'''అబ్దుల్ కరీంఖాన్''' లేదా '''ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్''' (నవంబరు 11, (1872 - 1937) , 20 వ శతాబ్దపు హిందుస్తానీ సంగీతంలోని కిరాణా ఘరానాకు చెందిన వారిలో ప్రముఖుడు.
==జీవితం==
అబ్దుల్ కరీంఖాన్ ఉత్తరభారతంలోని కిరాణా అనే ప్రాంతంలో జన్మించాడు. కిరాణా ఘరానాకు మూలపురుషులు, గులాం అలీ మరియు
గులాం మౌలా లు. కరీంఖాన్ తండ్రి, కాలే ఖాన్ గులాం అలీ మనవడు. కరీంఖాన్ తండ్రి వద్ద మరియు మామ అబ్దుల్లా ఖాన్ వద్ద
శిక్షణను పొందాడు. గాత్రం, సారంగి, వీణ, సితార్, తబలా - వీటన్నిటినీ నేర్చుకున్నాడు కరీంఖాన్.
==సంగీత ప్రస్థానం==
మొదట్లో సారంగి వాయించినా, క్రమంగా గాత్రానికి మళ్ళాడు ; సోదరుడు అబ్దుల్ హక్ తో కలిసి పాడేవాడు. బరోడా రాజు వారి గాత్ర సంగీతానికి ముగ్ధుడై, వారిని తన ఆస్థాన సంగీత విద్వాంసులుగా నియమించాడు. ఇక్కడే కరీంఖాన్ రాజవంశానికి చెందిన తారాబాయ్ మానెను పెళ్ళాడాలనుకున్నాడు. కాని బరోడా నుండి బహిష్కృతులై , ఆ దంపతులు ముంబై చేరుకున్నారు. 1922లో తారాబాయ్ మానె అబ్దుల్ కరీంఖాన్‌ను వదలి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన జీవితంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మైసూరు దర్బారులో, గొప్ప కర్ణాటక సంగీత గాయకులను కలుసుకోవడం మూలాన, ఆ ప్రభావం ఆయన పాటల్లో కనిపించేది. 1900 లో ఆయన ప్రఖ్యాత గాయకుడు, సవాయి గంధర్వకు ఎనిమిది నెలలు సంగీతాన్ని నేర్పాడు. అక్కడే మరో ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసురాలు, కేసర్‌బాయ్ కేర్కర్ కు శిక్షణ నిచ్చాడు. 1913లో పుణె లో అబ్దుల్ కరీంఖాన్ ఆర్య సంగీత విద్యాలయాన్ని స్థాపించాడు. తరువాత మీరజ్ లో స్థిరపడి, మరణించేంత వరకూ (1937) అక్కడే ఉన్నాడు.
కిరాణా ఘరానా శైలి రాగం, మంద్రస్థాయిలో మొదలయ్యి, విలంబిత్ లయలో మృదుమధురంగా సాగుతుంది. అబ్దుల్ కరీంఖాన్ ఠుమ్రీలు కూడా ప్రత్యేక శైలిని కలిగి వుంటాయి. ఆయన ఒక త్యాగరాజ కృతిని కూడా ఆలపించాడు.
==అబ్దుల్ కరీంఖాన్ శిష్యుల్లో అగ్రగణ్యులు==
* సవాయి గంధర్వ
* సురేష్‌బాబు మానె
* హీరాబాయ్ బరోడేకర్ లు.
==వనరులు==
*1. [http://www.itcsra.org/tribute.asp?id=1ITC Sangaata Research Acaademy]
(అబ్దుల్ కరీం ఖాన్ జన్మదినం (నవంబర్ 11 ) సందర్భంగా - )
Almighty
-
Almighty
- Nagaraju Raveender • Palaparti Indrani
The glowing fish
At the bottom of the sea
The twirling baby
Within the womb
The blood- tinged
C...
11 years ago
0 వ్యాఖ్యలు:
Post a Comment