
వ్యధలు, వ్యాధులు అక్కడ మామూలే
నిర్ధనము, నిధనము వారికి కొత్తేం కాదు
వాళ్ల పొట్టలు అక్షరమ్ముక్కలకే కాదు
అన్నం మెతుకులకీ నోచుకోవు
కృత్రిమ వేషాలు వారికి తెలియవు
ప్రకృతి ఒడిలో పెరిగే పసిపాపలు వాళ్లు
శ్రమైక జీవనం ఆశ్రమ జీవితం తప్ప
నాగరిక ప్రపంచం వారికి పట్టదు
అడవులు కొండలే వాళ్లకు ఆటపట్టు
ఆత్మాభిమానమే వారికి ఆయువుపట్టు
1 వ్యాఖ్యలు:
మీ నిశిత పరిశీలనతో కూడిన కవిత బారుంది. నేను గిరితనయ పేరుతో మరొక కవిత నా సహవాసి బ్లాగులో రాసాను. వీలయితే చూడగలరు. http://www.sahavaasi-v.blogspot.com/
Post a Comment