రచన : డా.
సామల సదాశివ ప్రచురణ : చెలిమి ఫౌండేషన్
ప్రథమ ముద్రణ : నవంబర్ 2009
ఈ పుస్తకంలో హిందుస్తానీ శాస్త్రీయ, ఉపశాస్త్రీయ సంగీతపు ముచ్చట్లు ఉన్నాయి. ఇవి ఇంతకు ముందు "వార్త" దినపత్రికలో వచ్చాయి వరుసగా. ఈ సంగీత జ్ఞాపకాల ముచ్చట్లు మరికొన్ని ఇదివరకే రెండు పుస్తకాల రూపంలో వచ్చాయి. అవి "మలయమారుతాలు" మరియు "సంగీత శిఖరాలు" .
ఈ "స్వరలయలు" లో హిందుస్తానీ శాస్త్రీయ సంగీతానికి చెందిన వివిధ "
ఘరానా "లకు సంబంధించిన వివిధ సంగీతకారుల గురించిన సంగతు లున్నాయి.
ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్, ఉస్తాద్ అల్లాదియాఖాన్, పండిత్ జగన్నాథ్ బువా పురోహిత్ , పండిత్ విష్ణు దిగంబర్ పలూస్కర్, వారి కుమారుడు డి.వి. పలూస్కర్, ఉస్తాద్
బడే గులాం అలిఖాన్, ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్, ఉస్తాద్ అమీర్ ఖాన్, స్వరశ్రీ కేసర్‌బాయి కేర్కర్, గంగూబాయి హంగల్, విదుషి హీరాబాయి బరోడేకర్, అన్నపూర్ణా దేవి ( పండిత్ రవి శంకర్ భార్య ), విదుషి మోగూబాయ్ కుర్దీకర్, కిషోరీ అమోణ్‌కర్, పర్వీన్ సుల్తానా, ప్రభా ఆత్రే, పండిత్ జస్‌రాజ్,
ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ ( షహనాయి), ఉస్తాద్ విలాయత్ ఖాన్ ( సితార్ )... ఇట్లా ఎందరో సంగీతకారుల గురించిన సంగతు లున్నాయి. వారు ఎన్ని కష్టాలను, అవమానాలను సహించి సంగీతాన్ని అభ్యసించినారో, ఎలా పాడినారో చదువుతుంటే, అక్కడక్కడ కళ్ళు చెమర్చుతాయి.
ద్రుపద్, ఖయాల్,
ఠుమ్రి, దాద్రా, తాన్, ముర్కీ, మీండ్, వంటి ఎన్నో హిందుస్తానీ శాస్త్రీయ సంగీతపు పారిభాషిక పదాలను మనము ఇందులో చదివి తెలుసుకుంటాము. మారు బిహాగ్, పట్‌దీప్ , యమన్ కల్యాణ్, భైరవి, పూర్వి వంటి ఎన్నో రాగాల గురించి మనము వింటాము.
ఇవే కాక, సినిమా సంగీతానికి చెందిన కె.ఎల్.సైగల్, మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్,
సోను నిగం గురించిన ముచ్చట్లు ఉన్నాయి. ఐతే కొన్ని "మలయమారుతాలు" "సంగీత శిఖరాలు" పుస్తకాలలో ఉన్నవి రిపీట్ ఐనాయి. ఇవి ముచ్చట్లు కాబట్టి అవి అలా అవడం సహజమే.
ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
2 వ్యాఖ్యలు:
అన్యాయం! బుక్ ఫేర్ లో ఈ పుస్తకం ఎలాగో నా కంట పడింది. చాలా నచ్చింది. గబ గబా చదివేసి రివ్యూ రాసేద్దామనుకుంటూ ఉంటే...మీరు కానిచ్చేశారన్నమాట.
మీ పరిచయం చాలా మంది చేత చదివించేలా ఉంది!
అక్కడక్కడ అచ్చుతప్పులూ,వాక్య నిర్మాణంలో దోషాలూ సబ్జెక్టుని బట్టి చూస్తే క్షమించ దగ్గవే అనిపించింది.
అయ్యో ! మీరు వ్రాయబోతున్నారు అని తెలిస్తే, నేను ప్రచురించకపోదును. నేను చేసింది పుస్తక పరిచయం మాత్రమే. మీరు దానిని పూర్తిగా సమీక్షించండి.
Post a Comment