, గోహర్ జాన్, బేగం అక్తర్, శోభా గుర్టూ, మరియు బడే గులాం అలీ ఖాన్.


==మూలాలు==
{{Reflist}}

==బయటి లింకులు==
*[http://www.indoclassical.com/ IndoClassical.com - భారతీయ శాస్త్రీయ సంగీతము]
*[http://www.chandrakantha.com/articles/indian_music/ఠుమ్రీ.html]

==గ్రంధాలు==
*''Thumri in Historical and Stylistic Perspectives'' by ''పీటర్ మానుయెల్''



నాయకపోడులు


'''నాయకపోడులు''' : కొలాములు నివసించే ఆదిలాబాద్ జిల్లాలోని కొండలోయలు, అటవీ ప్రాంతంలోనే మరొక తెగ నివాసముంటోంది. వీరే నాయకపోడ్లు.
అయితే కొలాములు నివసించే ప్రాంతంలోనే అక్కడక్కడా చిన్న సమూహాలుగా నాయకపోడ్లు నివసిస్తున్నప్పటికీ శరణార్థుల్లాగే బతుకుతుంటారు వాళ్ళు. 1940 వరకూ కూడా పోడు వ్యవసాయ పద్ధతిలో పంటసాగు చేసుకునే  నాయకపోడ్లు గుంతలు తవ్వే కర్ర, పారలనే సాగుకు వినియోగిస్తారు.కొలాముల మాదిరిగానే ప్రభుత్వ ఫారెస్ట్ విధానానికి నాయకపోడ్లు బలి అయ్యారు. ఈ రోజు కొండ ప్రాంతాల్లోకొద్దిమంది మాత్రమే నాయకపోడ్లు నివసిస్తున్నారు. తక్కిన వారంతా సమీప మైదాన ప్రాంతాలలోని గ్రామాల్లో బతుకుతున్నారు.
అక్కడ వాళ్ళంతా రోజువారీ రైతు కూలీలుగానో లేదా కౌలు(గుత్త) రైతులుగానో బతుకు లీడుస్తున్నారు. చాలా తక్కువ మందికి మాత్రమే చిన్నపాటి స్వంత భూములున్నాయి. చెట్టుకొకరు పుట్టకొకరుగా విసిరి వేయబడ్డ నాయకపోడ్లు కరీంనగర్ , వరంగ్‌ల్ జిల్లాలలో కూడా చెదురుమదురుగా కనిపిస్తారు. నాయకపోడ్లకు కూడా తమదైన ప్రత్యేక భాష ఉండేది. దానికీ కొలామీ భాషకూ కొంత సారూప్యత కూడా ఉండేది.

అయితే ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలోని పశ్చిమభాగంలో ఉండే కొంతమంది నాయకపోడ్లకు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని సరిహద్దు తాలూకాలలో నివసిస్తున్న మరికొంత మంది నాయకపోడ్లకూ తమ పూర్వభాష రావొచ్చు.దాదాపు నాయకపోడ్లందరూ తెలుగులోనే మాట్లాడుతున్నారిప్పుడు. ఆ విధంగా సమీప హిందూసమాజంలో నాయకపోడ్లు కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళంతా కింది కులంగానే(lower caste) పరిగణింపబడుతున్నప్పటికీ, నాయకపోడ్లు కొన్ని సంకరకులాల కన్నాఎక్కువ అన్న గుర్తింపు కూడా ఉంది.

నాయకపోడ్లకు గోండులతో ఎలాంటి వ్యవస్థాగత సంబంధమూ లేదు.( అదే కొలాముల కయితే వుంది.)

==మూలాలు==
* ఆంగ్ల మూలం  : Tribes of India : The Struggle for Survival, Cristoph Von Furer-Haimendorf, అనువాదం : అనంత్.
* మనుగడ కోసం పోరాటం ,
* ఆంధ్రప్రదేశ్ ఆదివాసులు





కొలాములు

'''కొలాము'''లను వాళ్ళ భాషలో "కొలావర్లు"(kolavars) అని వ్యవహరిస్తారు. కొలాములు గోండి  భాషకు దగ్గరగా ఉండే ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన భాషను మాట్లాడతారు. గోండులతో, పరధానులతో మాట్లాడేటప్పుడు కొలాములు గోండీలో మాట్లాడతారు. కొలాములలో చాలా మందికి గోండీ భాషపైన మంచి పట్టు వుంటుంది. ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతపు కొలాములు ఇప్పుడు వాళ్ళ భాషను పూర్తిగా వదిలేసి తెలుగులోనే మాట్లాడుతుంటారు. అలాగే మహారాష్ట్రలోని కిన్వట్ తాలూకాలో మరాఠీ మాట్లాడతారు.


