శిశిర మరుదెంచె
చలిపులి విజృంభించె
వడవడ వణికించె శీతల పవనమ్ములు ;
ఎండుటాకులు రాలె ముంగిట
కురిసె హిమసమూహములు వేకువ తోడ
మంచు తెరలను చీల్చుచు
వచ్చె మయూఖ రేఖలు
ఘనీభవించె ఝరులు
హిమాన్వితమయ్యె గిరులు
తరు శాఖాగ్రమున విరిసె
నీహారమాలికల్
నిశలు హిమాంశు చంద్రికల తోరణమయ్యె
నవ వసంత వేడుకలకు
నాంది పలికెడిదే శైశిరమ్ము
4 వ్యాఖ్యలు:
నవ వసంత వేడుకలకు
నాంది పలికెడిదే శైశిరమ్ము
ఆశావహ దృక్పధాన్ని పెంపొందించేదిగా వుంది. ఎంతైనా డాక్టరు కదా..
http://www.sahavaasi-v.blogspot.com/
ఆ రెండు చివరి వాక్యాలను మీరు సరిగ్గా అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది.
bagundi :)
thanks.
Post a Comment