నా గురించి

Thursday, December 3, 2009

సంధ్యా రాగం









పడమటి తెరపై దినకరుడు చిత్రించిన
తైలవర్ణ చిత్రం - సంధ్య

పల్లెపడుచులు తమ ముంగిళ్ళ లోని
అరుగంచులు ఎర్రని జాజుతో దిద్దే వేళ - సంధ్య

రంగురంగుల చీరలు ధరించి వయ్యారంగా
నడచి వచ్చే ఫాషన్ పరేడ్ వనితే - సంధ్య

దూది పింజల్ని ఎర్రని సిరాలో ముంచి
ఆకాశంలోకి విసిరేశారెవరో !

గూళ్ళకు తిరిగొస్తున్న కొంగల బారు
కాన్వాసుపై చుక్కలుచుక్కలుగా
ఒలికిపడిన తెల్లని రంగు

కొండకొమ్మున వేలాడుతున్న రవిబింబం
ప్రకృతి కాంత ముక్కు పుడకలో
రంగులీనుతున్న పగడం

ఒక్కోరోజు ఒక్కోరకంగా
ముస్తాబవుతున్నది
ఈ సంధ్యా సుందరి.

3 వ్యాఖ్యలు:

సిరిసిరిమువ్వ said...

మీ బ్లాగు బాగుందండి. వికీపిడియాలో కూడా విరివిగా వ్రాస్తారన్నమాట. అభినందనలు.

సంతోష్ said...

aite anni sandhya lu okalaa vundavantaaru...!
annie andamgaa vunnayi kadaa..

Unknown said...

మీరు ( సిరిసిరిమువ్వ మరియు సంతోష్ గార్లు )నా బ్లాగును మెచ్చుకున్నందుకు కృతజ్ఞతలు.

Post a Comment

Powered By Blogger

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    10 years ago