==సామాజిక జీవనం==
కొలాములు ప్రధానంగా ఆ సమూహంలో ఉన్న వాళ్ళను కాకుండా, బయటి సమూహాలకు చెందిన కొలాములనే పెళ్ళి చేసుకుంటారు(Exogamy). కొలాముల గణదేవత "ఆయక" (Ayak), గోండీలో "భీమల్" అని వ్యవహరిస్తారు. రిజర్వ్డ్ ఫారెస్ట్ ల పేరుతో బలవంతంగా గెంటేసిన ఆదివాసుల్లో కొలాములు కూడా వున్నారు. అలా చెల్లాచెదరైన కొలాములు ఏ పండుగకో, పబ్బానికో రిజర్వ్డ్ ప్రాంతంలోని వీరి గత జీవితానికి అవశేషాలుగా మిగిలిపోయిన ఆయక గణదేవత ఆలయంలో కలుసుకుంటారు. ప్రార్థనలు మన్నించి, ఆపదలలో ఆదుకొనే దేవతగా కొలాములు ఆయక గణదేవతను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ దేవాలయాల సంరక్షణ ఆ సమూహంలోని ''పూజారి'' (Priest) బాధ్యత. దేవతల కోపాలు చల్లార్చడంలో, జరగబోయేది ముందుగా చెప్పడంలో కొలాములు ఆరితేరిన వారని గోండ్లు నమ్ముతారు. అందుకే తమ పండుగలు, క్రతువులు, కొండదేవత, అడవిదేవత పూజలు జరిపించే బాధ్యతను కొలాములకే అప్పజెప్పుతారు. ఈ కారణంగానే కొలాము తెగను గోండులు "పూజారి" అని వ్యవహరిస్తారు.

==మూలాలు==
*ఆంగ్ల మూలం  :  Tribes of India : The Struggle for Survival, Cristoph Von Furer-Haimendorf, అనువాదం : అనంత్.
*మనుగడ కోసం పోరాటం ,
*ఆంధ్రప్రదేశ్ ఆదివాసులు




పండిట్ అజయ్ చక్రవర్తి

'''పండిట్ అజయ్ చక్రవర్తి''' ( జననం : 1953 ) పటియాలా ఘరానా కు చెందిన ప్రముఖ హిందుస్తానీ సంగీత గాయకుడు.

==బాల్యం,కుటుంబం==
పండిట్ అజయ్ చక్రవర్తి తండ్రి , అజిత్ చక్రవర్తి భారత స్వాతంత్ర్యానంతరం, బంగ్లాదేశ్ నుండి భారత దేశంలోని శ్యాంనగర్ కు తన ఇద్దరు కుమారులతో వలస వచ్చాడు. అజయ్ చక్రవర్తి సోదరుడు సంజయ్ చక్రవర్తి ప్రముఖ సంగీతకారుడు. కూతురు కౌశికి చక్రవర్తి కూడా వర్ధమాన సంగీత కళాకారిణి. అజయ్ చక్రవర్తి కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు.

==సంగీత ప్రస్థానం==
అజయ్ చక్రవర్తి తన మూడేళ్ళ వయస్సులోనే తండ్రి వద్ద సంగీత పాఠాలు నేర్వడం ప్రారంభించాడు. తరువాత పన్నాలాల్ సామంత మరియు శ్రీ కనైదాస్ బైరాగి వద్ద కొంతకాలం నేర్చి, పద్మభూషణ్  పండిట్ జ్ఞానప్రకాశ్ ఘోష్ కు శిష్యుడైనాడు. 1969 లో, ప్రముఖ పటియాలా ఘరానా సంగీత విద్వాంసుడు , ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్]కుమారుడు మునవర్ అలీఖాన్ కు శిష్యరికం చేసాడు. పండిట్ అజయ్ చక్రవర్తి ఇప్పుడున్న పటియాలా ఘరానాకు చెందిన వారిలో మేటి హిందుస్తానీ సంగీత కళాకారుడు.

