నా గురించి

Thursday, October 15, 2009

మల్లికార్జున్ మన్సూర్


'''మల్లికార్జున్ భీమరాయప్ప మన్సూర్''' ( 1910 - 1992 ) ,[జయ్‌పూర్ - అత్రౌలి ఘరానా కు చెందిన ఖయాల్ గాయనంలో ప్రసిద్ధుడైన భారతీయ హిందుస్తానీ సంగీత గాయకుడు.

== బాల్యం, జీవితం, సంగీత ప్రస్థానం ==
మన్సూర్ తొలి సంగీత పాఠాలు మీరజ్ కు చెందిన ''నీలకంఠ బువా'' వద్ద నేర్చుకున్నాడు. తరువాత అతని సంగీతాన్ని ఎక్కువగా ప్రభావితం చేసినవారు అతని గురువులు - అల్లాదియాఖాన్ కుమారులైన మంజీఖాన్ మరియు బుర్జీఖాన్ లు. మన్సూర్ అరుదైన ( అప్రచలిత ) రాగాలను ఆలపించడంలో సిద్ధహస్తుడు. అవి శుద్ధనట్, అసజోగియా, హేమ్‌నట్, లక్ఛాసఖ్, ఖట్, బహదూరి తోడి లు.
మన్సూర్ ఆత్మకథ ''నన్న రసయాత్రే'', కన్నడంలో వ్రాసినదానికి అతని కుమారుడు ''రాజశేఖర్ మన్సూర్'' My Journey in Music గా ఆంగ్లంలోకి అనువదించాడు. మన్సూర్ జన్మస్థలం ఉత్తర కర్ణాటకలోని ధార్వాడ్. ఉత్తర కర్ణాటక ఇతర సంగీత కళాకారులకు కూడా నిలయంగా ఉంది. గదగ్ నుండి భీమ్‌సేన్ జోషి , హుబ్లి నుండి గంగూబాయ్ హంగల్ మరియు బసవరాజ్ రాజ్‌గురు లు ఉన్నారు.
రాజశేఖర్ మన్సూర్ ఇప్పుడు జయపూర్-అత్రౌలి ఘరానా సాంప్రదాయాన్ని ముందుకు నడిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. బెంగుళూరు లోని ''కర్ణాటక సంగీత నృత్య అకాడమీ'' చైర్‌మన్ మరియు విశ్రాంత ఆంగ్ల ప్రొఫెసర్ అయిన రాజశేఖర్ మన్సూర్ ''అప్రచలిత'' రాగాలను కాపాడుకుంటూ వస్తున్నాడు.

== వనరులు ==
1. [http://india.gov.in/myindia/advsearch_awards.php?start=10&award_year=&state=KA&field=3&p_name=&award=All]పద్మ అవార్డులు.

== బయటి లింకులు ==
* [http://allmusic.com/cg/amg.dll?p=amg&sql=11:39fqxqwhldae]మల్లికార్జున్ మన్సూర్
* [http://www.omenad.net/articles/mansur_view.htm]అప్రచలిత రాగాల సంరక్షణ - రాజశేఖర్ మన్సూర్

0 వ్యాఖ్యలు:

Post a Comment

Powered By Blogger

నెలవారీ పోస్టులు

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    10 years ago