నా గురించి

Thursday, October 10, 2013

కేయూరాణి న భూషయంతి పురుషం

కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే
క్షీయన్తే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం


ఇది భర్తృహరి నీతి శతకంలో విద్వత్పద్ధతిని చెప్పే శ్లోకాల్లో ఒకటి.

పురుషుని భుజకీర్తులు అలంకరించవు.  అలాగే, చంద్రుడిలా తెల్లని కాంతితో ప్రకాశించే ముత్యాల హారాలు కూడా అలంకారం కాదు. స్నాన విలేపనాలు, పువ్వులూ, ఎంచక్కా పెంచుకున్న జుట్టూ - ఇవేవీ మనుషునికి నిజమైన అలంకారాన్ని ఇవ్వవు.

ఒక్క వాణి (వాక్కు, మాట) మాత్రమే మనిషిని అలంకరిస్తుంది. ఎటువంటి వాక్కు? యా సంస్కృతా ధార్యతే - తర్క వ్యాకరణాది శాస్త్రములచే చక్కచేయబడి ధరించిన వాక్కు - అంటే చదువు, పాండిత్యం. మిగతా అలంకారాలన్నీ క్షీణించవచ్చు, వాక్కు అనే భూషణం ఎప్పటికీ వన్నె తరగక కలకాలం అలంకరిస్తుంది.  




దండ కడియములు తెలి ముత్యాల సరులు
స్నాన లేపనాలు విరులు జాను కురులు
పురుషునకు గావు తొడవులు పుడమి యందు
వాక్కు నిజమైన భూషయౌ వన్నె గలుగు

1 వ్యాఖ్యలు:

శ్యామలీయం said...

ధన్యవాదాలు - మంచి శ్లోకాలు గుర్తుచేసారు.
ఈ కేయూరాణి న భూషయంతి పురుషం శ్లోకం ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి సంస్కృతపరిచయం కార్యక్రమంలో ప్రారంభశ్లోకంగా నిత్యం వస్తూ ఉండేది. అదే ధోరణిలో పాడుకుని ఆనందించాను.

Post a Comment

Powered By Blogger

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    10 years ago