నా గురించి

Showing posts with label అనువాద కవితలు. Show all posts
Showing posts with label అనువాద కవితలు. Show all posts

Wednesday, October 21, 2009

మార్చిలో వ్రాసిన కవిత

కోడి కూస్తోంది
సెలయేరు ప్రవహిస్తోంది
చిన్ని పక్షులు కిచకిచ మంటున్నాయి
సరస్సు తళతళా మెరుస్తోంది
పచ్చని మైదానం ఎండలో పడుకొని ఉంది.

చిన్నా పెద్దా అందరూ కలిసి
పొలంలో పనిచేస్తున్నారు
పశువులు పచ్చిక మేస్తున్నాయి
వంచిన వాటి తలలు పైకి లేవడం లేదు

ఓడిపోయిన సైన్యం లా
మంచు వెనక్కి పారిపోయింది
అది ఇప్పుడు కొండచరియపై
దాక్కొని ఉంది.

నాగలి పట్టిన రైతు
కూనిరాగాలు తీస్తున్నాడు                                                 
పర్వతాల్లో హర్షం వెల్లివిరిసింది.                                                             
నీటిబుగ్గల్లో జీవం తొణికిసలాడింది
చిన్నిమబ్బులు  తేలిపోతున్నాయి
నీలాకాశం విస్తరించింది
వాన వచ్చి వెలిసింది.



( William Wordsworth   ఆంగ్ల పద్యం   Lines written in March  కు  స్వేచ్చానువాదం.   )




Saturday, October 17, 2009

పుష్ప మంజరి


నీరదమునై
నింగిలో ఒంటినై
సాగేను నేను శిఖరాలపై

చెరువు పక్కన
చెట్టు నీడన
గాలికి నర్తించు
హేమ కుసుమాల రాశిని చూశాను నేను ఆపై
పాలపుంతల మెరయు
తారామణిహారముల వోలె
కడలి అంచున
కనుచూపు మేర
కలిసి సాగినవి పూలు
కనుపించె చూపులో
తలలూపుతూ పదివేలు

ఆనందముతో
ఉద్గమించెను అలలు
కెరటాల తళుకుల
అధిగమించెను విరులు
వికసించె పుష్పమై
ఓ కవి స్వాంతము
వివరించలేను నాకు కలిగిన
యీ సుందర దృశ్య భాగ్యము

చింతాక్రాంతమున
పవ్వళించిన వేళ
ఏకాంత మదిలోన
ఉల్లాసమును రేప
నాదు డెందము ముదముతో నిండగా
అంతరంగమున మెరయు అవే కుసుమాలు.

(Wordsworth వ్రాసిన The 'Daffodils' కు అనువాదం )

Wednesday, October 14, 2009

వేకువ గీతి


ఇది వసంత కాలం
ఇది శుభోదయం
ఇది ఉషోదయం
ఏడు గంటల సమయం-
ఆకాశంలో భరద్వాజ పక్షి
సముద్రంలో నత్తగుల్ల
మంచు ముత్యాలతో కప్పబడి
కొండశిఖరం.
దేవుడు తన స్వర్గంలో -
ప్రపంచం పదిలంగా వుంది.

( Robert Brown వ్రాసిన The Pippa's song అనే చిన్న కవితకు తెలుగు అనువాదం.)
Powered By Blogger

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    12 years ago