==అవార్డులు, పురస్కారాలు==

* [http://en.wikipedia.org/wiki/Sangeet_Natak_Akademi_award] సంగీత నాటక అకాడమీ అవార్డు - 2000

==వనరులు==
 1. [http://www.hinduonnet.com/thehindu/mp/2005/03/19/stories/2005031901280300.htm]
 2. [http://www.hindu.com/thehindu/fr/2005/08/05/stories/2005080501690200.htm]
 3. [http://www.hindu.com/fr/2006/04/28/stories/2006042801520300.htm]

==బయటి లింకులు==

* [http://www.sonymusic.co.in/artist/artist.asp?artistid=521] జీవిత చరిత్ర
* [http://www.asianclassicalmp3.org/ajoy.htm] అజయ్ చక్రవర్తి ; బి.బి.సి. లో
* [http://www.shatatantri.com/artists/Ajoy_Chakrabarty] అజయ్ చక్రవర్తి జీవిత చరిత్ర - సమీక్షా ఫోరం


పుష్ప మంజరి


నీరదమునై
నింగిలో ఒంటినై
సాగేను నేను శిఖరాలపై

చెరువు పక్కన
చెట్టు నీడన
గాలికి నర్తించు
హేమ కుసుమాల రాశిని చూశాను నేను ఆపై
పాలపుంతల మెరయు
తారామణిహారముల వోలె
కడలి అంచున
కనుచూపు మేర
కలిసి సాగినవి పూలు
కనుపించె చూపులో
తలలూపుతూ పదివేలు

ఆనందముతో
ఉద్గమించెను అలలు
కెరటాల తళుకుల
అధిగమించెను విరులు
వికసించె పుష్పమై
ఓ కవి స్వాంతము
వివరించలేను నాకు కలిగిన
యీ సుందర దృశ్య భాగ్యము

చింతాక్రాంతమున
పవ్వళించిన వేళ
ఏకాంత మదిలోన
ఉల్లాసమును రేప
నాదు డెందము ముదముతో నిండగా
అంతరంగమున మెరయు అవే కుసుమాలు.

(Wordsworth వ్రాసిన The 'Daffodils' కు అనువాదం )

లాఫింగ్ గ్యాస్ పద్యాలు



వాతావరణము పొగలతొ
మోతాదును మించ ; కారుమోమున పతి సా
యంతరమున యింటి కరిగె;
అంత తలుపు దీసెవరని యడిగె సతి పతిన్

గున్న యేన్‌గు వంటి చిన్నది గజలక్ష్మి
బక్కపీచు వాడు అక్క మొగుడు
కాకి కంటె నలుపు కామాక్షి పెనిమిటి
దబ్బపండు చాయ సుబ్బి మగడు.

చెవికి పోగు యొకటి చేతికి కడియము
జుట్టు వెనుక దువ్వి కట్టు కట్టి
ఆడదాని వోలె నటునిటు దిరుగు కు
మారుని గని తండ్రి మండి పడెను.

ఉన్నదంత యూడ్చి కన్నకొడుకు కిస్తె
గంగ పాలు జేసె నంగనాచి
పెందరాలె లేచి పేకాట రేసులు
ఆడుచుండు వాడు పాడుగాను

చిల్లిగవ్వ గడన చేయని భర్తను
తరిమికొట్టు భార్య దరికి రాదు
కొత్తచీరను కొని కొనిపోగ మగడిని
ముద్దుజేసి ఆమె మురిసిపోవు

నెత్తినొప్పి కొరకు ఉత్తుత్తి స్కానింగ్సు
ఎముకనొప్పి పెడితె ఎక్సురేలు
దగ్గురొంప పడితె దవఖాన కెళ్ళేవు!
కొంపగోడు లన్ని గుల్ల లగును

ఒకడి నెత్తి మీద నొకడు మసలుచు నుండు
గంప కింద కోళ్ళ గుంపు పగిది
అద్దె ధరలు జూడ నాకాశము నంటు
పట్టణములలోని బ్రతుకు వెరపు

బడిలో సీటుకని మిగుల
పడిగాపులు కాసికాసి ; పదివే ల్చందా
గడితిన్ మా చంటి కొరకు
కడు యిడుము ల్దాపురించె కలికాలమునన్


చెప్రాసిగ పని జేయుచు
సంప్రీతిగ సంతు నెంతొ సాకితివి గదా !
ఏప్రిలు లోనైనా యిక
ఆప్రీషన్ జేసుకొనవె యాదమ్మత్తా!

బాట్నీ క్లాసాబ్సెంటయి
చట్నీ సాంబారు ఇడ్లి జర్దా కిళ్ళీ
పాట్నీ సెంటరులో తిని
మాట్నీ షో కెళ్ళినాము మాష్టరు గారూ!

(నిన్న మీరు క్లాసుకు రాలేదేంటర్రా! అని మాష్టారు స్టూడెంట్సును అడిగినప్పుడు)


జాషువా


చక్కని జిగిబిగి చిక్కని మాటలు
అల్లిన పద్యాల అల్లసాని
కవితా శిశువునకు కడునేర్పుతో ప్రథ
మ పురుడు బోసిన మంత్రసాని
గండపెండేరము దొడిగించుకొన్నటి
వాగ్దండి ; సాలీడు వంటి కవిత
లల్లిన మేటి నేత ; గిజిగాడు నెమలి
నెలత భరతమాత తెలుగు తల్లి

గబ్బిలము ఫిరదౌసను కబ్బములను
వ్రాసి వన్నెకెక్కిన తెల్గువాడు ; తెలుగు
భాష నుడికార సొంపును పండి యిం'చ
ఖండ' కావ్యములను పంచిన కవిరేడు.


మూసీ (డిశంబర్ 2008) మాసపత్రికలో ప్రచురితం

సవాయి గంధర్వ


'''సవాయి గంధర్వ''' : రాంభావు కుందగోల్కర్ అతని అసలు పేరు; (సెప్టెంబరు 12 , 1886 - 1952) ; ప్రఖ్యాత హిందుస్తానీ గాయకుడు,అబ్దుల్ కరీంఖాన్ శిష్యుడు; కిరాణా ఘరానాకు ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చినవాడు.

==జీవితం==
సవాయి గంధర్వ కర్ణాటక రాష్ట్రంలోని, ధార్వాడ్ వద్ద కుందగోల్ లో జన్మించాడు. అబ్దుల్ కరీంఖాన్ వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకొన్నాడు.

==సంగీత ప్రస్థానం==
శిక్షణ తర్వాత సవాయి గంధర్వ, మరాఠీ డ్రామా కంపనీలో చేరి, గొప్ప గాయకుడుగా పేరు తెచ్చుకొన్నాడు. శివరాజ్ నాటక మండలిలో గోవిందరావు టెంబె తో కలిసి కొంతకాలం పనిచేసాడు. స్వతహా గొప్ప గాయకుడే కాక, కిరాణా ఘరానా సాంప్రదాయాల్నిముందుకు నడిపించిన గంగూబాయి హంగల్, భీమ్ సేన్ జోషి, ఫిరోజ్ దస్తూర్ వంటి వారలకు శిక్షణ నిచ్చాడు. భీంసేన్ జోషి, ప్రతి యేటా తన గురువు జ్ఞాపకార్థం, పుణె లో సవాయి గంధర్వ సంగీత మహోత్సవం జరిపిస్తాడు. ఈ సంగీత మహోత్సవాల్లో పాల్గొనడం అంటే, చాలా "గొప్ప" గా భావిస్తారు, అటు సంగీత కళాకారులు, ఇటు శ్రోతలు.

==వనరులు==
* [http://music.indobase.com/classical-singers/pandit-bhimsen-joshi.html]భీమ్‌సేన్ జోషి ,సవాయి గంధర్వల గురించి
* [http://www.indianetzone.com/6/pandit_bhimsen_joshi.htm]భీమ్‌సేన్ జోషి ,సవాయి గంధర్వల గురించి
* [http://www.musicplusvideo.com/hindclasvcd1.html] సవాయి గంధర్వ సంగీత మహోత్సవం-వీడియో సీడీలు

==బయటి లింకులు==
1. [http://www.hinduonnet.com/folio/fo9811/98110160.htm] సవాయి గంధర్వ గురించి

జయదేవుడు


'''జయదేవుడు''' సంస్కృత కవి, పండితుడు. అతడు వ్రాసిన రాధాకృష్ణుల ప్రణయకావ్యం, గీత గోవిందం హిందూమత భక్తి ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది.


==జీవితం==
జయదేవుడు ఒరిస్సా రాష్ట్రం, ఖుర్దా జిల్లాలోని ''ప్రాచి లోయ''లో ఉన్న కెందుళి లో ఒక ఉత్కళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.
''కెందుళి సాసన్'' ( ఇప్పుడిలా పిలువబడుతోది ) గ్రామం, పూరి కి సమీపంలో ఉంటుంది.
జయదేవుడి తలిదండ్రులు, ''భోజదేవ'' మరియు ''వామదేవీ'' లు. జయదేవుడు జన్మించినప్పుడు ఒరిస్సా ''చోడగంగ దేవ'' ఏలుబడిలో ఉండేది. జయదేవుడు ''కుర్మపాటక'' లో తన సంస్కృత విద్యాభ్యాసం గావించాడు. తరువాత దేవదాసీ అయిన ''పద్మావతి''ని వివాహమాడాడు. ఆ కాలంలో ఆ ప్రాంతమంతా ''వైష్ణవ బ్రాహ్మణుల'' ప్రాబల్యంలో ఉండేది.

==సాహిత్యం==
జయదేవుడు దశావతారాల గురించి వ్రాసిన కావ్యం, ''దశకృతికృతే''. కృష్ణుడు మూడు ముఖాలతో వేణువు వాయిస్తున్నట్టు వర్ణించే కావ్యం, ''త్రిభంగి'' అతని వల్లే ప్రాశస్త్యము నొందింది.
జయదేవుని రెండు ''అష్టపదులు'' సిక్కుల మతగ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్ లో కనబడతాయి. దీనిని బట్టి, జయదేవుని రచనలు గురునానక్ మీద, అతడు పూరిని సందర్శించినప్పుడు, ఎంత ప్రభావం చూపాయో అర్థమౌతుంది.

==గీత గోవిందం==

గీత గోవిందం జయదేవుని గొప్ప కావ్యం. అది 12 అధ్యాయాలు,ఒక్కొక్క అధ్యాయం 24 ప్రబంధాలుగా విభజింపబడింది. ఒక్కొక్క ప్రబంధంలో ఎనిమిది ''ద్విపద'' లుంటాయి. వీటినే ''అష్టపదులు'' అంటారు. ఇది రాధాకృష్ణుల ప్రణయతత్వమే పరమార్థంగా భావించే, నింబార్కుడి వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి యున్నకావ్యం.
''సర్ విలియమ్ జోన్స్'' 1792 లో, తొలిసారిగా గీత గోవిందాన్నీఆంగ్లంలోకి అనువదించాడు. తరువాత ఇది ఎన్నో ప్రపంచ భాషలలోకి తర్జుమా చేయబడింది. గీత గోవిందం సంస్కృత కావ్యాలలోకెల్లా ఉత్కృష్టమైన కావ్యంగా పరిగణింపబడుతోంది.

==ఇవి కూడా==
* [http://en.wikipedia.org/wiki/Gita_Govinda] గీత గోవిందం
* [http://en.wikipedia.org/wiki/Sanskrit_literature]సంస్కృత సాహిత్యం

==వనరులు==
1. [http://www.britannica.com/eb/article-9043454/Jayadeva]బ్రిటానికా ఎన్‌సైక్లోపీడియాలో జయదేవుడు
2. [http://orissagov.nic.in/e-magazine/Orissareview/july2003/englishchpter/Visit%20of%20Guru%20Nanak%20to%20Puri.PDF]గురునానక్ పూరి సందర్శన

==బయటి లింకులు==
[http://orissagov.nic.in/e-magazine/Orissareview/April2006/engpdf/sanskrit_scholars_of_orissa.pdf]ఒరిస్సా సంస్కృత పండితులు
Powered By Blogger

నెలవారీ పోస్టులు

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    10 years ago